ఇది మహేష్ బాహుబలి!

సౌత్ సినీ ఇండస్ట్రీలో ఓ కొత్త న్యూస్ చక్కర్లు కొడుతోంది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, తమిళ స్టార్ హీరో విజయ్ ఓ సినిమా చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా బడ్జెట్ కూడా దాదాపు రూ.350 కోట్లట. ఈ క్రేజీ మూవీని నటి కుష్బు భర్త, ప్రముఖ డైరెక్టర్ సుందర్.సి డైరెక్ట్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్ లో ఇదే హాట్ టాపిక్ గా మారింది. బడ్జెట్, కాస్టింగ్ విషయాలు వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజమేనన్న టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా రెహమాన్, ఆర్ట్ డైరెక్టర్ గా సాబు శిరిల్, విఎఫ్ఎక్స్ కోసం కమల్ కణ్ణన్ వంటి హేమాహేమీలు పనిచేబోతున్నట్లు తెలుస్తోంది.

ఐతే ఈ మూవీలో మహేష్, విజయ్ కలిసి నటించడం లేదు. తెలుగు వెర్షన్ లో మహేష్ బాబు, తమిళ్ వెర్షన్ లో విజయ్ నటిస్తారట. హిందీలో మరో హీరో యాక్ట్ చేస్తాడని తెలుస్తోంది. అన్ని వెర్షన్స్ కలిపి బడ్జెట్ రూ.350 కోట్లు. ఇంత భారీ బడ్జెట్ మూవీ వర్క్ ఔట్ అవుతుందా అంటే.. ఏదో ఒక వెర్షన్ హిట్ అవకపోతుందా అన్నది డైరెక్టర్ ధీమా అట. ప్రముఖ తమిళ నిర్మాణ సంస్థ శ్రీ తేనాండాల్ ఫిల్మ్స్ మూవీని నిర్మిస్తోంది. ఈ సంస్థకు ఇది వందో చిత్రం కావడంతోనే ఇంత హడావిడి.

మరి ఈ మూవీ నిజంగానే పట్టాలెక్కుతుందా.. లేక న్యూస్ గానే మిగిలిపోతుందా అన్నది లెట్స్ వెయిట్ అంట్ సీ..!