ఎప్పుడైతే కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా…జూనియర్ ఎన్టీఆర్‌తో భేటీ అయ్యారో…అప్పటినుంచి కొడాలి నాని సరికొత్త జోస్యం చెబుతూనే వస్తున్నారు. షా-ఎన్టీఆర్ భేటీ విషయంలో మొదట అనేక రకాల చర్చలు నడిచాయి. బీజేపీకి తారక్ మద్ధతు అని, తారక్ ద్వారా టీడీపీ శ్రేణుల మద్ధతు బీజేపీ తీసుకునేందుకు చూస్తుందని..ఇలా రకరకాల చర్చలు నడిచాయి. అయితే మొదట్లోనే ఇదంతా..తర్వాత దీని గురించి ఎవరు మాట్లాడటం లేదు. కానీ కొడాలి నాని మాత్రం ప్రతిరోజూ దీని గురించి మాట్లాడుతూనే ఉన్నారు. […]
Tag: TDP
కృష్ణాలో ఆ నలుగురికి సీటు డౌటే!
వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు…అందులో సగం మంది ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత ఉందని, నెక్స్ట్ ఎన్నికల్లో 70 మందికి సీట్లు ఇస్తే వైసీపీ గెలవడం కష్టమని చెప్పి పీకే టీం సర్వే చేసి..ఆ నివేదికని జగన్‌కు ఇచ్చిందని టీడీపీ అనుకూల మీడియాలో ఓ కథనం వచ్చింది. అయితే ఈ కథనంలో ఎంతవరకు నిజముందో తెలియదు గాని..ఈ కథనాన్ని చూసి కొందరు వైసీపీ నేతలు టెన్షన్ పడుతున్నారని మాత్రం తెలుస్తోంది. ఎందుకంటే వ్యతిరేకత ఎదురుకుంటున్న ఎమ్మెల్యేల స్థానాలని […]
గన్నికి లక్కీ ఛాన్స్…ప్లస్ అయినట్లే!
ఏపీలో ప్రతిపక్ష టీడీపీ నేతలు నిదానంగా పుంజుకుంటున్నారు…గత ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయిన నేతలు…ఈ సారి ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే కసితో పనిచేస్తున్నారు…ఓడిపోయిన దగ్గర నుంచి చాలామంది నేతలు ప్రజల్లో ఉంటూ…వారి మద్ధతు పెంచుకుంటూ వస్తున్నారు…అదే క్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలపై పెరుగుతున్న ప్రజా వ్యతిరేకత టీడీపీ నేతలకు బాగా ప్లస్ అవుతుంది. అలా టీడీపీ పుంజుకోవడమే కాకుండా…వైసీపీ ఎమ్మెల్యేపై ఉన్న వ్యతిరేకత మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులుకు బాగా కలిసొచ్చేలా ఉంది. పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీకి అనుకూలంగా […]
కుప్పం పంచాయితీ…బాబుకు వైసీపీనే ప్లస్!
అవును వైసీపీ దెబ్బకు చంద్రబాబుకు భయం పట్టుకుంది…వరుసగా పంచాయితీ, పరిషత్..ఆఖరికి టీడీపీ కంచుకోటగా ఉండే కుప్పం మున్సిపాలిటీలో సైతం వైసీపీ అదిరిపోయే విజయాన్ని సొంతం చేసుకుంది…ఇలా వైసీపీ వరుసగా సత్తా చాటి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కుప్పంలో గెలవాలని చూస్తుంది. అయితే ఇలా వైసీపీ విజయాలు..వరుసగా ఏడు సార్లు విజయం సాధించిన బాబుని భయపెట్టాయి. అసలు నామినేషన్ వేయడానికే వెళ్లని బాబు…రెండు నెలలకొకసారి కుప్పం వెళ్ళేలా చేశాయి. ఇక ఈ సీన్ చూసి వైసీపీ నేతలు సెటైర్లు […]
టీడీపీ సీట్లలో వైసీపీ ఇంచార్జ్‌లు చేంజ్?
మళ్ళీ అధికారంలోకి రావడానికి జగన్ గట్టిగానే కష్టపడుతున్నారు…గతం కంటే ఈ సారి ఎక్కువ సీట్లు గెలవాలని టార్గెట్ పెట్టుకున్నారు. అయితే గత ఎన్నికల్లో వైసీపీకి ఉన్న సానుకూలత ఈ సారి ఎన్నికల్లో ఉండటం కష్టం. ఈ సారి అంత ఈజీగా వైసీపీకి గెలుపు దక్కదు. అందుకే జగన్…నెక్స్ట్ గెలవాలంటే ఇప్పుడు వైసీపీలో భారీ మార్పులు అవసరమని భావిస్తున్నారు. ఎమ్మెల్యేల పనితీరు, ఇంచార్జ్‌ల పనితీరుపై వచ్చిన పీకే టీం సర్వే నివేదికల ఆధారంగా పార్టీలో మార్పులు చేయడానికి జగన్ […]
మంత్రుల తెలివి..జగన్‌కే డేంజర్ ?
ఏపీలో మంత్రులు…తమ తమ శాఖలకు సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారో తెలియడం లేదు గాని…ప్రతిరోజూ మీడియా ముందుకొచ్చి…చంద్రబాబు, పవన్‌లపై విమర్శలు చేయడం మాత్రం తెలుస్తోంది. మంత్రులు అంటే ప్రతిపక్ష నాయకులని తిట్టడానికే ఉన్నారా? అనే డౌట్ వస్తుందని విశ్లేషకులు అంటున్నారు. అయితే ఇటీవల కాలంలో మంత్రులు టార్గెట్ కేవలం..టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకోకూడదనే కాన్సెప్ట్‌లోనే పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. రెండు పార్టీలు పొత్తు పెట్టుకోకుండా చేయడానికి బాగానే కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. అందుకే కొందరు మంత్రులు ప్రత్యేకంగా పవన్‌ని టార్గెట్ చేసి […]
సర్వే స్టోరీ: 60 మందిపై వేటు?
అధికార వైసీపీకి ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా పనిచేస్తున్న విషయం తెలిసిందే. గతంలో వ్యూహకర్తగా పనిచేసి ఆ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. ఇప్పుడు కూడా అదే దిశగా పనిచేస్తున్నారు. ఇప్పటికే పీకే టీం నియోజకవర్గాల్లో పర్యటిస్తూ…ఎమ్మెల్యేల పనితీరుని, సంక్షేమ పథకాల అమలు, ప్రత్యర్ధి పార్టీల బలాలపై సర్వేలు చేస్తూ…ఎప్పటికప్పుడు జగన్‌కు నివేదికలు ఇస్తున్నారు. అయితే ఈ నివేదికలు అధికారికంగా ఎప్పుడు బయటకు రాలేదు. ఎప్పుడో ఏదొక రూపంలో మీడియాలో లీకులు వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలపై […]
బాబు ఫిక్స్: ఆ ఇంచార్జ్‌లు అవుట్..?
టీడీపీ మళ్ళీ అధికారంలోకి రావాలంటే…పార్టీలో భారీ మార్పులు జరగాల్సిందే…పనిచేస్తున్నట్లు హడావిడి చేస్తున్న నేతలలని పక్కన పెట్టాల్సిందే…అలాగే గెలుపు గుర్రాలకే టిక్కెట్ ఇవ్వాలి. ముఖ్యంగా యువతకు పెద్ద సంఖ్యలో సీట్లు ఇస్తే వైసీపీని ఢీకొట్టడం సాధ్యమవుతుంది. ఇప్పుడు అదే దిశగా అధినేత చంద్రబాబు సైతం ముందుకెళుతున్నట్లు తెలుస్తోంది. ఏదో మొహమాటం కొద్ది నేతలకు ఛాన్స్ ఇస్తే…టీడీపీకే నష్టం జరిగేలా ఉంది. ఈ సారి పనిచేయని నేతలని ఏ మాత్రం ఉపేక్షించే అవకాశం కనిపించడం లేదు. ఇటీవల చంద్రబాబు వరుసపెట్టి […]
గెలిచే సీటులో తమ్ముళ్ళ డ్యామేజ్!
గత ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాభవం నుండి టీడీపీ ఏదొకవిధంగా బయటపడుతూ వస్తుంది…అధినేత చంద్రబాబు కష్టపడి పార్టీని బలోపేతం చేసుకుంటూ వస్తున్నారు. అయితే వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరగడం, టీడీపీ నేతలు కష్టపడి పనిచేయడం వల్ల కొన్ని సీట్లలో టీడీపీకి గెలుపు అవకాశాలు వచ్చాయి. కానీ వచ్చిన మంచి అవకాశాలని టీడీపీ నేతలే చేతులారా పోగొట్టుకునేలా ఉన్నారు. పాతపట్నం నియోజకవర్గంలో టీడీపీకి తమ్ముళ్లే డ్యామేజ్ చేసేలా ఉన్నారు. పాతపట్నం మొదట నుంచి టీడీపీకి అనుకూలమైన స్థానమే. 2004 […]