రకుల్‌ ఆ విషయంలో చాలా గ్రేట్‌

హీరోయిన్‌గానే కాదు, చాలా తక్కువ టైంలో టాప్‌ హీరోయిన్‌గా ఎదిగింది స్మైలీ బ్యూటీ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. ఈ అమ్మడులో కేవలం గ్లామర్‌ క్వాలిఫికేషనే కాదు చాలా క్వాలిఫికేషన్స్‌ ఉన్నాయి. సామాజిక సేవలో ఈజీగా మిళితమైపోతుంది. తన తోటి నటీనటులతో చాలా ఫ్రెండ్లీగా మూవ్‌ అవుతూ ఉంటుంది. అంతేకాదు ఈమె విషయంలో దర్శక, నిర్మాతలకు కూడా ఏ రకమైన ప్రోబ్లమ్స్‌ ఉండవట. అనుకున్న టైంకే షూటింగ్‌లో పాల్గొనడం, ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండడంతో అనుకున్న టైంకి సినిమాని పూర్తి చేయడంలో తన పాత్ర ఎంతో ఉంటుందంటారు.

అంతేకాదు సినిమా షూటింగ్‌లో పాల్గొంటే తన పని అయిపోయినట్లే అనుకోకుండా సినిమా ప్రమోషన్‌ విషయంలో కూడా ఈ భామ ముందుంటుంది. ఆడియో ఫంక్షన్స్‌లో జోరుగా డాన్సులేసి ఆదరహో అనిపిస్తుంది. చిన్న సినిమా పెద్ద సినిమా అని చూడకుండా కథలోని తన పాత్ర నచ్చితే వెంటనే ఓకే చేస్తుంది. ఇండస్ట్రీకొచ్చిన కొద్ది రోజుల్లోనే తెలుగు నేర్చేసుకుంది. సినిమా ఇంటర్వ్యూల్లో చక్కగా తెలుగులో సమాధానమిస్తూ ఉంటుంది. అంతేకాదు ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలో డబ్బింగ్‌ కూడా చెప్పుకుని తన సీనియర్‌ హీరోయిన్స్‌కి సవాల్‌ విసిరింది. ఇలా తన తోటి నటీనటులే కాకుండా సెట్‌లో ఉన్న ప్రతీ చిన్న, పెద్ద టెక్నీషియన్స్‌ పట్ల కూడా చాలా రెస్పాన్స్‌బుల్‌గా మెలగుతూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ రకుల్‌. ఎప్పుడూ హాయిగా నవ్వుతూ ఉండే ఈ స్మైలీ బ్యూటీకి అందుకే . సక్సెస్‌, ఫెయిల్యూర్స్‌ని కూడా పెద్దగా పట్టించుకోకుండా ఆఫర్స్‌ మీద ఆఫర్స్‌ వెల్లువెత్తుతున్నాయి. దటీజ్‌ రకుల్‌.