ప్రత్యర్థులకు అంతుచిక్కని వ్యూహాలతో దూసుకుపోతున్న తెలంగాణ సీఎం కేసీఆర్‌కు.. సొంత పార్టీ ఎంపీలే షాక్ ఇవ్వబోతున్నారా? మూకుమ్మడిగా రాజీనామా చేసి.. ఇక బీజేపీ గూటికి చేరిపోయేందుకు ఇప్పటినుంచే ప్రణాళికలు వేసుకుంటున్నారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఇటీవల కేంద్ర కేబినెట్లో టీఆర్ఎస్ చేరిపోతుందని అప్పట్లో వార్తలు వినిపించాయి. ఇక కేసీఆర్ కూతురు, ఎంపీ కవితకు కేంద్రమంత్రి పదవి ఖాయమని కూడా హల్‌చల్ చేశాయి. కానీ తర్వాత అవన్నీ ఊహాగానాలే అని తేలిపోయాయి. అయితే టీఆర్ఎస్ ఎంపీల్లో కొందరిని […]
Tag: Telangana
ఏపీ మంత్రి కేసీఆర్‌కు ప్రశంసలు…ఇంకేముంది
రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత.. తెలంగాణలో టీఆర్ఎస్ ధాటికి తెలుగుదేశం ప్రభుత్వం తీవ్రంగా నష్టపోయింది. దీనిపై అటు తెలంగాణ నేతలు.. సీఎం కేసీఆర్‌పై పోరాటం చేస్తూనే ఉన్నారు. ఈ సమయంలో కేసీఆర్‌ను ప్రశంసిస్తూ ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ నేతలను ఆగ్రహానికి గురిచేస్తున్నాయి. ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే టీడీపీకి వైసీపీ కంటే తక్కువ ఓట్లు వస్తాయని చెప్పిన కేసీఆర్‌ను పొగడటంపై మండిపడుతున్నారు. ఒకపక్క తెలంగాణలో తామంతా కేసీఆర్ అవినీతి, ఇతర […]
కోమటిరెడ్డి బ్రదర్స్ కల నిజం అవుతుందా..?
తెలంగాణ రాజకీయాల్లో కోమటిరెడ్డి బ్రదర్స్‌కు సపరేట్ ఇమేజ్ ఉంది. టీ కాంగ్రెస్‌లో ఉన్న ఈ బ్రదర్స్ దూకుడు రాజకీయాలు చేయడంలో దిట్ట. తెలంగాణలో కేసీఆర్ తిరుగులేని విజయాలు సాధిస్తోన్న వేళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన సోదరుడు మాజీ ఎంపీ రాజ్‌గోపాల్‌రెడ్డి ఎమ్మెల్సీగా పోటీ చేయించి భారీ మెజార్టీతో గెలిపించుకున్నారు. కేసీఆర్ మీద సవాల్ చేసి మరీ ఈ బ్రదర్స్ గెలిచారు. ఇదిలా ఉంటే కోమటిరెడ్డి బ్రదర్స్‌కు చాలా రోజులుగా టీ కాంగ్రెస్‌కు […]
2019లో టీ బీజేపీ సీఎం అభ్యర్థిగా జానారెడ్డి..!
2019 ఎన్నికల వేళ రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలు చాలా ఆసక్తికరంగా మారుతున్నాయి. ఏపీలో మిత్రపక్షాలుగా ఉన్న బీజేపీ-టీడీపీ మధ్య పొత్తు కటిఫ్ అవుతుందని, అక్కడ బీజేపీ వైసీపీకి దగ్గరవుతుందని ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. ఇక తెలంగాణలోను వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా అధికారంలోకి వచ్చేందుకు చాపకింద నీరులా ప్రయత్నాలు చేస్తోన్న బీజేపీ అక్కడ కూడా సరికొత్త పొత్తులకు, ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపినట్టు తెలుస్తోంది. తెలంగాణలో గత ఎన్నికల్లో బీజేపీ+టీడీపీ కలిసి పోటీ చేశాయి. తెలంగాణలో టీడీపీ పనైపోవడంతో […]
డ్రగ్స్ విచారణ మీకెందుకు…మంత్రులపై కేసీఆర్ ఫైర్
హైదరాబాద్‌లో డ్రగ్స్ విచారణ టాలీవుడ్‌ను కుదిపేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ విచారణలో ఎంతో మంది ప్రముఖులు ఉన్నా కేసీఆర్ మాత్రం ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ అకున్ సబర్వాల్ కు పూర్తి స్వేచ్ఛ నిచ్చారు. విచారణలో ఎవరి జోక్యం లేకుండా చూస్తున్నారు. టాలీవుడ్‌కు చెందిన 12 మందికి నోటీసులు జారీ చేసిన సిట్ రోజుకు ఒక్కరి చొప్పున విచారిస్తోంది. ఇప్పటికే 9 మందిని విచారించిన సిట్ మరో ముగ్గురిని విచారించనుంది. ఇక వీరు చెప్పిన ఆధారాలను బేస్ చేసుకుని […]
కేసీఆర్ వ్యాఖ్యల వెనుక ఇంత కుట్ర ఉందా?
`అమరావతి నిర్మాణానికి మా వంతు సహకారం అందిస్తాం. ఎప్పుడు ఏ సాయం కావాలన్నా అందిస్తాం` ఇదీ అమరావతి శంకుస్థాపనకు వచ్చిన తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు!! కానీ ఇప్పుడు ఆయనే ఏపీ అభివృద్ధికి మోకాలడ్డే ప్రయత్నాలు చేస్తున్నారా? ఇందుకు బీజేపీ నేతలు కూడా అంతర్గతంగా చేయూతనిస్తున్నారా? అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు! ఇటీవల ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతున్న సమయంలో ఏపీలోని రాజకీయాల గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. వీటి […]
టీజర్‌లోనే టీడీపీ కథ క్లోజ్…ఇక మిగిలింది సినిమాయే
ఎస్ ఈ హెడ్డింగ్ నిజమే అనిపిస్తోంది ప్రస్తుతం తెలంగాణలో టీడీపీ పరిస్థితి చూస్తుంటే… తెలంగాణలో బీజేపీ ఒంటరి పోరుకు సిద్ధమని ఇప్పటికే ప్రకటనలు చేసేసింది. దీంతో టీడీపీ నేతలు తమ దారి తాము చూసుకోక తప్పడం లేదు. తెలంగాణలో అధికార టీఆర్ఎస్ దూకుడును తట్టుకుని నిలబడే సత్తా తమకు లేదని తేలిపోయింది. గత ఎన్నికల్లో అక్కడ కాస్తో కూస్తో మంచి ఫలితాలే సాధించిన టీడీపీ గ్రేటర్ ఎన్నికల్లో పూర్తిగా తేలిపోయింది. గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీ కేవలం ఒక్క […]
టీడీపీకి పవన్ తప్ప గ్లామర్ ఇంకోటి లేదా?
రాజకీయాలు ఎప్పుడు ఎలా మారతాయో చెప్పడం కష్టం. అప్పటి వరకు నా వెంటే నడుస్తారని భావించిన నాయకులు ప్రజలు ఎలాంటి బుద్ధి చెప్పారో అందరికీ తెలిసిందే. సరిగ్గా ఇలాంటి ఘటన 2014లో ఏపీలో చోటు చేసుకుంది. అందరూ తన వెంటే ఉన్నారని, తానే సీఎం అని భావించిన వైసీపీ అధినేత జగన్‌కు ఊహించని షాక్ ఇచ్చారుఏపీ ప్రజలు. అసలు అధికారం వస్తుందా? సీఎంను అవుతానా? అని సందేహాలు వ్యక్తం చేసిన నారా చంద్రబాబుకి ప్రజలు పట్టకట్టారు. పాలిటిక్స్ […]
కేసీఆర్‌కి ఝలక్..టీఆర్ఎస్‌కి తొలి దెబ్బ!
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో? ఎవరు ఎప్పుడు ఎలా మారతారో? ఎప్పుడు ఎవరితో ఎలాంటి అనుబంధం ఏర్పడుతుందో? ఎప్పుడు ఎవరు ఎవరితో అనుబంధాన్ని కట్ చేసుకుంటారో? చెప్పడం అంత వీజీకాదు!! కౌగిలించుకుని ముద్దులు పెట్టుకున్న నేతలు ఆ తర్వాత కత్తులు దూసుకున్న పరిస్థితులు మన తెలుగు నాట కొత్తకాదు. అదేసమయంలో కత్తులు నూరుకుని.. ఆనక అవసరార్ధం కౌగిలింతలకు సిద్ధమైన నేతలూ మనకు తెలుసు. ఇప్పుడు ఇదే జాబితాలో చేరనున్నారు కాంగ్రెస్ సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ ఉరఫ్ […]