బీజేపీలో కేశినేని మంట‌

ఏపీలో అధికార ప‌క్షంలో ఉన్న టీడీపీ, మిత్ర‌ప‌క్ష‌మైన బీజేపీ మ‌ధ్య మాట‌ల మంట రేగుతోంది. గ‌త మూడేళ్లుగా ఈ రెండు పార్టీల నాయ‌కుల మ‌ధ్య మాట‌ల యుద్ధం జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే. తాజాగా బీజేపీతో పొత్తు వల్లే మెజారిటీ తగ్గిందంటున్న విజయవాడ ఎంపీ కేశినేని నాని చేసిన వ్యాఖ్య‌లు రెండు పార్టీల మ‌ధ్య మ‌రింత‌గా మంట రేపుతున్నాయి. తాజాగా ఎంపీ కేశినేని వ్యాఖ్య‌ల‌పై బీజేపీ శాస‌న‌స‌భాప‌క్ష‌నేత‌, విశాఖ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు తీవ్రంగా స్పందించారు. బీజేపీతో పొత్తు వ‌ల్లే […]

టీడీపీలో కుమ్ములాట‌లు వైసీపీకి ప్లస్

ఏపీలో విప‌క్ష వైసీపీ అధినేత వైఎస్‌.జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. ఇప్పుడు వైసీపీకి బ‌ల‌మైన జిల్లా. ఇక్క‌డ టీడీపీకి గ‌త మూడు ఎన్నిక‌ల్లోను దిమ్మ‌తిరిగే ఫ‌లితాలే వ‌స్తున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మాత్రం టీడీపీ ఇక్క‌డ ఎలాగైనా మెజార్టీ స్థానాలు సాధించాల‌ని ప‌ట్టుద‌ల‌తో ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఈ క్ర‌మంలోనే వైసీపీకి చెందిన ప‌లువురు నేత‌ల‌కు పచ్చ‌కండువా వేస్తోంది. ఇక్క‌డ పార్టీని బ‌లోపేతం చేసేందుకు మంత్రి ఆదినారాయ‌ణ‌రెడ్డి, ఎంపీ సీఎం ర‌మేశ్‌, స‌తీష్‌రెడ్డి, బీటెక్ […]

బాబుకి మంత్రి అయ్య‌న్న కంట్లో న‌లుసా?!

ఏపీ ప్ర‌భుత్వంలో సీనియ‌ర్ మంత్రుల్లో ఒక‌రైన చింత‌కాయ‌ల అయ్య‌న్న పాత్రుడు.. ఇప్పుడు సెంటార‌ఫ్‌ది టాపిక్‌గా మారారు. నిత్యం ఏదో ఒక అలిగేష‌న్‌తో మీడియాలో ఉంటున్నారు. ముఖ్యంగా విశాఖ‌లో భూములు క‌బ్జా అయిపోతున్నాయ‌ని, అధికారులు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని బ్యాన‌ర్ స్టేట్ మెంట్లు ఇస్తున్నారు. క‌బ్జాల‌కు సంబంధించిన ఆధారాలు పూర్తిగా ఉన్నాయ‌ని, త‌క్ష‌ణ‌మే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని మ‌హానాడు ముగిసిన త‌ర్వాత నుంచి పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నారు. అయితే, మంత్రి వ్య‌వ‌హార‌శైలిపైనే ఇప్పుడు విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. విష‌యం ఏదైనా ఉంటే సీఎం […]

ఏపీ, తెలంగాణాలో ఇద్దరి చంద్రుల పరిస్థితి ఇదే!

ఏపీ, తెలంగాణ సీఎంల తీరు అత్త సొమ్ముకు అల్లుడి ప్ర‌చారం అన్న‌ట్టుగా ఉంది. ఏపీని దేశంలోనే ఫ‌స్ట్ స్టేట్ చేస్తాన‌ని ఇక్క‌డి సీఎం చంద్ర‌బాబు.. తెలంగాణ‌ను బంగారు తెలంగాణ చేస్తాన‌ని కేసీఆర్ ఇద్ద‌రూ ఒక‌రిని మించి ఒక‌రు ప్ర‌క‌ట‌న‌లు గుప్పిస్తున్నారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. ప్ర‌భుత్వం సొమ్మును త‌మ ఇష్టానుసారం ఖ‌ర్చు చేసేస్తున్నారు. పైగా ఆ ఖ‌ర్చును వాళ్ల సొంత జేబుల్లోంచి చేసిన ఖ‌ర్చుగా వాళ్ల పేర్లు పెట్టుకుంటున్నారు. ఏపీలో చంద్ర‌బాబు గ‌త పాల‌న‌కు ఇప్ప‌టికీ […]

నంద్యాల బై పోల్ ఏక‌గ్రీవం వెన‌క విజ‌య‌మ్మ‌..!

ఏపీలో ఇప్పుడు హాట్ టాపిక్‌.. నంద్యాల ఉప ఎన్నిక‌! ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి గెలిచిన భూమా నాగిరెడ్డి హ‌ఠాన్మ‌ర‌ణంతో ఇప్పుడు దీనికి బైపోల్ అనివార్య‌మైంది. అయితే, ఇది వైసీపీ గెలిచిన సీటు. త‌ర్వాత పొలిటిక‌ల్ కార‌ణాల నేప‌థ్యంలో భూమా టీడీపీ సైకిల్ ఎక్క‌డం.. అనూహ్యంగా ఆయ‌న మ‌ర‌ణించ‌డం తెలిసిందే. దీంతో ఇప్పుడు అటు టీడీపీ.. ఇటు వైసీపీల‌కు ఈ బైపోల్ ఛాలెంజ్‌గా మారింది. త‌మ పార్టీ సీటే కాబ‌ట్టి బైపోల్‌లో పోటీ చేసే అర్హ‌త త‌మకే ఉంద‌ని […]

టీడీపీ కంచుకోట‌లో ముగ్గురు ఎమ్మెల్యేల‌ను ప‌క్క‌న పెట్టేస్తారా..!

వెస్ట్ గోదావ‌రి అంటేనే టీడీపీకి బ‌ల‌మైన కంచుకోట‌. టీడీపీ ఆవిర్భావం నుంచి జ‌రిగిన చాలా ఎన్నిక‌ల్లో ఆ పార్టీ క్లీన్‌స్వీప్ చేసిన సంద‌ర్భాలున్నాయి. చంద్ర‌బాబు ప్ర‌స్తుతం సీఎంగా ఉన్నాడంటే అందుకు వెస్ట్ గోదావ‌రే కార‌ణం. గ‌త ఎన్నిక‌ల్లో జిల్లాలో 15 సీట్లు, 2 ఎంపీలు టీడీపీ క్లీన్‌స్వీప్ చేసేసింది. అయితే ప్ర‌స్తుతం జిల్లాలో కొంద‌రు ఎమ్మెల్య‌ల ప‌నితీరుతో టీడీపీపై తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. ఈ క్ర‌మంలోనే వ‌చ్చే ఎన్నిక‌ల్లో జిల్లాలో తీవ్ర వ్య‌తిరేక‌త ఎదుర్కొంటోన్న ముగ్గురు సిట్టింగ్ […]

టీటీడీపీలో మ‌రో ఎమ్మెల్యే జంప్‌..?

రుణ శేషం..శత్రు శేషం ఉండరాదనేది ఓ నానుడి. ఇదే విధానాన్ని తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్ అమ‌లు చేస్తోంది. ఇప్ప‌టికే తెలంగాణ‌లో టీడీపీనీ కోలుకోలేని దెబ్బ‌తీసిన టీఆర్ఎస్ ఇప్పుడు ఆ పార్టీకి మిగిలిన ఎమ్మెల్యేల‌ను కూడా త‌మ పార్టీలోకి లాక్కునేందుకు మ‌రోసారి ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌కు ప్లాన్ వేసింద‌న్న చ‌ర్చ‌లు టీ పాలిటిక్స్‌లో వినిపిస్తున్నాయి.ఆపరేషన్ ఆకర్ష్‌తో తెలంగాణ‌లో టీడీపీని దాదాపు ఖాళీ చేసేసిన గులాబీ పార్టీ తాజాగా అక్క‌డ ప‌సుపు పార్టీని అంద‌రూ మ‌ర్చిపోయేలా చేసే ప‌నిలో బిజీగా ఉన్న‌ట్టు […]

12 మంది ఎమ్మెల్యేల‌కు బాబు స్ట్రాంగ్ వార్నింగ్‌

ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడుకు కోపం వ‌స్తే అటు ప‌క్క‌న ఎలాంటి వారున్నా ఆయ‌న ఆగ్ర‌హానికి గురికాక త‌ప్ప‌దు. తాజాగా ఏపీలో న‌వ‌నిర్మాణ దీక్ష‌ను ప్రారంభించాల‌ని చంద్ర‌బాబు పిలుపునిచ్చిన విష‌యం తెలిసిందే. అయితే ఈ దీక్ష‌కు 12 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు డుమ్మా కొట్టారు. తాను ఎంతో సీరియ‌స్‌గా ఈ దీక్ష‌లో అంద‌రు ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గోవాల‌ని పిలుపునిస్తే కొంత‌మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు త‌న మాట ప‌ట్టించుకోక‌పోవ‌డంతో చంద్ర‌బాబు సీరియ‌స్ అయ్యారు. అమ‌రావ‌తిలోని త‌న […]

వాళ్లను వదలేసి తప్పుచేశాం… టీ-బీజేపీలో అంతర్మధనం

తెలంగాణలో బీజేపీకి ఐదుగురంటే ఐదుగురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. ఆ పార్టీలోకి ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వాళ్లెవరు చేరలేదు. అయితే ఈ విషయంలో తాము ముందుగా మేల్కొని ఉంటే… టీఆర్ఎస్ చేరిన టీడీపీ ఎమ్మెల్యేలు తమ పార్టీలోనే చేరి ఉండేవాళ్లని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారట. తెలుగు రాష్ట్రాల్లో పార్టీ ఫిరాయింపులు చాలా కామనైపోయాయని… కానీ ఈ విషయంలో తాము చాలా ఆలస్యంగా మేల్కొన్నామని టీ బీజేపీ నేతలు భావిస్తున్నారు. కేసీఆర్ కంటే ముందుగానే టీడీపీకి చెందిన […]