అమెరికాలో అదరగొడుతోన్న గ్యారేజ్

భారీ అంచనాల నడుమ విడుదలైన యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ తాజా సినిమా ‘జనతా గ్యారేజ్‌’ ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ సినిమాకు తొలిరోజు కలెక్షన్లు భారీగా ఉన్నట్టు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాలు, కేరళతో పాటు ప్రపంచవ్యాప్తంగా రెండు వేలకు పైగా థియేటర్లలో ‘జనతా గ్యారేజ్‌’ ప్రేక్షకుల ముందుకువచ్చింది.

అయితే ఈ సినిమా అమెరికా లో దుమ్మురేపుతోంది. వారం మధ్యలో విడుదలైనా జనతా గ్యారేజ్‌ అగ్రరాజ్యంలో అద్భుతంగా ఆడుతోందని, హిందీ పెద్ద సినిమాలను సైతం తలదన్నేలా ఈ సినిమాకు కలెక్షన్లు ఉన్నాయని బాలీవుడ్‌ ట్రేడ్‌ అనలిస్ట్‌ తరణ్‌ ఆదర్శ్ ట్విట్టర్‌లో తెలిపారు. అమెరికాలో ఈ సినిమా సెన్సేషనల్‌ ప్రారంభ వసూళ్లను సాధిస్తున్నదని, ప్రస్తుతం అందుతున్న సమాచారం బట్టి మొదటి రోజు కలెక్షన్లు రూ. 3.76 కోట్లు వచ్చినట్టు తన ట్విట్టర్ అకౌంట్ లో తెలియచేసారు.

Janatha-report