హాటెస్ట్ ఉమెన్‌గా ప్రియాంక

బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వెళ్లి విజయపరంపరలో దూసుకుపోతున్న నటి ప్రియాంక చోప్రా ప్రస్తుతం ఏం చేసినా సంచలనమే. ప్రియాంకకు సంబంధించి ఒక్క చిన్న వార్త బయటికి తెలిసినా అభిమానులకి కోలాహాలమే. అలాంటిది ప్రియాంక ఫొటో పాపులర్ మాగజైన్ మాగ్జిమ్ కవర్ పేజిలో వచ్చిందంటే అదో పెద్ద వార్తేనని ఈ పాటికే మీకు అర్థం అయే ఉంటుంది. ఎందుకంటే మాగ్జిమ్ అనేది పురుషుల మ్యాగజైన్. ఇంతకీ పురుషుల మ్యాగజైన్‌లో ప్రియాంక ఫొటో చిత్రించడానికి కారణం ఏమిటనేదే కదా మీ డౌట్.

పాపులర్ మాగజైన్ మాగ్జిమ్ పాఠకుల టెంపరేచర్ పెంచేందుకు నెలానెలా ఒక కొత్త ట్రెండ్‌ను ఫాలో అవుతూ ఉంటుంది. ఎప్పుడూ తన సంచలనాలను తానే అధిగమిస్తూ పాఠకుల మనసు దోచుకుంటుంది. ఈ మధ్యే అలాంటి ఒక కొత్త సంచలనాన్నే సృష్టించింది. టాప్ 100 హాటెస్ట్ అందాల భామల కోసం నిర్వహించింది. సర్వేలో ప్రియాంను నెంబర్ వన్‌గా ఎంపిక చేసింది. మూడు సంవత్సరాలుగా ప్రియాంకే నంబర్ వన్‌గా కొనసాగుతున్న విషయం తెలిసిందే.

హాటెస్ట్ ఉమెన్‌గా ప్రియాంక కుర్రకారు హృదయాల్ని కొల్లగొట్టిందనడంలో ఎలాంటి సందేహం లేదని పత్రికా యాజమాన్యం చెప్పుకొచ్చింది. దీనికి ప్రియాంక స్పందిస్తూ ‘ఇక్కడ నా కొత్త కవర్ ఫొటో ఉంది. థ్యాంక్యూ మాగ్జిమా’ అంటూ రాసుకొచ్చింది.