మారుతి మసాలా టేస్ట్‌ చేస్తారా?

‘బస్టాప్‌’, ఈ రోజుల్లో’ వంటి సినిమాల దర్శకుడు మారుతి అంటే మసాలా సినిమాలకి పెట్టింది పేరు. అయితే మారుతి ఘాటెక్కించే సినిమాలే కాదు, ఘాటెక్కించే వంటకాలతోనూ అలరిస్తానంటున్నాడు ఇప్పుడు.. ‘బస్‌ స్టాప్‌’ వంటి సినిమాలతో కొత్త ఆర్టిస్టులను తెలుగు తెరకు పరిచయం చేసి, చిన్న సినిమాలతోనే పెద్ద విజయాల్ని అందుకున్న దర్శకుడు మారుతి, తన పేరుని తెలుగు సినీ పరిశ్రమలో ఓ బ్రాండ్‌గా మార్చేశాడు. ‘ప్రేమకథా చిత్రమ్‌’, ‘భలే భలే మగాడివోయ్‌’ సినిమాలతో ట్రెండ్‌ మార్చి, తాను అన్ని రకాల సినిమాలూ తీయగలననిపించుకున్నాడు. ఇటీవల వెంకటేష్‌తో మారుతి రూపొందించిన ‘బాబు బంగారం’ సూపర్‌ హిట్‌ అయ్యింది.

ఈ దర్శకుడు తాజాగా రెస్టారెంట్‌ బిజినెస్‌పై దృష్టిపెట్టాడట. త్వరలోనే మారుతి గ్రూప్‌ నుంచి కొత్త రెస్టారెంట్స్‌ రానున్నాయని సమాచారమ్‌. విజయదశమి నాడు రెస్టారెంట్స్‌ బిజినెస్‌పై మారుతి ప్రకటన చేయనున్నాడని తెలియవస్తోంది. సినిమా విషయాలకొస్తే మారుతి, ‘భలే భలే మగాడివోయ్‌’ సినిమాతో తిరుగులేని విజయం అందుకున్నాడు. తాజాగా వెంకీ వంటి పెద్ద స్టార్‌ని యంగ్‌ అండ్‌ రొమాంటిక్‌ స్టార్‌గా చూపించి మరో హిట్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. చిన్న సినిమాలకు నిర్మాణ భాగస్వామ్యంలో పాలు పంచుకుంటున్నాడు. అంతేకాకుండా స్టోరీ రైటర్‌గానూ పని చేస్తున్నాడు. త్వరలోనే నానితో ‘భలే భలే మగాడివోయ్‌’ చిత్రానికి సీక్వెల్‌ తీయనున్నాడట. సో మారుతి ఫుల్‌ బిజీ బిజీ. దటీజ్‌ మారుతి.