పవన్‌ స్పీడ్‌ని తట్టుకోగలరా?

లేట్‌ అయినా లేటెస్ట్‌గా పవన్‌కళ్యాణ్‌ ఎంట్రీ ఉంటుంది. సినిమా షూటింగ్‌కి అయినా అంతే. ‘కాటమరాయుడు’ షూటింగ్‌లో పవన్‌ పాల్గొంటున్నాడు. కంప్లీట్‌గా ప్రిపేర్‌ అయి, మైండ్‌ని పూర్తిగా సినిమా షూటింగ్‌ మీదనే పెట్టి పవన్‌ సెట్స్‌లో కనిపిస్తోంటే షూటింగ్‌ సిబ్బంది ఆశ్చర్యపోతున్నారట. అనుకున్న షెడ్యూల్‌ అనుకున్న విధంగా పూర్తి చేయడానికి పవన్‌ పూర్తి ప్లానింగ్‌ని ముందే ప్రిపేర్‌ చేశాడని సమాచారమ్‌. ఈ సినిమా షూటింగ్‌ని త్వరగా కంప్లీట్‌ చేయాలని పవన్‌ అనుకుంటున్నాడన్న సంగతి తెలిసిందే. అందుకు తగ్గట్టుగానే ‘కాటమరాయుడు’ సినిమా షూటింగ్‌ సూపర్‌ స్పీడుతో జరుగుతోంది. ఆ తర్వాత త్రివిక్రమ్‌ సినిమాకి పవన్‌ రెడీ అవ్వనున్నాడట.

 అందుకే ‘కాటమరాయుడు’ తర్వాత పవన్‌ గ్యాప్‌ కూడా ఎక్కువేమీ తీసుకోడని తెలుస్తోంది. అంంతేకాదు త్రివిక్రమ్‌ సినిమా చేస్తూనే ఇంకో వైపు దాసరి నిర్మించే సినిమాకీ డేట్స్‌ ఇవ్వాలని ప్లానింగ్‌లో పవన్‌ ఉన్నాడని సమాచారమ్‌. ఇంత స్పీడుగా పవన్‌ ఇంతకు ముందెన్నడూ లేడు. పవన్‌ జోరు చూస్తోంటే, ఈ సారి పవన్‌ నుంచి వరుసపెట్టి సినిమాలు రావడం పక్కా అనిపిస్తోంది. మరో పక్క స్పీడుగా రెండు మూడు సినిమాలు చేసేసి, రాజకీయాల్లో మళ్లీ యాక్టివ్‌ అవుదామనే ఉద్దేశ్యంలో ఉన్నట్లున్నాడు పవన్‌. మొత్తానికి పవన్‌ స్పీడుగా ఉన్నాడు సరే, మరి ‘కాటమరాయుడు’ టీమ్‌ ఆ స్పీడ్‌ని తట్టుకోగలదా? పవన్‌ అనుకున్న షెడ్యూల్‌ని పూర్తి చేయగలదో లేదో చూడాలి మరి.