జులై 7న ర‌ష్మి ‘అంతం’

గుంటూరు టాకీస్ లాంటి హిట్ చిత్రంతో యువ‌తను ఆకట్టుకుంది రష్మి గౌతమ్. ఆమె ప్రదాన‌పాత్రలో న‌టించిన చిత్రం అంతం జులై 7 న విడుద‌లవుతోంది. ద‌ర్శక‌ నిర్మాత జి.ఎస్.ఎస్.పి.కళ్యాణ్ తెరకెక్కించిన స‌స్పెన్స్ థ్రిల్లర్ అందరినీ ఆకట్టుకోవడం ఖాయమని చిత్రబృందం చెప్తోంది. అంతంలో గ్లామర్ తో పాటూ నటనకు ప్రాధాన్యమున్న పాత్రలో రష్మి నటించింది. సెన్సార్ పూర్తిచేసుకున్న ఈ మూవీకి ‘ఏ’ సర్టిఫికెట్ లభించింది. సెన్సార్ సర్టిఫికేట్ వివరాలు చెప్పిన కళ్యాణ్ మా అంతం చిత్రం ఇప్పటివరకు రాని అద్భుతమైన సస్పెన్స్ థ్రిల్లర్ అని అన్నారు. ఈ చిత్రం చూసిన త‌రువాత స్క్రీన్ ప్లేతో పాటూ రష్మి నటన గురించి అంతా ప్రశంసిస్తారని ధీమా వ్యక్తంచేశారు.

అంతం రూపకల్పనలో సహకరించిన ఇండస్ట్రీ పెద్దలు, శ్రేయోభిలాషులకు కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. సగటు ప్రేక్షకుడిని అలరించడమే లక్ష్యంగా తాము అంతం చిత్రాన్ని మలచినట్లు వెల్లడించారు.