వేల నామినేషన్లన్నారు.. చివరకు 61 మాత్రమే వేశారు

ఈ ప్రభుత్వానికి బుద్ధి చెబుతాం.. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో వేల మందితో నామినేషన్లు వేయిస్తాం.. ప్రభుత్వానికి మా సత్తా చూపుతాం అంటూ పలువురు నాయకులు, ప్రజాసంఘాలు, నిరుద్యోగులు, కాంట్రాక్టు వర్కర్లు గతంలోపేర్కొన్నారు. అందరూ.. నామినేషన్ వేస్తే బ్యాలెట్ పేపర్ కాదు కదా.. బ్యాలెట్ బుక్ తయారు చేయాలని మీడియాలో కథనాలు కూడా వచ్చాయి. ఉప ఎన్నికలకు షెడ్యూల్ వచ్చేసింది.. నామినేషన్ల గడువు కూడా ముగిసింది. తీరా ఎన్ని నామినేషన్లు దాఖలు చేశారంటే.. కేవలం 61 మాత్రమే. అదీ […]

హుజూరాబాద్ ఎన్నికల్లో నలుగురు రాజేందర్లు?

అవును మీరు చదివింది నిజమే.. ఈనెల 30న జరిగే హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో నలుగురు రాజేందర్లు పోటీచేస్తున్నారు. అదేంది ఉన్నది ఒక్క రాజేందరే కదా అనే అనుమానం రావడం సహజం. వారందరూ రాజేందర్లే అయినా.. అందరూ ఈటల రాజేందర్లు కాదు.. కాబట్టి పెద్ద టెన్షనేం అవసరం లేదు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తరువాత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాడు. ఇది అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడ […]

ఏపీ బీజేపీ సంగతి మళ్లీ చూద్దాం

భారతీయ జనతా పార్టీ.. మోదీ ప్రధాని అయిన తరువాత పార్టీకి ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ వచ్చింది. ఓ రాష్ర్టానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఒంటిచేత్తో పార్టీని గెలిపించి ప్రధాని పదవిని చేపట్టారు. మోదీ చేతిలోకి పార్టీ వచ్చిన తరువాత తనకు అత్యంత ఆప్తుడైన అమిత్ షాను పార్టీ చీఫ్.. ఆ తరువాత హోం మంత్రిగా చేశారు. ఇపుడు బీజేపీ అధిష్టానం ఎవరంటే ముందుగా మోదీ.. తరువాత అమిత్ షా పేరు బయటకు వస్తుంది. ఢిల్లీ సింహాసనంపై కూర్చున్న […]

ఈసారి ప్రచారం లేదు.. పర్యవేక్షణే..!

ఈనెల 30వ తేదీన జరిగే హుజూరాబాద్ ఉప ఎన్నికలకు ముఖ్యమంత్రి ప్రచాయం చేయకపోవచ్చు. ఆయన ప్రచారం చేయకపోయినా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తారు. ముఖ్యంగా కుమారుడు కేటీఆర్ ను రంగంలోకి దించే అవకాశముంది. దాదాపు ప్రతి ఎన్నికల్లోనూ ముఖ్యమంత్రి బహిరంగ సభల్లో పాల్గొని ప్రచారాన్ని పీక్ స్థాయికి తీసుకెళతారు. అయితే హుజూరాబాద్ లో మాత్రం అడుగుపెట్టకపోవచ్చని తెలుస్తోంది. కారణం ఎన్నికల కమిషన్.. కోవిడ్ కారణంగా వెయ్యి మందికి మించి ఎన్నికల బహిరంగ సభకు హాజరు కాకూడదని […]

కిషన్‌ మౌనం వెనుక అంతరార్థమిదేనా?

సికింద్రాబాద్‌ ఎంపీ, కేంద్ర మంతి కిషన్‌ రెడ్డి ఇటీవల కాలంలో సైలెంట్‌గా ఉండిపోయారు. రాష్ట్రంలో పర్యటన సందర్భంగా ఆయన టీఆర్‌ఎస్‌పై విమర్శలు పెద్దగా చేయడం లేదు. గతంలో అయితే టీఆర్‌ఎస్‌ పార్టీని నిరంతరం టార్గెట్‌ చేసే కిషన్‌ రెడ్డి ఇప్పుడెందుకిలా మౌనంగా ఉండిపోతున్నారని రాజకీయ పరిశీలకులు అనుకుంటున్నారు. అయితే ఆయన మౌనం వెనుక కేంద్రం పెద్దలు ఉన్నారని, కావాలనే ఆయనను సైలెంట్‌గా ఉండాలని బీజేపీ అధిష్టానం ఆదేశించినట్లు సమాచారం. అందుకే కిషన్‌ రెడ్డి కేవలం తన శాఖాపరమైన […]

తెలంగాణపై జనసేనాని దృష్టి..కేసీఆర్ ను టార్గెట్ చేస్తారా?

చిరంజీవి క్రియాశీల రాజకీయాల్లోంచి తప్పుకున్న అనంతరం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జనసేన పార్టీని సంగతి తెలిసిందే. పార్టీ స్థాపించినప్పటి నుంచీ ఆయన ఏపీపైనే ఫోకస్ చేశారు. సభలు, సమావేశాలు, పార్టీ కార్యక్రమాలు, మేధావులతో చర్చలు.. ఇలా అన్నీ ఏపీ కేంద్రంగానే సాగాయి. మరెందుకో పవన్ కల్యాణ్ తెలంగాణలో పార్టీ గురించి ఆలోచించడం లేదు. పవన్ కల్యాణ్ కు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా యూత్ పవన్ మాటలకు బాగా కనెక్ట్ అవుతారు. దీనిని […]

ఉన్నది మూడు నెలలే… ఆ తరువాత?

ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవితకు కొత్త టెన్షన్ మొదలైంది. కొద్ది రోజులుగా రాజకీయాలకు దూరంగా ఉన్న ఆమె ఇటీవల యాక్టివ్ అయిన సంగతి తెలిసిందే. కొద్ది రోజుల్లో అంటే మరో మూడు నెలల్లో ఆమె ఎమ్మెల్సీ పదవీ కాలం ముగియనుంది. అదేంటి.. ఆమె ఎమ్మెల్సీగా గెలిచింది గత సంవత్సరమే కదా .. ఎమ్మెల్సీ పదవీ కాలం ఆరేళ్లు అనుకుంటే మనం తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే నిజామాబాద్ లో కవిత గెలిచింది ఉప ఎన్నికల్లో.. అప్పటికే సమయం […]

భారీ భవంతిని సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్.. కాస్ట్ ఎంతంటే ..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ లో కొత్తగా ఓ బంగ్లా కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఆయన ఈ భవనం కొనుగోలుకు రూ. 12 కోట్ల మొత్తాన్ని వెచ్చించి నట్లు సమాచారం. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ జూబ్లీహిల్స్ లోని రోడ్ నెంబర్ 36 లో నివాసం ఉంటున్నారు. అలాగే ఆయనకు నగర శివారులో ఒక ఫామ్ హౌస్ కూడా ఉంది. తాజాగా పవన్ జూబ్లీహిల్స్ ఒక బంగ్లాను రూ 12 కోట్లకు కొనుగోలు చేసినట్లు […]

ఆ రాష్ట్రంలో పోసాని పై కేస్ ఫైల్..!

సినీ నటుడు పోసాని పై తక్షణమే కేసు నమోదు చేయాలని మరొకసారి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు , జనసేన పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సెప్టెంబర్ 28 న పోసాని.. కృష్ణ మురళి పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేయమని కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగినట్లు..జనసేన పార్టీ కార్యకర్తలు తెలియజేశారు. చిరంజీవి ఈ విషయంపై స్పందించే వరకు పోలీసులు ఎలాంటి లీగల్ యాక్షన్ తీసుకోలేదని తెలియజేస్తున్నారు. అందువలన పంజాగుట్ట పిఎస్ […]