గ్యారేజ్ రేంజ్ లో ‘మజ్ను’

ఈ మధ్యకాలం లో వరుస విజయాలతో దూసుకెళుతున్న యంగ్ హీరో నాచురల్ స్టార్ నాని. ఈ హీరోనుంచి రాబోతున్న నెక్స్ట్ సినిమా మజ్ను రీలీజ్ కి రెడీగా వుంది. పెద్దగా పరిచయం లేని ఒక చిన్న డైరెక్టర్ విరించి వర్మ, కొత్త హీరోయిన్లతో ఈ సినిమా చేసాడు నాని. విరించి వర్మ ఇంతకముందు తీసిన సినిమా ఉయ్యాల జంపాల.

అయితే ఇప్పడు ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్లో జనతాగ్యారేజ్ తర్వాత భారీ బిజినెస్ చేసేసిందట. అమెరికా లో ఒక డిస్ట్రిబ్యూటర్ ఈ సినిమాని 2.5 కోట్లకి కొన్నాడట. కొని ఇప్పటికే 3 కోట్లవరకు బిజినెస్ కూడా చేసేసాడట. అయితే నని ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ లకు వచ్చిన స్పందనని బట్టే డిస్ట్రిబ్యూటర్స్, బయ్యర్స్ ఇంటరెస్ట్ చూపిస్తున్నారని సమాచారం.

ఇక ఇంతకుముందు వచ్చిన నని సినిమాలు భలేభలే మగాడివోయ్, జెంటిల్మెన్ సినిమాలు ఓవర్సీస్‌లో మంచి వసూళ్లనే రాబట్టాయి. మరి ఇప్పటికే మంచి బిజినెస్ జరుపుకున్న మజ్ను సినిమా కూడా ఓవర్సీస్‌ ప్రేక్షకులని అలరించాలని కోరుకుందాం.