వైకాపా నుంచి జంప్ చేసి టీడీపీలోకి వచ్చిన ఎమ్మెల్యేలకు పెద్ద ఎత్తున షాక్ తగలనుంది. అప్పట్లో టీడీపీ అధినేత చంద్రబాబు విసిరిన ఆకర్ష్ దెబ్బకి ఒక్కరొక్కరుగా జగన్‌కు ఝలక్ ఇచ్చి మరీ సైకిల్ ఎక్కేశారు. వీరిలో పెద్దతలకాయలు గా భావించిన వారికి చంద్రబాబు మంత్రి పదవులు ఇస్తానని అప్పట్లోనే హామీ ఇచ్చినట్టు సమాచారం. ముఖ్యంగా కేబినెట్‌లో ప్రస్తుతం ఖాళీగా ఉన్న మైనార్టీ శాఖ మంత్రి పదవి సహా పలువురికి అమాత్య పీఠాలు అప్పగిస్తానని బాబు హామీ ఇచ్చారని […]
Tag: TDP
యనమలకు మైనస్ మార్కులు వెనక ఉన్నదెవరు
ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వంలో నెంబర్ టూ గా ఉన్న ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఇప్పడు బ్యాడ్ టైం ఫేస్ చేస్తున్నారట! తన పొలిటికల్ అనుభవం, చతురత, పాలనా అనుభవం అన్నీ ఆయనను వెక్కిరిస్తున్నాయట! అయ్యే అంత పెద్ద నేతకి ఇంత కష్టమా? ఎందుకు? ఏమిటి? అని అనుకుంటున్నారా… అయితే, ఇది చదివి తీరాలి. చంద్రబాబు తన మంత్రివర్గంపై ఇటీవల సర్వే చేయించారు. వారి పనితీరు, ప్రజలతో ఎలా మమేకం అవుతున్నారు? పదవిని అడ్డంగా ఎలా వాడేసుకుంటున్నారు? […]
అమరావతిలో నాలుగేళ్ల ఖర్చు చూస్తే షాకే
ఏపీ రాజధాని అమరావతి కోసం వచ్చే నాలుగేళ్లలో ఖర్చు చేయాలని భావిస్తున్న డబ్బెంతో తెలిస్తే.. షాకే! ఒక వెయ్యి కోట్లు కాదు పది వేల కొట్లు కాదు ఏకంగా 32 వేల కోట్లకు పైగానే ఖర్చు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక, ఇప్పటికే సీఎం చంద్రబాబు కలల రాజధాని అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్ని ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ముఖ్యంగా ఏ పని సాకారం కావాలన్నా డబ్బుతోనే పని. అలాంటిది ఏమీలేని చోట అంతర్జాతీయ స్థాయి […]
చంద్రబాబులో నాటి జోష్ నేడు ఏమైంది…
వర్తమాన రాజకీయాల్లో… పరిపాలనాధక్షుడిగా ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సామర్థ్యం ఏంటో ఆయన ట్రాక్ రికార్డ్ చెప్పకనే చెవుతుందనేది టీడీపీ వర్గాలు తరచూ చెప్పే మాట. పైకి ఏం చెప్పినా ఇందులో వాస్తవముందని ప్రతిపక్ష నాయకులు కూడా ఒప్పుకునే విషయమే. అయితే ఈ వాదన చంద్రబాబు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి కాలానికి వర్తిస్తుంది కాని… ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం ఆ స్థాయిలో పని చేయలేక పోతోందని ఇపుడు ఏ పార్టీకి సంబంధం లేని తటస్థుల్లో ఎక్కువగా వినిపిస్తున్న […]
ఏపీ సీఎం ఫ్యామిలీ ఆస్తులెన్నో తెలుసా
ఏపీ సీఎం చంద్రబాబు కుటుంబ ఆస్తులను ఆయన కుమారుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు బుధవారం ప్రకటించారు. ఇలా పొలిటికల్‌గా ఓ రేంజ్‌లో ఉన్న నేత తన కుటుంబ ఆస్తులు ప్రకటించడం దేశంలో చాలా అరుదు. అయితే, చంద్రాబాబు కుటుంబం మాత్రం తమ ఆస్తుల వివరాలను వరుసగా ఎనిమిదోసారి ప్రకటించండం గమనించాల్సిన విషయం. ఇక, లోకేష్ చెప్పిన దానిని బట్టి.. చంద్రాబాబు, ఆయన కుటుంబానికి ఒక్క హెరిటేజ్ ఫ్రెష్ మాత్రమే ఆధారంగా కనిపిస్తోంది. దీంతో […]
కార్పొరేషన్ పోరులో జనసేన ఎఫెక్ట్ ఎవరికి ఎంత..!
తెలుగునాట ఎన్టీఆర్, ఏఎన్నార్ ల తరువాత ఆ స్థాయిలో దశాబ్దాలపాటు సినీ అభిమానులను ఉర్రూతలూగించి తిరుగులేని అభిమాన గణాన్ని సొంతం చేసుకున్న ఘనత చిరంజీవిది. ఆ ధైర్యంతోనే ఎన్టీఆర్ బాటలోనే తానూ సొంతంగా రాజకీయ పార్టీ పెట్టి ముఖ్యమంత్రి కావాలని ఆశించిన చిరంజీవికి రాజకీయాల్లో మాత్రం గట్టి ఎదురుదెబ్బనే రుచిచూడాల్సి వచ్చింది. సినిమాల్లో నెంబర్ వన్‌గా రాణించిన చిరంజీవి రాజకీయాల్లో మాత్రం వెనుకబెంచీ విద్యార్థిగానే ఉండిపోయారు. చిరంజీవి రాజకీయాల్నినమ్ముకుని సినీరంగాన్ని వీడటంతో సహజంగానే ఆయన అభిమాన గణమంతా […]
లోకేష్‌కు గుడ్ న్యూస్…ఆమెకు బ్యాడ్ న్యూస్
లోకేష్‌కు ప్రభుత్వంలో పదవులిచ్చే అంశాన్నిముఖ్యమంత్రి చంద్రబాబు తాత్కాలికంగా పక్కన పెట్టినా… లోకేష్ రాజకీయ అరంగేట్రం పేరు చెపితేనే విపక్ష వైసీపీ ఉలికిపడుతూ విమర్శలు గుప్పిస్తోంది. దీంతో లోకేష్ పేరు చెపితేనే జగన్ భయపడుతున్నారని… జగన్‌కు దీటైన ప్రత్యర్థి లోకేషేనని, విపక్ష వైఖరి చూశాక టీడీపీలో యువ నాయకులు ఫిక్స్ అయిపోయినట్టు తెలుస్తోంది. అందుకే లోకేష్‌కు ప్రభుత్వంలో సముచిత పదవినివ్వాలని పార్టీ నేతలు మరోసారి ముఖ్యమంత్రిని కలిసి చెప్పినట్టు సమాచారం. చంద్రబాబు పాలనా వ్యవహారాల్లో తీరిక లేకుండా గడుపుతుండటంతో […]
ఆ ఇద్దరు మంత్రులకు డీ గ్రేడ్ ఇచ్చిన బాబు
ఏపీ ప్రభుత్వంలో మంత్రులు ఇప్పుడు విచిత్ర పరిస్తితిలో కొట్టుమిట్టాడుతున్నారు. తమకు తిరుగులేదు.. అని గుండెల నిండా గాలి పీల్చుకుని తిరిగిన నేతలు ఇప్పుడు ఒక్కసారిగా కుంగిపోతున్నారు. దీనంతటికీ కారణం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సీఎం చంద్రబాబు చేయించిన సర్వేనే! ఆ సర్వేలే ఇప్పుడు మంత్రులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. సర్వేలో భాగంగా మంత్రుల పనితీరు, ప్రజలు, అధికారులతో ఇంటరాక్షన్, సమీక్షలు వంటి వివిధ పనుల ఆధారంగా చంద్రబాబు వారికి గ్రేడ్‌లు నిర్ణయించారు. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు […]
రోజా బూతుల పంచాంగం అందుకేనా..!
వర్తమాన రాజకీయాల్లో విలువలకు కట్టుబడి ఉండటం కంటే… ప్రజలను ఏ స్థాయిలో నమ్మించగలమనేదానిపైనే తమ రాజకీయ భవితవ్యం ఆధారపడి ఉంటుందన్నది అధిక శాతం రాజకీయ నాయకుల నమ్మకం. అందుకే మీడియాలో రాజకీయ నేతల ముఖాముఖి చర్చల్లో దాదాపు మాటల యుద్ధమే జరుగుతోంది. ప్రత్యర్థులపై వ్యక్తిగత విమర్శల చేసే విషయంలో కొందరు నేతలైతే అన్నిహద్దులను ఎప్పుడో దాటేశారు. తమ నోటి దురుసుతో ప్రత్యర్థి పార్టీలకు చెందిన నేతల వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న తీరు జుగుప్స కలిగిస్తోంది. ఇక తనను […]