బికినీ షోల‌తో ర‌చ్చ చేస్తున్న మెగాస్టార్ భామ ..?

ర‌త్తాలు ర‌త్తాలు అంటూ మెగాస్టార్ తో చిందేసిన అందాల భామ రాయ్ ల‌క్ష్మీ. ఈ బ్యూటీ టాలీవుడ్ లో చాలా ప్ర‌య‌త్నాలు చేసింది. కానీ పెద్ద‌గా పేరు రాక‌పోవ‌డంతో నిరాశ చెందింది. దీంతో బాలీవుడ్ కు మకాం మార్చేసింది. అక్క‌డ కూడా చిన్న చితకా అవ‌కాశాలే త‌ప్ప పెద్ద‌గా రాలేదు. దీనితో ఆమె జిమ్ లో బాగా క‌ష్ట‌ప‌డి ఇప్పుడు ఎవ‌రూ గుర్తించ‌లేని విధంగా మారింది. కాస్త బొద్దుగా ఉండే ఈ బ్యూటీ సూప‌ర్ నాజూకుగా మారిపోయింది. […]

100 మిలియన్ లిస్టులో అల్లు అర్జున్ సినిమా..!?

టాలీవుడ్ స్టైలిష్ హీరో అల్లు అర్జున్ సినిమాలకు కానీ తన వీడియోస్ కి చాలా రికార్డులు ఉన్నాయి. అప్పుడు నటించిన సరైనోడు నుంచి లేటెస్ట్ అల వైకుంఠపురములో, పుష్ప వరకు అల్లు అర్జున్ ఖాతాలో అనేక రికార్డులు ఉన్నాయి. కానీ ఇప్పుడు తాజాగా తెలుగులో ఒక కొత్త రికార్డును బన్నీ తన అకౌంట్ లో వేసుకున్నాడు. తాను హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కించిన మూవీ డీజే దువ్వాడ జగన్నాధం. హిందీలో […]

క్వారంటైన్ లోకి మహేష్ బాబు..!?

కరోనా వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు క్రమంగా పెరుగుతోంది. దేశవ్యాప్తంగా నిన్న ఒక్కరోజే 3 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇటు కరోనా మహమ్మారి సెలబ్రిటీలను కూడా వదిలి పెట్టట్లేదు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పటికే పలువురు ప్రముఖులు కరోనా బారిన పడగా, తాజాగా మహేష్ బాబు క్వారంటైన్లోకి వెళ్లడం అందరిలో కలకలం రేపుతోంది. తాజాగా మహేష్ పర్సనల్ స్టైలిష్ట్ కరోనా బారిన పడ్డారని సమాచారం. అతనితో […]

రీ ఎంట్రీకి సిద్ధం అవుతున్న కలర్స్ స్వాతి..!?

తెలుగు ఇండస్ట్రీలో బుల్లితెర నుంచి వెండితెర పైకి వెళ్లి అక్కడ హీరోయిన్ గా రాణించిన అతి కొద్దిమంది అమ్మాయిల్లో కలర్స్ స్వాతి ఒకరు. స్వామి రారా, కార్తికేయ లాంటి సినిమాలు చేసి మంచి గుర్తింపు పొందింది స్వాతి. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా అయింది కలర్స్ స్వాతి. మళ్లీ ఇన్ని రోజుల తర్వాత ఈమె రీ ఎంట్రీ ఇస్తుంది. పంచతంత్రం అనే కాన్సెప్ట్ బేస్డ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది కలర్స్ స్వాతి. కొత్త దర్శకుడు హర్ష […]

రంభ ఫ్యాన్ గా జగపతిబాబు…!?

అప్పటిలో తన అభినయంతో పాటు అందచందాలతో తెలుగు ప్రేక్షకులను అలరించి వారి హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న హీరోయిన్స్ లో రంభ ఒకటి. స్టార్‌ హీరోలతో జత కట్టిన ఈ అమ్మడు పెళ్లి చేసుకున్న తర్వాత ఇండస్ట్రీకి దూరమైంది. ఎంతో మంది ఫాన్స్ ని సంపాదించుకున్న రంభకు నేనూ ఓ అభిమానినే అంటున్నాడు జగ్గూ భాయ్‌ అలియాస్‌ జగపతిబాబు. అవును ఇది నిజమే.కానీ ఇది రియల్‌ లైఫ్‌లో కాదులెండి. రీల్‌ లైఫ్‌లో. గతంలో సినిమాల్లో జగపతిబాబు, రంభ […]

‘శుక్ర’ సినిమా రిలీజ్ డేట్ ఖరారు..!

కరోనా వైరస్ రోజు రోజుకు విజృంభిస్తున్న నేపథ్యంలో థియేటర్లు మూసివేత అంటున్నారు కానీ, ఏది ఏమైనా శుక్ర చిత్రం రిలీజ్ చేయడానికే మేము నిర్ణయించుకున్నాం. మా చిత్రం రిలీజ్ కు సహకరించిన మధుర శ్రీధర్‌గారికి చాలా థ్యాంక్స్ అని దర్శకుడు సుకు పూర్వజ్‌ అన్నారు. అరవింద్‌ కృష్ణ, శ్రీజితా ఘోష్‌ జంటగా అయ్యన్న నాయుడు నల్ల, తేజ పల్లె నిర్మించిన శుక్ర చిత్రం ఈ నెల 23న రిలీజ్ కానుంది. సుకు పూర్వజ్‌ మాట్లాడుతూ, మా చిత్రం […]

టాలీవుడ్ లో విషాదం… ప్రముఖ నిర్మాత మృతి..!

ప్రస్తుతం కరోనా వైరస్ సెకండ్ వేవ్ వేగంగా విజృంభిస్తున్న తరుణంలో రోజు రోజుకు కొన్ని లక్షల కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పుడు ఈ కరోనా వైరస్ ప్రభావం టాలీవుడ్ పై కూడా పడింది. ఇప్పటికే ఎంతో మంది సినీ నటీనటులు ఇంకా ప్రముఖులు కరోనా వైరస్ బారిన పడ్డారు. ఇప్పుడు తాజాగా కరోనా వైరస్ తో నిర్మాత సి.ఎన్.రావు మృతి చెందారు. కరోనా వైరస్ బారిన పడి నిర్మాత మృతి చెందిన సి.ఎన్.రావు అలియాస్ చిట్టి […]

రా ఆఫీసర్ గా కళ్యాణ్ రామ్…!?

నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న హీరో కళ్యాణ్ రామ్. ఒక వైపు నిర్మాతగా మరో వైపు హీరోగా కళ్యాణ్ రామ్ టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్నాడు. కళ్యాణ్ రామ్ ఎక్కువగా ప్రయోగాత్మక సినిమాలు చేస్తూ నిర్మాతగా ముందుకి దూసుకెళ్తున్నాడు. కళ్యాణ్ రామ్ చివరిగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో ఎంత మంచివాడవురా చిత్రంలో చేశారు. కానీ ఈ చిత్రం ప్లాప్ అయింది. కళ్యాణ్ రామ్ ఇప్పుడు తన కొత్త సినిమాలో […]

అమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సూపర్ స్టార్ …!

ఈ రోజు టాలీవుడ్ సూపర్‌స్టార్‌ ప్రిన్స్ మహేష్ బాబు తల్లి అయిన ఇందిర గారి పుట్టినరోజు. ఈ సందర్భంగా ప్రిన్స్ మహేష్ సోషల్ మీడియా ద్వారా వాళ్ళ అమ్మకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఒక పిక్ షేర్ చేశాడు. సాధారణంగా మహేష్ బాబు తల్లి ఇందిర దేవి బయటకి అసలు కనిపించరు. ఆమె కనిపించడం చాలా అరుదు. మహేష్ బాబు సినిమాలకు సంబంధించిన ఫంక్షన్లలో ఆయన కుటుంబ సభ్యులు అందరూ కనిపిస్తుంటారు గాని, ఇందిర దేవి […]