మహేష్,బన్నీ కు జగన్ సర్ ప్రైజ్ న్యూస్?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఆయన ప్రతి బంధం సెప్టెంబర్ మొదటి వారంలో ఆంధ్రప్రదేశ్ వైయస్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తో సమావేశం కానుంది. అగ్ర హీరోలు అయినా మహేష్ బాబు అలాగే అల్లు అర్జున్ కూడా జగన్ ను కలవడానికి, అదేవిధంగా థియేటర్లలో టికెట్ల ధరల ఈ విషయంలో చర్చించడానికి సిద్ధంగా ఉన్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే టాలీవుడ్ చిత్ర బృందం సెప్టెంబర్ 4న తేదీన వైయస్ జగన్ తో సమావేశం అవుతుందని ఫాదర్ […]

ఆత్మీయ సమావేశం వెనుక అంతరార్థం ఏమిటో?

ఉమ్మడి రాష్ట్ర దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి భార్య వైఎస్ విజయమ్మ ఇపుడు వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. వైఎస్ఆర్ భార్యగా ప్రపంచానికి పరిచయమున్న విజయమ్మ ఆయన అనంతరం తప్పనిసరి పరిస్థితుల్లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆ తరువాత కుమారుడు జగన్ స్థాపించిన పార్టీకి గౌరవాధ్యక్షురాలిగా ఉంటున్నారు. రాజకీయాల్లో కొడుకు చాటు తల్లిగా ఉన్న విజయమ్మ ఇపుడు నేరుగా రాజకీయ నాయకులనే కలువబోతున్నారు. వైఎస్ హయాంలో మంత్రులుగా పనిచేసిన వారిని, వైఎస్ సహచరులతో సమావేశం ఏర్పాటు […]

పెరుగుతున్న కేసులు.. కోర్టుల చుట్టూ అధికారులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు న్యాయం కోసం కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. రాష్ట్రంలో మాకు అన్యాయం జరిగింది.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ వేల మంది న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. ఇలా కోర్టుకు వెళుతున్న వారు రోజుకు దాదాపు 450 మంది ఉంటున్నారట. ఇప్పటికి రాష్ట్రానికి సంబంధించిన కేసులు దాదాపు లక్షా 94వేల కేసులు ఉన్నాయని పీటీఐ వార్తా సంస్థ తెలిపింది. సుప్రీంకోర్టు, హైకోర్టు, ఇతర కోర్టుల్లో ఈ కేసులు నడుస్తున్నాయి. 8 వేల కేసుల్లో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాల్సి […]

దసరాకే ముహూర్తం.. 18 మందికి ఉద్వాసన?

అధికార వైసీపీలో మంత్రివర్గ విస్తరణపైనే జోరుగా చర్చలు జరుగుతున్నాయి. కేబినెట్ లో ఉన్న వాళ్లు తమ పదవి ఉంటుందో.. ఊడుతుంద అనే ఆందోళనలో ఉంటే.. ఈసారైనా తమకు లక్ కలిసి వస్తుందా అని సీనియర్ ఎమ్మెల్యేలు అనుకుంటున్నారట. రెండున్నర సంవత్సరాల తరువాత మంత్రివర్గంలో మార్పులుంటాయని సీఎం సీటులో కూర్చున్నపుడే జగన్ చెప్పారు. ఆయన చెప్పినట్లే కచ్చితంగా చేసి తీరుతారని నాయకులు పేర్కొంటున్నారు. విజయదసమి సందర్భంగా మంత్రివర్గంలో మార్పలుండవచ్చని తెలిసింది. ఇపుడు ఉన్న 25 మంది మంత్రుల్లో 18 […]

ఏపీ సర్కారుకు మరో సలహాదారు..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సలహాలిచ్చేందుకు సీఎం మరో వ్యక్తిని నియమించారు. వైసీపీలోంచి టీడీపీలోకి వెళ్లి.. తిరిగి వైసీపీలో చేరిన జూపూడి ప్రభాకర్ రావును సోషల్ జస్టిస్ అడ్వైజర్ గా ప్రభుత్వం నియమించింది. ప్రభుత్వంలో ఇప్పటికే సలహాలిచ్చేవాళ్లు ఎక్కువ ఉన్నారనే విమర్శలు పట్టించుకోకుండా జగన్ ఈ నిర్ణయం తీసుకోవడం రాజకీయ పరిశీలకులను ఆశ్చర్యపరిచింది. ప్రభుత్వం ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది.. రుణం కోసం ఢిల్లీ చుట్టూ తిరుగుతోంది.. కోర్టు కూడా సలహాదారుల గురించి ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో ఈ నియామకం […]

ఇక నుండి శ్రీకాకుళంలో .. S/O ధర్మాన ప్రసాదరావు!

ధర్మాన ప్రసాదరావు.. రాజకీయాల్లో ఉద్దండుడు.. శ్రీకాకుళం రాజకీయాల్లో పట్టున్న వ్యక్తి.. ఈయన ఇక రిటైర్డ్ కావాలని నిర్ణయించుకున్నారా? కుమారుడికి పగ్గాలప్పగించాలని భావిస్తున్నారా? అంటే అవుననే సమాధానం చెబుతున్నారు పార్టీ పరిశీలకులు. కొద్దిరోజులుగా గమనిస్తే ధర్మాన ప్రసాదరావు కుమారుడు ధర్మాన రామ్మోహన్ నాయుడు రాజకీయ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. జిల్లాలో ముఖ్యంగా ఏ కార్యక్రమం జరిగినా రామ్మోహన్ హాజరవుతున్నారు. శుభకార్యాలు, ప్రారంభోత్సవాలు, పెళ్లిళ్లు, పార్టీ కార్యక్రమాలు.. ఇలా ఏదైనా సరే ప్రసాదరావు స్థానంలో రామ్మోహన్ రావు కనిపిస్తున్నారు. వచ్చే […]

మా ఓట్లు వైసీపీ వాళ్లు చోరీ చేశారు

గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్లన్నీ కాంగ్రెస్ పార్టీ ఓట్లేనట.. అందుకే ఆ వైసీపీ అధికారంలోకి వచ్చిందట.. ఇలా అభిప్రాయపడుతున్నది రాజకీయాలు తెలియని కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాదు.. ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్.. అంటే వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేసి, దీక్షలు చేపట్టి.. అనేక హామీలు ఇచ్చినందువల్ల జగన్ సీఎం సీటులో కూర్చోలేదు.. మా ఓట్ల వల్లే అన్నట్లుంది శైలజానాథ్ అభిప్రాయం. ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి బ్రెయిన్ […]

కెసిఆర్,జగన్ లకు కేంద్రం ఝలక్ ..!

మంగళవారం (ఈరోజు) పార్లమెంటులో రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రం ఇచ్చిన సమాధానంతో ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులకు నిరాశ ఎదురైనట్లయింది. ఇప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల సంఖ్యను పెంచే ఉద్దేశం లేదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ సమాధానమిచ్చారు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణలో ఉన్న 119 నియోజకవర్గాలను 153 చేయాలని, ఈ విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ సమాధానమేంటని మల్కాజిగిరి పార్లమెంటు సభ్యుడు రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. దీంతో 2026లో జరిగే జనాభా […]

అయ్యో..అయ్యొయ్యో.. ఇంతటి అవమానమా..

తాడిపత్రి.. ఎప్పుడూ మీడియాలో నానే పేరు.. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఈ పేరు వినిపిస్తూనే ఉంటుంది.  తాడిపత్రి అంటేనే జేసీ బ్రదర్స్ గుర్తుకు వస్తారు. రాష్ట్ర రాజకీయాల్లో ఈ సోదరులు గతంలో ఓ వెలుగు వెలిగారు.  జేసీ దివాకర్ రెడ్డి తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల్లో ఉన్నపుడు హవా నడిచింది. అప్పుడు అధికారం ఉంది కాబట్టి వారిదే పైచేయి అయింది. ఇపుడు జేసీ దివాకర్ రెడ్డి రాజకీయాలకు కాస్త దూరంగా ఉండగా జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రం […]