గత ఎన్నికలకు ముందు వరకు ఎన్నికల్లో తానే గెలుస్తానని తిరుగులేని మెజార్టీతో సీఎం అవుతానని వైసీపీ అధినేత జగన్ ఎంతో ధీమాతో ఉండేవారు. ఎన్నికల ముందు వరకు ఎంతో ధీమాతో ఉన్న జగన్ ఎన్నికల్లో మాత్రం బొక్కబోర్లాపడ్డాడు. ప్రతిపక్ష నేతగా సరిపెట్టుకున్నాడు. ఎన్నికల తర్వాత కూడా జగన్ రోజు రోజుకు రాజకీయంగా వీక్ అవుతూ వస్తున్నాడు. వైసీపీ నుంచి గత ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేల్లో ఇప్పటికే 21 మంది అధికార టీడీపీలోకి జంప్ చేసేశారు. ఈ క్రమంలోనే […]
Tag: YS Jagan
జగన్ కల ఫలిస్తుందో.. కోరిక నెరవేరుతుందో చూడాలి
2019లో ఎట్టి పరిస్తితిలోనూ ఏపీలో అధికార పీఠాన్ని కైవసం చేసుకోవాలని పంతం మీదున్న జగన్.. తన పట్టుదలను నెరవేర్చుకునేందుకు, తన కలల పీఠం ఎక్కేందుకు ఎంతటి త్యాగానికైనా సిద్ధంగా ఉన్నాడు! తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ సమాచారం ఈ విషయాన్ని వెల్లడిస్తోంది. మొన్నామధ్య ప్రధానితో కలిసేందుకు జగన్ ఢిల్లీ వెళ్లడం.. దీనిపై టీడీపీ పెద్ద ఎత్తున రచ్చచేయడం తెలిసిందే. ఇక, ఇప్పుడు జగన్ ఢిల్లీ టూర్ వెనకాల జరిగిందేంటో బయటకు వస్తోంది. గత వారంలో తెలుగు రాష్ట్రాల […]
ఎన్టీఆర్ బాటలో జగన్… సీఎం అవుతాడా..!
విపక్షం వైసీపీ నేత జగన్ 2019 ఎన్నికలపై ఇప్పటి నుంచే పక్కా ప్లాన్‌తో దూసుకుపోతున్నారా? ఎట్టి పరిస్థితిలోనూ 2019లో అధికారంలోకి వచ్చి తీరాలని గట్టి పట్టుదలతో ఉన్న యువనేత ఆ దిశగా తన వ్యూహాన్ని అమలు చేయాలని నిర్ణయించారా? ఈ క్రమంలో దశాబ్దాల కిందట టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, అన్నగారు ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చేందుకు అనుసరించిన వ్యూహాన్ని ఇప్పుడు జగన్ అనుసరిస్తున్నాడా? అంటే ఔననే సమాధానమే వస్తోంది. ఏపీలో అధికారం చేపట్టాలనేది జగన్ కి అత్యవసరమైన విషయం. […]
ఏపీలో వైసీపీ ముందస్తు వ్యూహం
ఏపీ పాలిటిక్స్‌లో నిన్నటి వరకు కాస్త స్తబ్దుగా ఉన్న ప్రతిపక్ష వైసీపీ దూకుడు పెంచుతోంది. వచ్చే సాధారణ ఎన్నికలకు మరో రెండేళ్ల టైం ఉన్నా ఒకవేళ ఆరు నెలల ముందుగా ఎన్నికలు వచ్చినా విజయం సాధించేలా పోరాటానికి సమాయత్తమవుతోంది. ఈ క్రమంలోనే జగన్ పార్టీ పటిష్టతకు, ఏపీలోని 175 నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థుల ఎంపిక కోసం సరికొత్త ప్లాన్‌తో ముందుకు వెళుతున్నారు. ఈ క్రమంలోనే జగన్ నియోజకవర్గ, జిల్లా స్థాయి, స్టేట్ స్థాయి ప్లీనరీల నిర్వహణ ప్లాన్ […]
రాయలసీమలో వైసీపీకి క్యాండెట్స్ కొరత
రాయల సీమ! వైసీపీ అధినేత జగన్‌కి సొంత ప్రాంతం. ఈ ప్రాంతం జగన్‌కి కంచుకోట అనే అనుకుంటారు ఎవరైనా! అయితే, పరిస్తితి అందుకు భిన్నంగా ఉంది. జగన్ ఇప్పుడు ఇక్కడ తన ప్రాబల్యాన్ని కోల్పోతున్నారట! కడప, చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో జగన్ హవా సాగుతుందని అందరూ అనుకుంటున్నారు. కానీ, పరిస్థితి ఇందరు భిన్నంగా ఉందట. ఈ జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాలకు ఇంచార్జులు కూడా లేరట. నిజానికి గత 2014 ఎన్నికల్లో అనంతపురం జిల్లాను మినహాయిస్తే మిగతా […]
వైసీపీలోకి కోట్ల ఫ్యామిలీ….జగన్ రెండు ఆఫర్లు
రాయలసీమలోని కర్నూలు జిల్లాలో గత దశాబ్దంన్నర కాలంగా టీడీపీ అష్టకష్టాలు ఎదుర్కొంటోంది. వైఎస్ గాలిలో 2004, 2009 ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ దూకుడు ముందు టీడీపీ తేలిపోయింది. గత ఎన్నికల్లో వైసీపీ టీడీపీకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. వైసీపీ దూకుడుతో టీడీపీ కేవలం మూడు ఎమ్మెల్యే సీట్లు మాత్రమే గెలిచింది. పత్తికొండ నుంచి సీనియర్ రాజకీయ దిగ్గజం కేఈ.కృష్ణమూర్తి, బనగానపల్లి నుంచి బీటీ.జనార్థన్‌రెడ్డి, ఎమ్మిగనూరు నుంచి జయనాగేశ్వర్‌రెడ్డి విజయం సాధించారు. వైసీపీ 11 ఎమ్మెల్యేలతో పాటు కర్నూలు, […]
వైసీపీ అనుకూల వర్గానికి టీడీపీ గాలం!
ఏపీలో రాజకీయ వాతావరణం మారిపోతోందా? వైసీపీకి మద్దతిస్తున్న కొన్ని వర్గాలు ఇప్పుడు ఆ పార్టీకి హ్యాండివ్వాలని డిసైడ్ అయ్యాయా? అదే సమయంలో అధికార టీడీపీ పంచన చేరాలని కూడా నిర్ణయించుకున్నాయా? అంటే ఔననే సమాధానమే వస్తోంది. ప్రస్తుతం దళిత వర్గాల ఓటు బ్యాంకు ఏ పార్టీకైనా ఇంపార్టెంట్‌గా మారింది. దీంతో వీరిని మచ్చిక చేసుకునేందుకు ప్రతి పార్టీ ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఇక, వైసీపీకి ఈ విషయంలో కలిసొచ్చిన అంశం ఏంటంటే.. కోర కుండానే నిన్న మొన్నటి వరకు […]
కడపలో జగన్ గ్రాఫ్ ఎందుకు తగ్గుతోంది….రీజన్స్ ఇవే.
కడప జిల్లా అంటే వైఎస్ ఫ్యామిలీకి బలమైన ఖిల్లా. కడప జిల్లా నుంచే ప్రారంభమైన వైఎస్ ఫ్యామిలీ జిల్లా రాజకీయాలతో పాటు సమైక్యాంధ్ర రాజకీయాలు, చివరిగా ఢిల్లీ రాజకీయాలను సైతం (అప్పట్లో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి ఢిల్లీలోను హవా సాధించారు) శాసించింది. 2004, 2009, 2014 ఎన్నికల్లో అయితే ఈ జిల్లాలో కాంగ్రెస్ ఆ తర్వాత వైసీపీ పూర్తి ఆధిపత్యం సాధించాయి. ఈ మూడు ఎన్నికల్లోను జిల్లాలోని కడప, రాజంపేట రెండు ఎంపీ స్థానాలు ఒక్కసారి […]
పశ్చిమగోదావరి వైసీపీలో జగన్ బాంబు
2014 ఎన్నికలకు 2019 ఎన్నికలకు ఏపీ వైసీపీలో రాజకీయ పరిణామాలు ఎలా మారతాయో ఊహకే అందడం లేదు. గత ఎన్నికల్లో పశ్చిమగోదావరి జిల్లాలో వైసీపీ జిల్లాలో ఖాతా తెరవలేదు. 15 ఎమ్మెల్యే స్థానాలతో పాటు 3 ఎంపీ సీట్లలోను ఓడిపోయింది. దీంతో వచ్చే ఎన్నికల్లో ఇక్కడ టీడీపీపై పైచెయ్యి సాధించేందుకు జగన్ గత ఎన్నికల్లో పోటీ చేసిన వాళ్లలో చాలామందిని పక్కన పెట్టేయడం ఖాయంగా కనిపిస్తోంది. జగన్ ఈ జిల్లా వరకు తీసుకునే నిర్ణయాలు వైసీపీలో పెద్ద […]