చరణ్‌తో సమంత ఇంక అంతేనా?

సమంత ప్రెజెంట్‌ ఉన్న యంగ్‌ హీరోలందరితోనూ జత కట్టింది. ఒక్క మెగా పవర్‌స్టార్‌ చరణ్‌తో తప్ప. ఎందుకో మరి ఈ ముద్దుగుమ్మకి చరణ్‌తో జతకట్టే అవకాశం రాలేదు ఇంతవరకూ. తన కన్నా ఎంతో వెనక వచ్చిన ముద్దుగుమ్మ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ చరణ్‌తో రెండో సారి అవకాశం దక్కించుకుంది. మరి ఈ మద్దుగుమ్మకి ఎందుకో ఒక్కసారి ఛాన్స్‌ కూడా రాలేదు. త్రివిక్రమ్‌ హీరోగా సమంత ఫిక్స్‌ అయిపోయింది. ఫ్యూచర్‌లో చరణ్‌ త్రివిక్రమ్‌తో చేయబోయే సినిమా వరకూ సమంతని చరణ్‌ పక్కన చూడలేమా? అని అటు సమంత అభిమానులు, ఇటు మెగా అభిమానులు కూడా చెవులు కొరుక్కుంటున్నారట.

పవన్‌కళ్యాణ్‌తో సమంత చేసిన ‘అత్తారింటికి దారేది’ సినిమా సూపర్‌డూపర్‌ హిట్‌ అయ్యింది. మర చరణ్‌తో గనుక నటిస్తే ఈ ముద్దుగుమ్మకి హిట్‌ పక్కా అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు.. మహేష్‌తో ఈ ముద్దుగుమ్మ చేసిన ‘దూకుడు’ సినిమా బడా హిట్‌.. రెండో సారి ‘బ్రహ్మూెత్సవం’లో జతకట్టింది. ఆ సినిమా ఫెయిల్యూర్‌కు అనేక కారణాలు. ‘బృందావనం’తో ఎన్టీఆర్‌తో జతకట్టి హిట్టు కొట్టింది. మరో మాస్‌ సినిమా ‘జనతా గ్యారేజ్‌’తో హిట్‌కు సిద్దంగా ఉంది. ఇక నాగచైతన్యకు ఈ భామ లక్కీ బోణీ కొట్టి, హిట్‌ దిశగా ప్రయాణం చేయిస్తూనే ఉంది. నాలుగోసారి చైతూకి లక్‌ తెచ్చిపెట్టేందుకు కూడా రెఢీ అయిపోతోంది. ‘బ్రూస్‌లీ’ సినిమాలో జంటగా నటించిన రకుల్‌నే చరణ్‌ తాజా మూవీ ‘ధృవ’లో హీరోయిన్‌గా ఎంచుకున్నాడు. ఆ ఛాన్స్‌ సమ్మూ బ్యూటీకి ఇచ్చుంటే పెయిర్‌ ఫ్రెష్‌గా ఉండేది కదా అని ఫ్యాన్స్‌ అనుకుంటున్నారట.