అగ్ర దర్శకుడి ఇంటిపై బాంబులతో దాడి

ఏదయినా పెద్ద హీరోల సినిమాలు ప్లాప్ అయినప్పుడు ఆ హీరో అభిమానులు ఆ సినిమా దర్శక నిర్మాతలపై దాడికి తెగబడుతుంటారు. తెలుగు తమిళ సినిమా ఇండస్ట్రీలలో అప్పుడప్పుడూఇలాంటి సంఘటనలు చూస్తూవుంటాం. అయితే కోలీవుడ్ కి చెందిన ఒక టాప్ డైరెక్టర్ ఇంటిపై ఏకంగా బాంబులతో దాడి చేసారు ఆ దర్శకుడు ఎవరో కాదు తమిళం తో పాటు తెలుగులో కూడా విజయవంతమైన సినిమా సింగం సినిమా డైరెక్టర్ హరి.

అయితే ఆ దాడి చేసింది మాత్రం ఏ హీరో అభిమానులు మాత్రం కాదు. తన పక్కింటివాళ్లే నట. కార్ పార్కింగ్ విషయంలో చిన్న గొడవ అయిన కారణంగా కార్తీక్, కరుప్ప స్వామి అనేవాళ్ళు గొడవపడి ఛాంప్పేస్తాం అనికూడా బెదిరించారట. అక్కడితో ఆగకుండా హరి ఇంటిపై రెండు బాంబులు వేసారట. దీంతో భయబ్రాంతులకు గురైన హరి వెంటనే విరుంబాక్కం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చిన్న గొడవని మనసులో పెట్టుకుని ఇంతపెద్ద దాడి చేసారని హరి ఆవేదన వ్యక్తం చేసాడు.