పాలిటిక్స్‌లో ఎప్పుడు ఏమైనా జరగొచ్చు! అంతేకాదు, అసలు పాలిటిక్స్‌లో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకంటే.. ప్రస్తుతం కాంగ్రెస్ ఎంపీగా ఉన్న చిరంజీవి పొలిటికల్ ఫ్యూచర్‌పై అనేక వార్తలు వెల్లువెత్తుతున్నాయి కాబట్టి!! ప్రజారాజ్యం పార్టీతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినా కాలం కలిసిరాకపోవడంతో దానిని కాంగ్రెస్‌లో విలీనం చేసిన చిరంజీవి ప్రతిగా.. కేంద్రంలో మంత్రి పదవి కొట్టేశారు. ఆ తర్వాత రాజ్యసభకు ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరో ఏడాదిన్నర వరకు ఆయన రాజ్యసభ […]
Tag: TDP
ఏపీలో శత్రువు… తెలంగాణలో మిత్రువా..!
తన మాటల మాయాజాలంతో తెలంగాణ ప్రజలను కట్టిపడేస్తూ, తిరుగులేని రాజకీయ వ్యూహాలతో ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసేస్తూ టీఆర్ఎస్‌ను తెలంగాణలో తిరుగులేని రాజకీయ శక్తిగా మార్చిన టీ ముఖ్యమంత్రిని సమర్థంగా ఎదుర్కోవడానికి తెలంగాణలోని ప్రతిపక్షాలన్నీ ఒక్కటొకటిగా ఏకమవుతున్నాయి. ఇప్పటిదాకా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్, టీడీపీ ఎవరికివారుగా అధికార టీఆర్ఎస్‌పై పోరు సలుపుతుండగా…ఒకప్పుడు తెలంగాణలో బలంగా ఉండి ప్రస్తుతం ప్రాబల్యం కోల్పోయిన సీపీఎం గత వైభవం సాధించాలన్న గట్టి పట్టుదలతో ఇప్పుడు రంగంలోకి దిగింది. తెలంగాణ ప్రజలకు సంబంధించి, […]
విజయవాడ టీడీపీలో కొత్త ఫైటింగ్
ఏపీలో అధికార టీడీపీలో అన్ని జిల్లాల్లోను పార్టీ నాయకుల మధ్యే అస్సలు పొసగడం లేదు. దాదాపు పదేళ్ల తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చినా నాయకుల మధ్య మాత్రం అస్సలు క్రమశిక్షణ కనపడడం లేదు. చంద్రబాబు అంటేనే క్రమశిక్షణకు కేరాఫ్ అన్న నానుడి ఉండేది. అయితే ఇప్పుడు టీడీపీలో మాత్రం మునుపటి క్రమశిక్షణ లేదు. ఇక టీడీపీలో పాత నాయకులకు, కొత్తగా వైకాపా నుంచి జంప్ చేసిన వారికి అస్సలు పొసగడం లేదు. పార్టీ కోసం పదేళ్ల పాటు […]
ఏపీలో ఐటీ డవలప్‌మెంట్ బాబుకు కత్తిమీద సామే
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఐటీకి బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే అందరూ ఖచ్చితంగా చంద్రబాబునాయుడి వైపే చూస్తారు. ఎందుకంటే భాగ్యనగరానికి ఐటీ కంపెనీలను తీసుకురావడంలోను, హైదరాబాద్‌ను సైబరాబాద్‌గా మార్చడంలోను చంద్రబాబునాయుడు చూపిన చొరవ, చేసిన కృషి అంత త్వరగా ఎవరూ మరచిపోలేరు. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ప్రతి పల్లెనుంచీ పదుల సంఖ్యలో ఐటీ నిపుణులు దేశవ్యాప్తంగా ఆ మాటకొస్తే ప్రపంచం నలుమూలలా పని చేస్తున్నారంటే అది ఖచ్చితంగా చంద్రబాబు చలవే. అయితే, తెలంగాణ ఏర్పడ్డ తరువాత ఏపీలో కేవలం ఏవో […]
బాబు కేబినెట్‌లో ఆ రెడ్డిగారు అవుట్..!
ఏపీ క్యాబినెట్‌లో దీపావళికి కాస్త అటూ ఇటూగా ప్రక్షాళన జరగడం ఖాయమని, కొందరు కొత్త సభ్యులకు మంత్రివర్గంలో స్థానం దక్కనుందనీ, అదే సమయంలో కొందరు పాత కాపులకు క్యాబినెట్ నుంచి ఉద్వాసన తప్పదనీ టీడీపీ అధిష్ఠానం కొంతకాలంగా సంకేతాలు పంపుతూ వస్తోంది. ఇక ఇప్పుడు దీపావళి సంబరాలు ముగిసినట్టే.. మరి ఇప్పుడైనా మంత్రి వర్గ విస్తరణ ఉంటుందా.. అని పార్టీలోని ఆశావహులు సహజంగానే ఆశగా ఎదురుచూస్తున్నారు. మరి కొత్తగా ఎవరెవరిని మంత్రిపదవులు వరించనున్నాయనేది ఆసక్తికరంగానే కనిపిస్తోంది. […]
ఏపీలో మునిసిపల్ ఎన్నికలపై కొత్త చర్చ
ఏపీలో త్వరలో జరగబోయే మునిసిపల్ ఎన్నికలపై కొత్త చర్చ జరుగుతోంది. మొత్తం 11 మునిసిపాలిటీలు, 5 కొర్పొరేషన్లకు ఎట్టి పరిస్థితిలోనూ రానున్న రెండేళ్లలో ఎన్నికలు జరగాల్సి ఉంది. వాస్తవానికి నవంబరు 30లోగా దీనిపై ఏదో ఒక నిర్ణయం తీసుకుని తమకు చెప్పాలని హైకోర్టు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో మునిసిపల్ ఎన్నికల నిర్వహణకు చంద్రబాబు ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. అయితే, 2014 ఎన్నికల తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న తొలి ఎన్నికలు కావడం, […]
టీడీపీలో టాప్ ఎమ్మెల్యేలకు లీస్ట్ ర్యాంకులా..!
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు వరుసగా ఏపీలో మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లపై ఎప్పటికప్పుడు సర్వేలు చేయిస్తున్నారు. ఈ సర్వేల వివరాల ఆధారంగా ర్యాంకులు ప్రకటించడంతో వారు కూడా ఎప్పటికప్పుడు అలెర్ట్‌గా ఉండాల్సిన అవసరం ఏర్పడుతోంది. ఏ మాత్రం తేడా కొట్టినా వచ్చే ఎన్నికల్లో బాబు గారు టిక్కెట్టు ఇస్తారా ? ఇవ్వరా ? అన్న సందేహాలు చాలా మందిలో ఉండడంతో మంత్రులు, ఎమ్మెల్యేలంతా తమ శాఖలతో పాటు నియోజకవర్గాల్లో ఉత్తమ పనితీరు మెరుగు పరచుకోవాల్సిన […]
ఏపీలో ప్రస్తుతం ఎన్నికలు జరిగితే విన్నర్ ఎవరు..!
రాష్ట్రం ఆర్థికంగా విపత్కర పరిస్థితుల్లో ఉన్న సమయంలో అధికారం చేపట్టినా… తన సమర్థత, సుదీర్ఘ రాజకీయ, పాలనానుభవం, సమయానుకూల వ్యూహాలే పెట్టుబడిగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్ర పరిస్థితిని ఓ రకంగా గాడిలో పెట్టగలిగారనే చెప్పాలి. అయితే తాను రాత్రిపగలు తేడా లేకుండా కుటుంబాన్ని కూడా మరచిపోయి.. రాష్ట్రం కోసం శ్రమిస్తున్నా.. అందుకు తగిన స్థాయిలో టీడీపీ ప్రభుత్వానికి మైలేజీ రావడం లేదని చంద్రబాబు పార్టీ అంతర్గత చర్చల్లో వాపోతున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.. దానికితోడు […]
లగడపాటి టీడీపీ ఎంట్రీ..!
లగడపాటి రాజగోపాల్ … ఉమ్మడి తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో రెండు మూడేళ్ల క్రితం దాకా ఆ పేరే ఓ సంచలనం. తన చొరవ, దూకుడు కలగలిసిన స్వభావంతో ఆయన పారిశ్రామికంగా అతి తక్కువ కాలంలోనే అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తగా ఎదిగిన వ్యక్తి. ఇక రాజకీయరంగంలోనూ ఆయన పదేళ్ల ప్రస్థానం అడుగడుగునా సంచలనమేనని చెప్పాలి. రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఓ రకంగా రాజగోపాల్ ఒంటరి పోరాటమే కొనసాగించారు. ఓ పక్క విభజన వాదులతోను, మరో పక్క తన సొంత […]