`తూర్పు` వైసీపీలో టికెట్ల లొల్లి షురూ!! 

ప్ర‌తిప‌క్ష వైఎస్సార్‌సీపీలో గ్రూపు రాజ‌కీయాల‌కు, అంత‌ర్గ‌త కుమ్ములాట‌ల‌కు కొద‌వ‌లేదు. ఇవి నిత్యం ర‌గులుతూనే ఉన్నాయి. గోదావ‌రి జిల్లాల్లో ఎలాగైనా ఈసారి ఎక్కువ సీట్లు సాధించాల‌ని వైసీపీ అధినేత జ‌గన్మోహ‌న్ రెడ్డి ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. ముఖ్యంగా ప‌శ్చిమ కంటే తూర్పు గోదావ‌రిలో కొంత బ‌లం ఉన్న విష‌యం తెలిసిందే! అందుకే మ‌రింత బ‌ల‌ప‌డేం దుకు ఒక్కో నియోజ‌క‌వ‌ర్గంలో నియోజక‌వ‌ర్గ ఇన్‌చార్జులు, కో-ఆర్డినేటర్లు ఇలా.. ఒక‌రికంటే ఎక్కువ‌మందిని నియ‌మించేశారు. ఇవే ఇప్పుడు ఆయ‌న‌కు త‌ల‌నొప్పి తీసుకొస్తున్నాయి. వాళ్లంతా త‌మ‌కేటికెట్ ద‌క్కుతుంద‌ని.. […]

ప్రశాంత్ మాట పక్కన పెట్టి మరీ..జగన్ ఆ నిర్ణయం

తాను ఎవ‌రి మాట లెక్క‌చేయ‌బోన‌ని వైసీపీ అధినేత జ‌గ‌న్ మ‌రోసారి స్ప‌ష్టంచేశారు. ఇప్ప‌టికే పార్టీలో సీనియ‌ర్ల‌కు ఆయ‌న మ‌న‌స్త‌త్వం గురించి తెలుసు క‌నుక స‌ల‌హాలు ఇచ్చే ప్ర‌య‌త్నం కూడా చేయ‌బోవ‌డం లేదు. ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌గా తెచ్చుకున్న ప్ర‌శాంత్ కిషోర్‌కు కూడా జ‌గ‌న్ ఝ‌ల‌క్ ఇచ్చారు. `మీరు చెప్పేది చెప్పండి.. నేను నాకిష్ట‌మైన‌దే చేస్తా` అని చెప్ప‌క‌నే చెప్పారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎవ‌రెవ‌రికి టికెట్ ఇవ్వాలి, ఎవ‌రైతే బాగుంటుంద‌నే అంశాల‌పై ఇప్ప‌టికే ప్ర‌శాంత్ బృందం ఆరా తీస్తోంది. సిట్టింగ్ […]

వైసీపీలోకి నాగార్జున‌…. జ‌గ‌న్‌తో కింగ్ డీల్ ఏంటి

దివంగ‌త లెజెండ్రీ హీరో అక్కినేని నాగేశ్వ‌ర‌రావు వార‌సుడిగా సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన నాగార్జున మ‌న్మ‌థుడిగా, కింగ్‌గా టాలీవుడ్ అభిమానుల మ‌న‌స్సు దోచుకున్నాడు. సినిమాల్లోను, బ‌య‌టా నాగార్జున వ్య‌క్తిత్వం కాస్త భిన్నం. వివాదాల‌కు దూరంగా అంద‌రితోను స‌మ‌న్వ‌యంతో ముందుకు వెళ్లే నాగ్‌ది ప‌క్కా బిజినెస్ మైండ్ అన్న టాక్ ఉంది. వ్యాపారంలో పెట్టిన పెట్టుబ‌డికి చాలా రెట్లు ఎలా రాబ‌ట్టుకోవాలో నాగ్‌కు బాగా తెలుసు. ఇక తెలంగాణ‌లో కేసీఆర్ ఎన్నిక‌ల ప్ర‌చారంలోనే నాగ్ అక్ర‌మ ఆస్తులు, క‌ట్ట‌డాల‌ను టార్గెట్ […]

పీకే జ‌వాబుతో అంద‌రూ ఫూల్స్

`వైసీపీ అధినేత జ‌గ‌న్ ఏరికోరి తెచ్చుకున్న ఎన్నిక‌ల ప‌రిశీల‌కుడు ప్ర‌శాంత్ కిషోర్ స‌ర్వే వైసీపీ నేతల్లో గుబులు పుట్టిస్తోంది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌కు ప్రతికూల పరిస్థితులున్నట్లు ఇందులో తేలింది. టీడీపీకి మ‌రోసారి విజ‌యం గ్యారెంటీ` అని టీడీపీ అనుకూల మీడియాలోనూ, సామాజిక మాధ్యమాల్లో కొంత‌మంది అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించేశారు. ప్ర‌స్తుతం వీరి అత్యుత్సాహం నీరుగారిపోయింది. ఇప్పుడు వీళ్లంతా ఫూల్స్ అయిపోయారు. వైఎస్ఆర్ సీపీని, నేత‌ల‌ను ఇరుకున పెట్టి సోష‌ల్ మీడియాలో వీలైనంత వ‌ర‌కూ ల‌బ్ధి పొందాల‌ని చూసిన వీరంతా.. `ఇదంతా […]

జ‌గ‌న్‌లో మార్పు వెనుక కార‌ణాలివేనా.. 

సీఎం చంద్ర‌బాబు 2014లో అధికారంలోకి రావ‌డానికి ఆయ‌న సీనియ‌రిటీనేగాక‌, ఉద్యోగులు కూడా కొంత కార‌ణం! 2004 ఎన్నిక‌ల్లో ఆయ‌న ఓడిపోవ‌డానికి కార‌ణం కూడా ఉద్యోగులే! `నేను మారాను. గ‌తంలోలా ఉద్యోగుల‌తో క‌ఠినంగా వ్య‌వహ‌రించ‌ను` అని చంద్ర‌బాబు పదేప‌దే చెబుతూ వారిలో న‌మ్మ‌కం క‌లిగేలా చేశారు. ఇక 2019 ఎన్నిక‌ల్లో అధికారం చేజిక్కించుకోవ‌డానికి ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్.. ఇప్ప‌టినుంచే `నేను మారాను` అనే సంకేతాలు ఇస్తున్నారు. ఆయ‌న వ్య‌వ‌హార‌శైలిపై తీవ్ర విమ‌ర్శ‌లు చేసిన నేత‌లే ఇప్పుడు ముక్కున వేలేసుకుంటున్నారు. […]

ప్ర‌శాంత్ ప్ర‌భావం జ‌గ‌న్‌పై ప‌డిందిగా..

`నువ్వు మారాలి.. నీ వ్య‌వ‌హార శైలి మారాలి.. నీ మాట తీరు మారాలి` అంటూ పార్టీలో సీనియ‌ర్ నేత‌లు ఎంత‌మంది చెప్పినా ప‌ట్టించుకునే వారు కాదు వైసీపీ అధినేత,ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్‌!! నిన్న‌మొన్న‌టి వ‌రకూ టీడీపీ నేత‌లు కూడా ఆయ‌న వ్య‌వ‌హార‌శైలినే టార్గెట్ చేసేవారు!! ఇప్పుడు జ‌గ‌న్ నిజంగానే మారిపోయారు. ఇటీవ‌ల ఆయ‌న పాల్గొన్న సంఘ‌ట‌న‌లు, ఆయ‌న మాట‌తీరు గ‌మ‌నించి వారంతా ఇప్పుడు ఆశ్చర్య‌పోతున్నారు. దీని వెనుక ఏరికోరి తెచ్చుకున్న ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ ప్ర‌భావం […]

ఆంధ్ర‌జ్యోతి మాట‌ల్లో నీతులు.. రాతల్లో పైత్యాలు

టీడీపీని, ఆ పార్టీ అధినేత‌ను ఆకాశానికి ఎత్తేస్తూ.. భుజాల‌పై మోస్తోంది ఆంధ్ర‌జ్యోతి! టీడీపీకి అనుకూలంగా వార్త‌లు రాయ‌డంలో ఈనాడును కూడా మించిపోయింది. అయితే దీనిని ఎవ‌రూ త‌ప్పుప‌ట్టాల్సిన అవ‌స‌రం లేదు. ఎందుకంటే ఎవ‌రి సొంత ప్ర‌యోజ‌నాలు వారివి! బాధ్య‌తాయుత‌మైన ప‌త్రిక‌గా ఉంటూ విలువ‌లు పాటించాల్సిన అవ‌స‌రం కూడా చాలా ముఖ్యం! ఇటీవ‌ల ఆ ప‌త్రిక‌లో వ‌స్తున్న వార్త‌లను ప‌రిశీలిస్తే.. విలువ‌ల‌కు తిలోద‌కాలు ఇచ్చినట్టేన‌ని అర్థ‌మ‌వు తుంది. ముఖ్యంగా సోష‌ల్ మీడియాలో ఎవ‌రో క‌ల్పించి రాసిన వాటి ఆధారంగా […]

వైసీపీలోకి సీనియర్.. అమ‌రావ‌తిలో టీడీపీకి ఇబ్బందే!

విప‌క్షం వైసీపీకి రాజ‌ధాని ప్రాంతం అమ‌రావ‌తిలో గ‌ట్టి ప‌ట్టు దొరుకుతోందా? వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌వాడ ప్రాంతంలో పార్టీని ముందుండి న‌డిపించ‌గ‌ల నేత వ‌స్తున్నాడా? ముఖ్యంగా టీడీపీలో ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్న విజ‌య‌వాడ సెంట్ర‌ల్ ఎమ్మెల్యే బొండా ఉమాకి.. మొగుడు లాంటి కేండిట్ వైసీపీలోకి వ‌స్తున్నారా? అంటే ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. గ‌తంలో సెంట్ర‌ల్ నుంచి కాంగ్రెస్ త‌ర‌ఫున గెలిచిన మ‌ల్లాది విష్ణు ఇప్పుడు జ‌గ‌న్ పార్టీలోకి చేరేందుకు రంగం సిద్ధ‌మైంద‌ని రెండు మూడు రోజులుగా […]

వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యేలలో టెన్షన్..టెన్షన్

ఏపీలో వైసీపీ నేత‌ల‌కు ప్ర‌శాంత్ కిషోర్ ఫీవ‌ర్ ప‌ట్టుకుంది. పార్టీలో ఏ స్థాయిలో ఉన్న‌వారికి అయినా ఈ ఫీవ‌ర్ మామూలుగా లేదు. ఇప్పుడు అంద‌రి నోట ప్ర‌శాంత్ స‌ర్వే మాటే వినిపిస్తోంది. ప్ర‌శాంత్ ఏకంగా రూ. 8 కోట్ల వ‌ర‌కు ఖ‌ర్చు చేసి గ్రామ‌స్థాయి గ్రామ‌స్థాయి వ‌ర‌కు రిపోర్టులు త‌యారు చేయించారు. ఈ సర్వే నివేదిక‌లు జ‌గ‌న్ వ‌ద్ద‌కు వెళ్లిపోయాయి. జ‌గ‌న్ కూడా ప్ర‌శాంత్ కిషోర్ చెప్పిన‌వి అన్నీ పాటిస్తున్నాడ‌న్న లీకులు వైసీపీ నాయ‌కులంద‌రికి తెలిసిపోయాయి. దీంతో […]