సాగరకన్యకి టాలీవుడ్‌ గాలం

శ్రీలంక బ్యూటీ జాక్వెలైన్‌ ఫెర్నాండెజ్‌, బాలీవుడ్‌లో హీరోయిన్‌గా వరుస విజయాల్ని, అంతకు మించి ఆఫర్లను సొంతం చేసుకుంటోంది. ఈ బ్యూటీకి తెలుగు సినీ పరిశ్రమ నుంచి గాలం వేస్తున్నారట. టాలీవుడ్‌ నుంచి ఆఫర్లు వస్తున్న మాట వాస్తవమేనంటోంది జాక్వెలైన్‌ ఫెర్నాండెజ్‌. టైగర్‌ ష్రాఫ్‌తో ఈ భామ ‘ఎ ఫ్లైయింగ్‌ జాట్‌’ అనే సినిమాలో నటిస్తోంది. మంచి స్విమ్మర్‌. అలాగే, డీప్‌ సీలో స్మిమ్మింగ్‌ చేయడమంటే ఇష్టమట. ఎంతో రిస్క్‌తో కూడుకున్నది ఈ డీప్‌ స్విమ్మింగ్‌.

సముద్ర అంతర్భాగంలో డైవింగ్‌ చేస్తూ, తిమింగలంతో సాహసాలు చేసిన జాక్వెలైన్‌ ఫెర్నాండెజ్‌, ఆ ఫొటోల్ని సోషల్‌ మీడియాలో పెట్టింది. ఆమె సాహసానికి అంతా ఫిదా అయిపోయారు. అంతరించిపోయే జాతిలోకి తిమింగలాలు చేరిపోయాయనీ, వాటిని సంరక్షించాలని పిలుపునిస్తోంది జాక్వెలైన్‌. తెలుగు సినిమాల విషయానికొస్తే ఓ ప్రముఖ హీరో సినిమా కోసం జాక్వెలైన్‌ని సంప్రదిస్తే డేట్స్‌ ఖాళీ లేవని ఆ బిగ్‌ ఆఫర్‌ని జాక్వెలైన్‌ వదిలేసుకుందని సమాచారమ్‌.

ప్రస్తుతానికి ఛాన్స్‌ వదులుకున్నా, తెలుగులో కూడా నటించడానికి తనకేం అభ్యంతరం లేదంటోంది ముద్దుగుమ్మ జాక్వెలైన్‌. భవిష్యత్తులో అయినా మంచి ఆఫర్‌ వస్తే తెలుగులో తప్పకుండా నటిస్తానంటోంది. మరి ఈ సాహసాల సుందరి తెలుగులో ఎంట్రీ ఎప్పుడు ఇస్తుందో చూడాలిక. అయితే జాక్వెలైన్‌కి బాలీవుడ్‌లో ఉన్న డిమాండ్‌ అలాంటిలాంటిది కాదు. ఐదు కోట్లు ఇచ్చినా తెలుగులో ఈ భామ నటిస్తుందా?