రేవంత్‌పై త‌మ్ముళ్ల గ‌రంగ‌రం

పాలిటిక్స్ అన్నాక శ‌త్రువులు విప‌క్షంలోనే ఉండ‌న‌క్క‌ర‌లేదు! సొంతపార్టీలోనూ శ‌త్రువులు ఉండొచ్చు. అస‌లామాట కొస్తే.. ఉంటారు కూడా! ఇప్పుడు ఈ మాట‌లు ఎందుకంటే.. తెలంగాణ టీడీపీలో ఓ రేంజ్‌లో దూసుకుపోతున్న కొడంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డికి సొంత పార్టీ టీడీపీ లోనే శ‌త్రువులు ఎక్కువ‌య్యార‌ట‌! ఇప్పుడు అంద‌రూ దీనిపైనే చ‌ర్చించుకుంటున్నారు. ఒక ప‌క్క పార్టీ అధినేత చంద్ర‌బాబు.. అంద‌రూ క‌ల‌సిక‌ట్టుగా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించాల‌ని, క‌ల‌సి ముందుకు సాగాల‌ని పిలుపునిస్తున్నారు. అయితే, అధినేత ఆశ‌ల‌కు విరుద్ధంగా తెలంగాణ టీడీపీలో కార్య‌క్ర‌మాల‌కు […]

తెలంగాణ‌ను టార్గెట్ చేసిన బాల‌య్య‌

అవును! ఏపీలోని హిందూపురం ఎమ్మెల్యే, టీడీపీ అధినేత చంద్ర‌బాబు వియ్యంకుడు బాల‌య్య ఇప్పుడు పూర్తిస్థాయిలో తెలంగాణ‌ను టార్గెట్ చేశాడు. దీనివెనుక పొలిటిక‌ల్ రీజ‌న్స్ ఉన్నాయా? మూవీ రీజ‌న్స్ ఉన్నాయా? ఇప్ప‌డే తెలియ‌క‌పోయినా.. బాల‌య్య స్టెప్స్ చూస్తే.. ఏదో దూరాల‌చ‌న‌తోనే అడుగులు వేస్తున్న‌ట్టు భావించాలి. ఇక‌, విష‌యంలోకి వ‌స్తే.. బాల‌య్య ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న 100 వ చిత్రం గౌత‌మీ పుత్ర‌శాత‌క‌ర్ణి. సంచ‌ల‌న డైరెక్ట‌ర్ క్రిష్ డైరెక్ష‌న్‌లో ఇస్తున్న మూవీపై అంచ‌నాలు బాగానే ఉన్నాయి. ఇక‌, దీనిని బాల‌య్య చాలా […]

క‌ల్వ‌కుంట్ల ఫ్యామిలీకి త‌ల‌నొప్పిగా కంట్లో న‌లుసు

తెలంగాణ అధికార పార్టీ టీఆర్ ఎస్ అధినేత‌, సీఎం క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్‌రావు(కేసీఆర్‌) స్టేట్‌లో త‌న‌కు తిరుగులేని శ‌క్తిగా అవ‌త‌రించార‌న‌డంలో సందేహం లేదు. తెలంగాణ ఉద్య‌మం నుంచి మొద‌లు పెట్టి.. ఇప్ప‌టి వ‌ర‌కు అన్ని విష‌యాల్లోనూ ఆయ‌న చేసిన ప్ర‌య‌త్నం ఆయ‌న‌ను సీఎంను చేసింది. దీంతో త‌న కుమారుడు, కుమార్తెను సైతం పాలిటిక్స్‌లోకి దింపేశారు. ఇక‌, స్టేట్‌లో కారు మాత్ర‌మే దూసుకుపోవాల‌ని ప‌క్కా ప్లాన్ వేసిన కేసీఆర్‌.. ఇటు టీడీపీని, అటు వైకాపాను కూడా దాదాపు నామ రూపాలు […]

ఎంపీ ప‌ద‌వికి క‌విత గుడ్ బై

రాజ‌కీయాల్లో అధికార‌మే ప‌ర‌మావ‌ధిగా వ్యూహాలు ఎప్ప‌టిక‌ప్పుడు మారిపోతుంటాయి. దీనికి ఎవ్వ‌రూ అతీతులు కారు! ప్ర‌స్తుతం ఇలాంటి ఓ పెద్ద వ్యూహంలోనే ఉన్నార‌ట తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె క‌విత‌. ప్ర‌స్తుతం ఆమె నిజామాబాద్ పార్లెమెంటు స్థానం నుంచి ఎంపీగా 2014లో గెలుపొందారు. ఈ నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌ల‌కు అందుబాటులోనే ఉంటున్నార‌న్న టాక్ తెచ్చుకున్నారు. అయితే, ఎంపీగా తాను కేవ‌లం నియోజ‌క‌వ‌ర్గానికి మాత్ర‌మే ప‌రిమిత‌మైపోయాను అనే ఫీలింగ్ ఆమెలో నెల‌కొంద‌ట‌! దీంతో త‌న వ్యూహాన్ని ఆమె అసెంబ్లీ వైపు మ‌ళ్లించారు. […]

టీఆర్ఎస్ సంబ‌రాల‌కు మోడీ షాక్‌

పెద్ద నోట్ల‌ను ర‌ద్దు చేస్తూ.. ప్ర‌ధాని మోడీ తీసుకున్న సంచ‌ల‌న నిర్ణ‌యం దేశ వ్యాప్తంగా జ‌నాల్ని నానాతిప్ప‌లు పెడుతున్న విష‌యం తెలిసిందే. అదికూడా ప్ర‌స్తుతం పెళ్లిళ్ల సీజ‌న్ కావ‌డంతో జ‌నాలు మ‌రింత‌గా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక‌, ఈ స‌మ‌స్య‌ల మాటేమో కానీ, తెలంగాణ ప్రభుత్వానికి ఈ నోట్ల ర‌ద్దు విష‌యం చుక్క‌లు చూపిస్తోంది. ఆదాయం గ‌ణ‌నీయంగా త‌గ్గిపోవ‌డం, ఉత్ప‌త్తి వ్యాపారాలు పూర్తిగా డౌన్ కావ‌డం వంటి ప‌రిణామాల నేప‌థ్యంలో ప్ర‌భుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అయితే, ఇది నాణేనికి […]

త‌ల‌సాని టాలీవుడ్‌పై ” ప‌వ‌ర్ ” చూపించాడా..!

అధికారంలో ఉన్న వారు.. ముఖ్యంగా మంత్రులుగా ఉన్న వారు ఎప్పుడు అవ‌కాశం వ‌చ్చినా త‌మ ప‌వ‌ర్ చూపించేందుకు ముందే ఉంటారు! ఇక‌, వారి ఇళ్ల‌ల్లో ఏదైనా వేడుక‌లు జ‌రిగితే.. ఆ టైంలో చూపించే ప‌వ‌రే వేరు! ఇప్పుడు తాజాగా తెలంగాణ సినిమా టోగ్ర‌ఫీ మంత్రిగా ఉన్న త‌ల‌సాని శ్రీనివాస యాద‌వ్ త‌న ప‌వ‌ర్ ఏంటో చూపించార‌నే టాక్ వినిపిస్తోంది. ఆ ప‌వ‌ర్ ఏ రేంజ్‌లో ఉందంటే.. క‌నీసం పిట్ట‌కు కూడా చిక్క‌ని టాలీవుడ్ స్టార్లంతా.. క్యూ క‌ట్టుకుని […]

టీ కాంగ్రెస్‌లో సొమ్మున్న నేత‌ల పోస్టు వాంటెడ్‌..!

అవును! మీరు చ‌దివింది నిజ‌మే!! తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కీలక పోస్టుల‌కు అంతే కీల‌క‌మైన అభ్య‌ర్థుల కోసం పార్టీ ఎదురు చూస్తోంద‌ట‌! ప్ర‌స్తుతం ఉన్న నేత‌లంతా ఉత్తుత్తి బ్యాంకు మాదిరిగా ఉత్తుత్తి బ్యాచ్‌లా త‌యార‌య్యార‌ని కాంగ్రెస్ అధిష్టానానికి రిపోర్టులు వెళ్లిన‌ట్టు స‌మాచారం .ఈ క్రమంలో మంచి ద‌మ్ము, సొమ్ము ఉన్న నేత‌లు రంగంలోకి దిగితేకానీ, 2019లో అధికార టీఆర్ ఎస్ ప్ర‌భుత్వానికి బుద్ధి చెప్ప‌డం కుద‌ర‌ద‌ని ఓ డెసిష‌న్‌కి వ‌చ్చింద‌ట అధిష్టానం. ఈ క్ర‌మంలోనే సొమ్మున్న నేత‌ల […]

కాంగ్రెస్‌లోకి కోదండ రాం..!

ఆశ్చ‌ర్యంగా అనిపించినా.. నిజ‌మేనంటున్నారు టీఆర్ ఎస్ నేత‌లు. తెలంగాణ ఉద్య‌మంలో రాత్రిబ‌వంళ్లు శ్ర‌మించిన ప్రొఫెస‌ర్ కోదండ రాం.. త్వ‌ర‌లోనే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నార‌ని అంటున్నారు. వాస్త‌వానికి తెలంగాణ‌ ఉద్య‌మానికి ద‌శ దిశ చూపిన వారిలో కోదండ‌రాం ప్ర‌ముఖులు. అయితే, రాష్ట్ర ఏర్పాటు అనంత‌రం, ఆయ‌న అధికారానికి దూరంగానే ఉండిపోయారు. టీఆర్ ఎస్ ప్ర‌భుత్వంలో చేర‌తార‌ని అంద‌రూ భావించినా.. ఆయ‌న మాత్రం ఉద్య‌మ‌కారుడిగానే ఉండిపోయారు. ప్ర‌భుత్వంపై సూటి విమ‌ర్శ‌లు చేయ‌డంతో సీఎం కేసీఆర్‌కు ఆయ‌న‌కు మ‌ధ్య సంబంధాలు కూడా […]

కేసీఆర్ ఫీల్ గుడ్ స్టోరీ

తెలంగాణ సీఎం కేసీఆర్‌.. ఇప్పుడు బ‌స్సు యాత్ర‌కు సిద్ధం అవుతున్నారు. ప్ర‌భుత్వానికి, పార్టీకి మ‌రింత జోష్ పెంచేందుకు ఆయ‌న రెడీ అయ్యారు. అధికారంలోకి వ‌చ్చి రెండున్న‌రేళ్లు పూర్త‌వుతుండ‌డం, ప‌థ‌కాలు, ప్రాజెక్టులు వంటివి పెద్ద ఎత్తున అమ‌లు చేస్తుండ‌డంతో ఆయ‌న ఆయా విష‌యాల‌ను ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకువెళ్లాల‌ని ఆయ‌న నిర్ణ‌యించారు. మ‌రోప‌క్క‌, కాంగ్రెస్ నేత‌లు చేస్తున్న యాంటీ ప్ర‌చారం కేసీఆర్‌కు పెద్ద ఎత్తున విసుగు తెప్పిస్తోంది. ప‌థ‌కాలు న‌త్త‌డ‌క‌న సాగుతున్నాయ‌ని, ఆరోగ్య శ్రీవంటివి కుంటుప‌డుతున్నాయ‌ని కాంగ్రెస్ నేత‌లు ఆరోపిస్తున్నారు. […]