వివాదాస్పద వ్యాఖ్యలు, సంచలన కామెంట్లతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే జేసీ సోదరులు.. ఇప్పుడు తమ రాజకీయ భవిష్యత్తుపై సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమ వారసులను రంగంలోకి దించే పనిలో నిమగ్నమైన వారు.. అందుకు మార్గం సుగమం చేశారు! అనంతపురం రాజకీయాలను ఏళ్లుగా శాసిస్తున్న వీరు ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. వారి స్థానంలో తమ తనయులను ఎంపీగా, ఎమ్మెల్యేగా నిలబెట్టబోతున్నారు. ఇప్పుడు జేసీ బ్రదర్స్‌కు సరికొత్త అర్థాన్ని ఇవ్వబోతున్నారు. ఇటీవల ఏపీలో జరిగిన దివాకర్ […]
Tag: TDP
భూమా నాగిరెడ్డి మృతికి కారణాలివే..
కర్నూలు జిల్లా నంధ్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి హఠాన్మరణం.. అటు టీడీపీని, ఇటు వైసీపీ నేతలను తీవ్రంగా కలిచివేస్తోంది. ఆయన లేరన్న వార్త అందరినీ శోకసంద్రంలో నింపేస్తోంది! నాగిరెడ్డి మృతి చెందిన విషయాన్ని ఆయన బావమరిది ఎస్వీ మోహన్ రెడ్డి ధ్రువీకరించారు. ముఖ్యంగా ఆయన గుండెపోటుతో మృతిచెందారన్న విషయం.. అందరిని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. మరి పెద్ద వయస్సు కాకపోయినా భూమా 53 సంవత్సరాల వయస్సులోనే ఇంత త్వరగా మృతి చెందడానికి నాలుగు కారణాలు ప్రముఖంగా కనిపిస్తున్నాయి. […]
భూమా మృతితో మారనున్న కర్నూలు పాలిటిక్స్
టీడీపీ సీనియర్ లీడర్, కర్నూలు జిల్ల నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆకస్మిక మృతితో కర్నూలు జిల్లా రాజకీయాల్లో చాలా మార్పులు చోటు చేసుకోనున్నాయి. వాస్తవానికి త్వరలో జరిగే ఏపీ కేబినెట్ ప్రక్షాళనలో భూమాకు మంత్రి పదవి ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చినట్టు కూడా వార్తలు వచ్చాయి. భూమా మంత్రి పదవి హామీతోనే వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ చేసిన సంగతి తెలిసిందే. గతంలో టీడీపీలో పనిచేసిన భూమా ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్లారు. ఆ […]
నారాయణ.. ఆనంపై ఈ చిన్న చూపేలా!!
పూలమ్మిన చోటే.. కట్టెలమ్మడం ఈ మాట రాజకీయాల్లో తరచూ వినిపిస్తుంది. పార్టీ అధికారంలో ఒక వెలుగు వెలిగి.. తమ మాటే శాసనంగా ఉన్న నాయకులు.. పవర్ పోగానే ఒక్కసారిగా చీకట్లోకి వెళిపోతారు! తమకు కావాల్సిన పనులను చిటికెలో చేయించుకన్న చోటే.. తమ పని అవ్వడానికి ఎంతో కాలం వేచిచూడాల్సిన పరిస్థితి! ప్రస్తుతం నెల్లూరు జిల్లాలోనూ ఇలాంటి సంఘటనలే జరుగుతున్నాయి. ఆనం వివేకానందరెడ్డికి, మంత్రి నారాయణకు మధ్య ఇటీవల జరిగిన ఒక సంఘటన.. అచ్చు సినిమాలోని సన్నివేశాన్ని తలపించేలా […]
సమయం లేదు మిత్రమా … కడపలో ఇక రణమే
స్థానిక మండలి ఎన్నికలు దగ్గరపడుతున్న దృష్ట్యా పార్టీ గెలుపుకి అవసరమైన ఓటర్లని ఒక చోటకి చేర్చండి ,నాయకులంతా అప్రమత్తం అవండి అని పార్టీ నాయకులకి ,పార్టీ శ్రేణుకులకు టీడీపీ అధ్యక్షులు మరియు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆదేశించారు .దీనితో పార్టీ నియోజవర్గ ఇంచార్జిలు మరియు నాయకులూ ఓటర్లను శిబిరాలకు తరలిస్తూ ఉండటంతోపాటు ,మిగిలి ఉన్నవారిని కూడా తరలిస్తున్నారు .దీంతో శిబిర రాజకీయాల సందడి మరింత పెరిగింది. పోరు ప్రతిష్టాత్మకంగా మారడంతో ఇరు పార్టీలు ఎవరి వ్యూహ […]
ఇరు రాష్ట్రాల చంద్రులకు హ్యాప్పీ న్యూస్
జంప్ జిలానీలకు సీట్లు ఎలా సర్దుబాటు చేయాలో తెలియక సతమతమవుతున్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కేంద్రం బంపర్ ఆఫర్ ప్రకటించింది. అసెంబ్లీ నియోజకవర్గాలను పెంచితే ఎమ్మెల్యే సీటు గ్యారెంటీ హామీతో ఇప్పటికే ఇరు రాష్ట్రాల్లోని అధికార పార్టీల్లో ప్రతిపక్ష పార్టీల్లోని ఎమ్మెల్యేలు చేరిపోయారు. అసెంబ్లీ నియోజకవర్గాలు పెరగకపోతే ఇక రెండు రాష్ట్రాల్లో కలకలం రేగడం ఖాయం! అయితే ఇప్పుడ అసెంబ్లీ నియోజకవర్గాల పెంపునకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఇందుకు సంబంధించి మొత్తం సమాచారాన్ని పంపాలని ఇరు రాష్ట్రాలకు […]
నెల్లూరు టీడీపీలో క్యాస్ట్ ఫీలింగ్ చిచ్చు
నెల్లూరు జిల్లాలో వర్గపోరు ముదిరిపోయింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ముందు కుల సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. బలమైన సామాజికవర్గానికి చెందిన నేతలు టీడీపీ నుంచి వైసీపీలో చేరిపోతున్నారు. ముఖ్యంగా ఇతర సామాజికవర్గాల ఆధిపత్యాన్ని సహించలేని రెడ్డి సామాజిక నేతలు.. జగన్ పార్టీలోకి జంప్ అవుతున్నారు. అలాగే మంత్రి నారాయణ, బీద రవిచంద్రలు.. తమను అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. అయితే ఆలస్యంగా విషయం తెలుసుకున్న చంద్రబాబు.. ఆ ఇద్దరు నేతలపై తీవ్రంగా ఫైర్ అయ్యారు. ఇక్కడ […]
రాజకీయాలకు టీడీపీ ఎంపీ గుడ్ బై..! ఆ పోస్టు దక్కేనా..!
టీడీపీ ఎంపీ రాజకీయాలకు గుడ్‌బై చెప్పబోతున్నారు. తన చిరకాల కోరిక అయిన ఒక పదవి కోసం ఇక ప్రజా జీవితం నుంచి శాశ్వతంగా దూరం కాబోతున్నారు. కమ్మ సామాజిక వర్గంలో బలమైన నేతగా పేరు సంపాదించిన ఆయన.. ఇక 2019 ఎన్నికల్లో పోటీ చేసే అవకావాలు దాదాపు కనిపించడం లేదు. ఆయన మరెవరో కాదు నరసన్న పేట ఎంపీ రాయపాటి సాంబశివరావు!! పార్టీలు మారినా.. టీటీడీ చైర్మన్ పదవి ఆయనకు అందని ద్రాక్ష గానే మిగిలిపోతోంది. కానీ […]
లోకేష్ ఆస్తి ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే
దేశంలో తొలిసారి ఏ రాజకీయ నాయకుడు చేయని విధంగా.. ఏపీ సీఎం చంద్రబాబు తన ఆస్తులను ఏటా ప్రకటిస్తున్నారు. అంతేగాక తన కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలు కూడా వెల్లడిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆయన తనయుడు ప్రకటించిన ఆస్తుల లెక్కపై అందరూ ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. 2016 లెక్కలకు, తాజాగా ఆయన ఎమ్మెల్సీ అఫిడవిట్లో చూపిన లెక్కలకూ.. నక్కకూ నాగలోకానికి ఉన్నంత తేడా ఉండటంతో.. విమర్శలు వినిపిస్తున్నాయి. అనతి కాలంలోనే అన్నిరెట్లు ఆస్తి ఎలా పెరిగిందోనని సందేహాలు వ్యక్తంచేస్తున్నారు!! […]