ముందస్తు ఎన్నికలు.. ఇప్పుడు తెలంగాణలో జోరుగా వినిపిస్తున్న మాట. వ్యూహాల్లో ఎవరికీ అందకుండా ప్రత్యర్థులను చిత్తు చేసే సీఎం కేసీఆర్.. ముందస్తు ఎన్నిక లగురించి ఎందుకు ఆలోచిస్తున్నట్లు? దీని వెనుక ఏదైనా వ్యూహం ఉందా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఆయన ఎన్నికల గురించి నిర్వహించిన సర్వేలో ఆసక్తికర మైన అంశాలు బయటపడ్డాయట. అందుకే వీలైనంత తొందరగా ఎన్నికలు నిర్వహించి మళ్లీ అధికారిన్ని చేజిక్కించుకోవాలని వ్యూహాత్మకంగా ఈ ముందస్తు ఎన్నికల వ్యూహానికి తెరతీశారట. తెలంగాణలో ప్రతిపక్షం బలపడుతోంది. […]
Tag: TDP
బలరాంకి ఎమ్మెల్సీ వెనుక ఇంత తతంగమా
కొత్తగా పార్టీలోకి వచ్చిన వారితో పాటు పార్టీలోని సీనియర్ నాయకులతో టీడీపీ అధినేత చంద్రబాబుకు తలనొప్పులు అధికమవుతున్నాయి. ఈ విషయం మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. కర్నూలు పేరు మరింతగా అందరికీ వినిపించినా.. ప్రకాశం జిల్లా అద్దంకిలోనూ ఇదే తరహా కోల్డ్‌వార్ నడిచింది. అయితే చాకచక్యంగా వ్యవహరించి.. రెండు వర్గాల మధ్య వివాదాన్ని సమసిపోయేలా చేశారు చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్! ఒక వర్గానికి ఎమ్మెల్సీ సీటు, మరో వర్గానికి మంత్రి పదవి సీటు […]
సుజనా వ్యూహంతో కంభంపాటికి చిక్కులు
వ్యాపారవేత్తగానే కాదు.. రాజకీయ నాయకుడిగానూ తానేంటో నిరూపించారు సుజనా చౌదరి! సీఎం చంద్రబాబు ఆర్థికంగా అండదండలందించి.. ఆయనకు అత్యంత సన్నిహితుడిగా మారిపోయారు. ఎన్నికల్లో ఏపీలో, ఎన్నికల తర్వాత ఢిల్లీలో చక్రం తిప్పుతూ తన వ్యూహాలను అమలుచేస్తున్నారు. ఇందులో భాగంగానే ఒక పవర్ హౌస్‌గా మారిపోయారు. ఇప్పటివరకూ ఢిల్లీలోని ఏపీ భవన్‌లో అధికార ప్రతినిధి కంభంపాటి రామ్మోహనరావు ప్రాధాన్యం ఎక్కువగా ఉండేది. కానీ సుజనా తన చతురతతో ఆయన్ను లైమ్ లైట్ నుంచి తప్పించి.. ఇక ఢిల్లీలో ఏ […]
పునర్విభజనపై గందరగోళంలో టీడీపీ – బీజేపీ
పునర్విభజన ఎప్పుడెప్పుడు జరుగుతుందా అని ఆంధ్రా ప్రాంత ఎంపీలంతా తహతహలాడుతున్నారు. ఏపీకి రావాల్సిన వాటి విషయంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడం మాటెలా ఉన్నా.. ఈ పునర్విభజన గురించి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడితో తెగ చర్చలు జరుపుతున్నారట. ఆయన్ను కలిసిన ప్రతిసారీ.. ఈ అంశం గురించి అడుగుతున్నారట. టీడీపీ ఎంపీ, కేంద్రమంత్రి సుజనా చౌదరి మరో అడుగు ముందుకేసి.. మరో నెలరోజుల్లోనే పునర్విభజన ఉంటుందని ప్రకటించేశారు. అయితే తెలుగు ఎంపీల దూకుడుకు ఏపీ బీజేపీ నేత హరిబాబు బ్రేక్ వేశారు. […]
కుడి, ఎడమైన నారాయణ, గంటా ప్లేస్‌లు
ఏపీలో చంద్రబాబు కేబినెట్‌లో మంత్రులుగా ఉన్న గంటా శ్రీనివాసరావు, నారాయణ ఇద్దరూ స్వయాన వియ్యంకులే. గత ఎన్నికల్లో గంటా పార్టీ మారి భీమిలి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం గంటాకు మంత్రి పదవి వచ్చింది. నారాయణకు మాత్రం చాలా లక్‌గా కేబినెట్‌లో బెర్త్ దక్కింది. ఆయనకు అప్పటి వరకు ఎన్నికలంటే ఏంటో కూడా తెలియదు. విద్యాసంస్థల అధినేతగా ఉన్న నారాయణ ఒక్కసారిగా మంత్రి అయిపోయారు. నారాయణ మంత్రి అవ్వడం ఆలస్యం…చంద్రబాబుకు […]
మాణిక్యాలరావు మంత్రి పదవికి బీజేపీ ఎమ్మెల్యే ఎర్త్
ఏపీలో ఏప్రిల్ 6న సీఎం చంద్రబాబు తన కేబినెట్‌ను ప్రక్షాళన చేస్తారని వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ ప్రక్షాళనలో ఆయన తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌తో పాటు కొత్తగా నలుగురైదుగురు కేబినెట్‌లోకి ఎంట్రీ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. అలాగే ఐదుగురు మంత్రులకు ఖచ్చితంగా ఉద్వాసన ఉంటుందని కూడా టాక్. ఇదిలా ఉంటే బాబు కేబినెట్‌లో బీజేపీ నుంచి ఇద్దరు మంత్రులుగా కొనసాగుతున్నారు. వీరిలో కైకలూరు నుంచి ఎమ్మెల్యేగా ఉన్న కామినేని శ్రీనివాస్‌తో పాటు […]
దేవినేని తనయుడికి కీలక బాధ్యతలు
పార్టీలో యువశక్తిని బలోపేతం చేసేందుకు టీడీపీ సన్నద్ధమవుతోంది. అందుకు ఎన్నో రోజులుగా ఖాళీగా ఉన్న తెలుగు యువత అధ్యక్ష పదవిని తెరపైకి తెచ్చింది. ముఖ్యంగా ఇటీవలే కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన దేవినేని నెహ్రూ.. తనయుడు అవినాశ్‌కు ఈ పదవిని కట్టబెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు లోకేశ్‌కు.. అవినాశ్‌కు మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అలాగే తన సొంత వర్గాన్ని తయారుచేసుకునే పనిలో చినబాబు కూడా నిమగ్నమై ఉండటంతో.. ఇక అవినాశ్ ఎంపిక లాంఛనమే […]
బాబు నిన్నటి ఆనందం నేటితో ఆవిరి
ఆనందం ఇంతలోనే ఆవిరైపోయింది. గెలిచామన్న సంతోషం రాత్రి గడవగానే ఎగిరిపోయింది. నిన్న ఉల్లాసంగా కనిపించిన నేతలే.. నేడు నిరుత్సాహంతో కుంగిపోతున్నారు. ఏపీలో అధికార పక్షానికి ఊహించని షాక్ ఎదురైంది. కడప, నెల్లూరు, కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలను దక్కించుకుని ఊపు మీదున్న టీడీపీకి.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలింది. ప్రతిపక్షం బలంగా ఉన్న జిల్లాల్లో గెలిచామని సంబరాలు చేసుకున్న సీఎం చంద్రబాబు ఆనందాన్ని.. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఆవిరి చేశాయి. ఆంధ్రప్రదేశ్‌లోని రెండు పట్టభద్రుల […]
తబ్బిబ్బైపోతున్న కాపు నేతలు … కారణం అదే !
అంతెత్తున ఎగిసిన కాపు ఉద్యమం చప్పగా చల్లారిపోయింది. అప్పట్లో వార్తల్లో నిలిచిన కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం పేరు.. ఇప్పుడు వినిపించడమే మానేసింది. ప్రస్తుతం బడ్జెట్‌లో కాపు కార్పొరేషన్‌కు రూ.1000కోట్లు కేటాయించి.. ఏపీసీఎం చంద్రబాబు తన మార్క్ మరోసారి చూపించారు. కాపులకు అన్యాయం జరుగుతోందని విమర్శిస్తున్న వారు కిక్కురుమనకుండా చేసేందుకు.. కాపు ఉద్యమాన్ని మరింత నీరుగార్చేందుకు ఇప్పుడు బాబు సరికొత్త వ్యూహంతో చంద్రబాబు రంగంలోకి దిగుతున్నారు. కాపుల తరఫున ముద్రగడ పద్మనాభంఉద్యమిస్తున్నా… అడుగడుగునా ఆ ఉద్యమాన్ని అణిచివేయడానికే […]