ఏపీ అధికార పార్టీలో ఇద్దరు నేతలు ఇప్పుడు సెంటరాఫ్‌ది ఎట్రాక్షన్‌గా మారారు. రాష్ట్రంలో టీడీపీని అన్ని విధాలా పరుగులు పెట్టించడంలో ఈ ఇద్దరు నేతలు అత్యంత కీలకంగా ముందడుగు వేస్తున్నారట. దీంతో ఇప్పుడు అందరి కళ్లూ ఆ ఇద్దరు నేతలపైనే ఉన్నాయని టాక్ నడుస్తోంది. ఆ ఇద్దరు ఎవరో కాదు. ఒకరు టీడీపీ ఏపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు కాగా మరోకరు సీఎం చంద్రబాబు ముద్దుల కుమారుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ లేనట! ఈ […]
Tag: TDP
చంద్రబాబు సేఫ్ గేమ్‌లో విన్నర్ వైసీపీనా?
మొత్తానికి టీడీపీపై వైసీపీ ఆధిపత్యం సంపాదించింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏడో స్థానం ఎవరు గెలుస్తారో అనే ఉత్కంఠకు తెరదించింది. ఏడు స్థానాల్లో ఐదింటిని టీడీపీ గెలుచుకున్నా.. మిగిలిన రెండు స్థానాలను దక్కించుకుంది. దీంతో తమకు బలం లేకపోయినా రెండో సీటును గెలుచుకుని.. టీడీపీపై పైచేయి సాధించింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏడుగురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు!! అయితే ఇందులో టీడీపీ అధిక స్థానాలు గెలుచుకున్నా.. నైతికంగా టీడీపీపై వైసీపీ విజయం సాధించినట్టయింది. ఎమ్మెల్యేల […]
వైసీపీలోకి టీడీపీ మాజీ మంత్రి
ఎమ్మెల్సీ ఎన్నికలు టీడీపీలో అసంతృప్తి సెగలు రేపుతున్నాయి. ఎన్నో యేళ్ల నుంచి పార్టీని నమ్ముకుని ఉన్నాం… ఎన్నోసార్లు త్యాగాలు చేశాం…అయినా పార్టీ తమకు న్యాయం చేయలేదని వారంతా మండిపడుతున్నారు. వారిలో కొందరు తమ తీవ్ర అసంతృప్తిని ఓపెన్‌గానే వ్యక్తపరిస్తే మరికొందరు మాత్రం పార్టీకే గుడ్ బై చెప్పేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఏపీలో ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీల ఎంపిక సీనియర్లలోను, ఆశావాహుల్లోను అసంతృప్తి సెగలు రేపుతోంది. తాజాగా అసెంబ్లీ సమావేశాల వేళ డిప్యూటీ సీఎం కేఈ.కృష్ణమూర్తి తన […]
మరో వ్యూహంతో టీఆర్ఎస్ బలాన్ని నిరూపించేందుకు సిద్ధమవుతున్న కెసిఆర్
కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలని తెలంగాణ సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ముఖ్యంగా ప్రతిపక్షం బలంగా ఉన్న నల్గొండను టార్గెట్ చేసుకున్నారు. దీంతో కాంగ్రెస్ అధిష్టాన పెద్దలందరికీ ఒకేసారి సమాధానం చెప్పాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతేగాక టీఆర్ఎస్ బలాన్ని నిరూపించేందుకు సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లో చేరిన.. ఎంపీ గుత్తాసుఖేందర్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇవ్వాలని భావిస్తున్న తరుణంలో.. నల్లగొండ లోక్ సభ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించి, ప్రజల్లో టీఆర్ఎస్‌కు ప్రజాదరణ ఉందని కాంగ్రెస్‌కు తెలిసొచ్చేలా చేసేందుకు వ్యూహాత్మకంగా […]
టీడీపీ, వైసీపీకి బిగ్ ఫైట్.. సమ్మర్ పరీక్ష అదే
ఆంధ్రప్రదేశ్‌లో మరో బిగ్ ఫైట్‌కు తెరలేవనుంది. ఎమ్మెల్సీల కోటాలో మొదలైన ఈ ఎన్నికల యుద్ధం.. ఇంకా కొనసాగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. త్వరలో పెండింగ్‌లో ఉన్న మున్సిపల్, కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో టీడీపీ, వైసీపీ మధ్య మరో సంగ్రామం తప్పేలా కనిపించడం లేదు. ముఖ్యంగా రెండేళ్ల పాలనకు ఇవి రెఫరెండంగా టీడీపీ భావిస్తుండగా.. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి.. ప్రజల్లో వచ్చే ఎన్నికల నాటికి బల పడాలని వైసీపీ భావిస్తోంది. సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో […]
ఎమ్మెల్యే కోటాలో టీడీపీ ఎమ్మెల్సీలు వీళ్లే… ట్విస్టులే ట్విస్టులు
ఇప్పటికే స్థానిక సంస్థల ఎమ్మెల్సీలను ఏకగ్రీవం చేసుకుని దూకుడు మీదున్న టీడీపీ.. ఇప్పుడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలపై దృష్టిసారించింది. అనేక వడపోతలు, చర్చోపచర్చల అనంతరం కొంతమందిని ఎంపిక చేశారు పార్టీ అధినేత చంద్రబాబు. ఇప్పుడు వీరి నుంచి ఫైనల్ అభ్యర్థులను ఖరారు చేసినట్టు సమాచారం! అలాగే గవర్నర్ బెర్తు కోటాలో ఎవరికి ఎమ్మెల్సీ కేటాయించాలో కూడా ఇప్పటికే జాబితా సిద్ధం చేసేశారట. అలాగే తన తనయుడు లోకేశ్ నామినేషన్ వేసేందుకు కూడా ముహూర్తం ఫిక్స్ చేశారట. స్థానిక […]
బాబు మళ్లీ బొత్స గాడిలో పడుతున్నారా?
అధికార పార్టీ నాయకులు ఎంతమంది ఉన్నా విజయనగరం జిల్లాలో ప్రతిపక్షానికి చెందిన బొత్స సత్యనారాయణ మాటే చెల్లుబాటు అవుతోంది. విజయనగరంలో అధికార యంత్రాంగాన్నంతా తన చెప్పుచేతల్లో పెట్టుకుని చెలరేగుతున్నారట. ఈ విషయం అధికార పార్టీ నేతలకు తెలిసినా.. ఉదాసీన వైఖరితో వ్యవహరిస్తున్నారట. ఇదే సరైన సమయంగా భావించి.. అధికార యంత్రాంగాన్ని చెప్పుచేతల్లో పెట్టుకుని చక్రం తిప్పుతున్నారు. అయితే తాను టీడీపీలో చేరిపోతానని సంకేతాలు ఇస్తూ ఇలా తన పనులన్నీ చక్కబెట్టుకుంటున్నారట. అయితే గతంలోనూ ఇదే తరహాలో బాబును […]
లోకేశ్ ఎంట్రీతో ఆ ముగ్గురు మంత్రులకు టెన్షన్
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేశ్ కేబినెట్ ఎంట్రీకి ముహూర్తం ఖరారైంది. ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ అవుతోన్న లోకేశ్ ఉగాది జరిగే మంత్రివర్గ విస్తరణలో బాబు కేబినెట్‌లోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయమైంది. ఇక మంత్రివర్గ ప్రక్షాళనలో లోకేశ్‌కు ఏయే శాఖలు దక్కుతాయన్నదానిపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం కొన్ని శాఖలను చంద్రబాబు ఎవ్వరికి ఇవ్వకుండా తన వద్దే ఉంచుకున్నారు. మౌలిక సదుపాయాలతో పాటు పరిశ్రమలు, వాణిజ్యం, సినిమాటోగ్రఫీ, న్యాయశాఖ, పర్యాటక శాఖలు ఉన్నాయి. […]
టీడీపీ లో ఎమ్మెల్సీ కోసం లేడీ లీడర్ల మధ్య ఆసక్తికర పోరు
ఏపీలో ఎమ్మెల్సీ సీట్ల కోసం అధికార పార్టీలో పోరు తీవ్రంగా ఉంది. ఇప్పటికే స్థానిక సంస్థల కోటాలో చంద్రబాబు వివిధ జిల్లాలకు అభ్యర్థులను ప్రకటించేశారు. ఇక మిగిలిందల్లా ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ సీట్లు ఎవరికి వస్తాయా ? అని అందరూ ఉత్కంఠతో వెయిట్ చేస్తున్నారు. అసెంబ్లీలో ఉన్న లెక్కల ప్రకారం టీడీపీకి ఐదు సీట్లు గ్యారెంటీ. ఆరో సీటు కాస్త మ్యానేజ్ చేస్తే దక్కించుకోవచ్చు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబు మహిళలెవ్వరికి సీట్లు ఇవ్వలేదు. దీంతో ఇప్పుడు […]