చిరంజీవి రీ ఎంట్రీలో వస్తోన్న సినిమా ‘కత్తిలాంటోడు'(వర్కింగ్ టైటిల్). ఈ సినిమాకి నిర్మాతగా రాంచరణ్ పని చేస్తున్నాడు. నిన్న మొన్నటి దాకా ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుందని వార్తలు వచ్చాయి. అయితే ఈ సినిమా సంక్రాంతికి రావడం కష్టమే అంటున్నారు. కానీ నిర్మాత రాంచరణ్ మాత్రం ఎలాగైనా ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలనే యోచనలో ఉన్నాడట.
అంతేకాదు ఒక పక్క తాను ‘ధృవ’ సినిమాలో నటిస్తూనే ఈ సినిమా కోసం కూడా ప్లానింగ్స్ వేస్తున్నాడు. మామ అల్లు ఆరవింద్ పర్యవేక్షణలో ఈ సినిమాకి సంబంధించిన పనులు శరవేగంగా జరిగుతున్నాయి. ఇప్పటికే షూటింగ్ పనులు వేగంగా జరుగుతున్నపటికీ సినిమా మాత్రం ముందుకు కదలడం లేదంటూ గాసిప్స్ విన వస్తున్నాయి. దాంతో అభిమానుల్లో సినిమా విడుదలపై అసంతృప్తి నెలకొంది.
కానీ రీ ఎంట్రీలో వస్తోన్న సినిమా కావడంతో ఈ సినిమాని అనుకున్న టైంకే విడుదల చేయాలని భావిస్తున్నాడట రాంచరణ్. అనుకున్న డేట్ ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్సవ్వకూడదనుకుంటున్నాడట. వినాయక్ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ముద్దుగుమ్మ కాజల్ హీరోయిన్ నటిస్తోంది. కాజల్ ఈ సినిమా కోసం కొంచెం బొద్దుగా, ముద్దుగా తయారయ్యిందట. ‘సర్ధార్’, బ్రహ్మూెత్సవం’ సినిమాలతో ఫెయిలైన కాజల్‌కి ఈ మెగా ఛాన్స్ రావడం మరో గోల్డెన్ ఛాన్స్.