సమంత ను మతం మార్చుకో మన్నదెవరు ?

గత కొంతకాలంగా సమంత, నాగచైతన్యల పెళ్లిపై రోజుకొక న్యూస్ వస్తూనే వుంది. ఈ క్రమం లోనే మరో కొత్త న్యూస్ సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. అదేంటంటే చైతూతో పెళ్లి ఖరారు చేసుకున్న సమంత హిందూ మతంలోకి మారిందా? ఈ విషయానికి సంబంధించి రెండు ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి.

అయితే ఆ ఫొటోస్ లో సమంత నాగచైతన్యలతోపాటు నాగార్జున కూడా వున్నారు మామూలుగా అయితే వీళ్లు ముగ్గురూ ఒకచోట ఉండటం పెద్ద విశేషం కాకపోయినా సమంత హిందూ మతంలోకి మారిందనే వాదనకు మరింత బలం సమకూర్చేలా ఇందులో చైతన్య, సమంత ఇద్దరూ కుంకుమ బొట్లు పెట్టుకుని పక్కపక్కనే చాప మీద కూర్చున్నారు. వారి వెనుక కొందరు పురోహితులు కూడా నిలబడి ఉన్నారు.

దీన్ని బట్టి చూస్తే హిందూ మాత సంప్రదాయం ప్రకారం పూజా కార్యక్రమాల ద్వారా సమంత హైందవ మతంలోకి వచ్చేసిందని ఫిలింనగర్ వర్గాలు అంటున్నాయి. అయితే ముందుగా చెన్నైలో క్రిస్టియన్ ఆచారాల ప్రకారం పెళ్లి చేసుకున్న తర్వాత హైదరాబాద్‌లో హిందూ సంప్రదాయాల ప్రకారం మళ్లీ పెళ్లి చేసుకుంటారని కూడా అంటున్నారు. దీనిపై అక్కినేని కుటుంబీకులు గానీ, సమంత గానీ ట్విట్టర్‌లో ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.