తమన్నా ఐటెం సాంగ్ కి అంతా?

తెలుగు-తమిళ సినిమాలతో తమన్నా బిజీగానే వుంది. ఇటీవలే ఓ తమిళ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయడానికి కూడా ఓకే చెప్పిందని టాక్. తమన్నా క్రేజ్ ఒక రేంజ్ లో వుంది కనుక, స్పెషల్ సాంగ్ కి ఆమె తీసుకునే రెమ్యునరేషన్ కూడా హైలెవల్‌లోనే ఉందట.

విశాల్ హీరోగా చేస్తున్న ‘కత్తి సండై’  చిత్రంలో ఆమె ఈ స్పెషల్ సాంగ్ చేయనుంది. ఈ సినిమా తెలుగులో ‘ఒక్కడొచ్చాడు’ పేరుతో అక్టోబర్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ ప్రత్యేక గీతం చిత్రీకరణ కోసం, పాండిచ్చేరిలో నాలుగు భారీ సెట్లు వేస్తున్నారు. వారం రోజుల పాటు ఈ పాటను షూట్ చేయనున్నారు. ఈ ఒక్క పాటకు అక్షరాలా తమ్మూకి ముట్టిన పారితోషికం కోటి రూపాయలని తెలుస్తోంది