వచ్చే ఎన్నికలకు ఇంగా గట్టిగా మరో 18 నెలల టైం మాత్రమే ఉంది. మరోసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిట్టింగ్ ఎమ్మెల్యేలు తమ ఏర్పాట్లు తాము చేసుకుంటుండగా, కొత్తగా ఎన్నికల్లో పోటీ చేసే వాళ్లు కూడా ఎమ్మెల్యే టిక్కెట్ల కోసం తమకు అనువైన స్థానాలను చూసుకునే పనిలో ఉన్నారు. ఎమ్మెల్యే అవ్వాలన్న కోరిక ఎవ్వరికి మాత్రం ఉండదు. ఎమ్మెల్యే అవ్వాలనుకున్న వాళ్లకు అందరికి టిక్కెట్లు వచ్చేయడానికి అవి మామూలు సీట్లు కాదు కదా..! ఇదిలా ఉంటే వచ్చే […]
Tag: Politics
ఉలిక్కిపడ్డ పార్టీ … టెన్షన్ లో నాయకులు
రాష్ట్ర విభజనతో ఏపీలో పాతాళానికి పడిపోయిన కాంగ్రెస్.. ఉనికి కోసం తీవ్రంగా పోరాడుతోంది. పార్టీకి వీర విధేయులైన నాయకులు.. అంతోఇంతో క్యాడర్ తప్ప ఎవరూ కనిపించడం లేదు. ఉన్న వారితోనే నెట్టుకొస్తున్న కాంగ్రెస్.. నంద్యాల ఉప ఎన్నికల బరిలో దిగుతామని ప్రకటించినా అంతగా ఎవరూ పట్టించుకోలేదు. ప్రకటన అయితే చేసేసింది కానీ ఇప్పుడు అష్టకష్టాలు పడుతోంది. ఎంతో కష్టపడి.. భూతద్ధంలో వెతికి.. నేను పోటీచేయను అన్నా బుజ్జగించి మరీ ఒక అభ్యర్థిని బరిలో నిలబెట్టింది. ఇప్పుడు కాంగ్రెస్ […]
ఏపీ బీజేపీలో నిప్పు – ఉప్పు
ఏపీ బీజేపీ వింత పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో బలపడాలని ఒకపక్క పార్టీ అధిష్టానం తీవ్రంగా ప్రయత్నిస్తున్న తరుణంలో.. కీలకమైన ఇద్దరు నేతల మధ్య సమన్వయం కొరవడింది. పార్టీని ముందుండి నడిపించాల్సిన నేతలు.. చెరో దారి పట్టారు. ఇందులో ఒకరికి కేంద్ర మాజీ మంత్రి వెంకయ్యనాయుడి మద్దతు పూర్తిగా ఉండేది. కానీ ఇప్పుడు ఆయన కూడా ఢిల్లీకే పరిమితమయ్యారు. ఇప్పటివరకూ ఆయన ఆ ఇద్దరు నేతలకూ సర్దిచెబుతూ వస్తున్నారు. ఇప్పుడు ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోవడంతో పాటు రాజమండ్రి […]
ఏపీలో మరో ఉప ఎన్నిక!
ఏపీలోని కర్నూలు జిల్లా నంద్యాల ఉపఎన్నిక నేపథ్యంలో జిల్లా రాజకీయాలు గంటకో మలుపు తిరుగుతున్నాయి. అసలు ఏ క్షణానికి అధికార, ప్రతిపక్ష పార్టీల్లో ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేకపోతున్నారు. టీడీపీ నుంచి ఎమ్మెల్సీగా గెలిచిన శిల్పా చక్రపాణిరెడ్డి ఈ రోజు జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతున్న సంగతి తెలిసిందే. వైసీపీలో చేరేందుకు సిద్ధమైన శిల్పా చక్రపాణి రెడ్డికి వైసీపీ అధినేత జగన్ షాక్ ఇచ్చారు. టీడీపీ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన తర్వాత వైసీపీలో చేరాలంటూ వైసీపీ […]
టీడీపీ మీడియా పిచ్చి ముదిరిందా
ఎక్కడయినా.. ఎప్పుడయినా సమయం, సందర్భం, ఔచిత్యం.. పాటించి ప్రవర్తించాలి. లేకపోతే అభాసుపాలవ్వక తప్పదు. ఇప్పుడ జనసేన అధినేత పవన్ కల్యాణ్, సీఎం చంద్రబాబు భేటీని కూడా తమకు అనుకూలంగా మలుచుకుని.. టీడీపీ అనుకూల మీడియా మరోసారి చర్చనీయాంశమైంది. ఉద్దానంలోని కిడ్నీ బాధితులు పడుతున్న ఇబ్బందులు, వాటిపై అధ్యయనం చేసిన హార్వర్డ్ వర్సిటీ ప్రతినిధులు అందజేసిన నివేదికను చంద్రబాబుకు అంద జేసేందుకు పవన్ వెళ్లారనేది అందరికీ తెలిసిందే! కానీ ఈ విషయాన్ని సైడ్ ట్రాక్ పట్టించి.. రాష్ట్రం గురించి […]
బీజేపీకి కొత్త జాతీయ అధ్యక్షుడిగా తెలుగు వ్యక్తి..!
దేశవ్యాప్తంగా అప్రతిహత రాజకీయ వ్యూహాలతో దూసుకుపోతోన్న బీజేపీకి కొత్త జాతీయ అధ్యక్షుడు వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం జాతీయాధ్యక్షుడిగా ఉన్న అమిత్ షా మోడీ కేబినెట్‌లో మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నట్టు తెలుస్తోంది. మోడీ కేబినెట్‌లో కీలకమైన శాఖలకు మంత్రులు లేరు. ప్రస్తుతం ఆ బాధ్యతలను అదనంగా వేరే వాళ్లకు అప్పగించారు. ఈ నేపథ్యంలో గత మూడేళ్లుగా పార్టీని అత్యంత సమర్థవంతంగా నడిపించిన అమిత్ షాను మోడీ తన కేబినెట్‌లోకి తీసుకునేందుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. షా […]
ఎన్నో ఆశలతో సైకిల్ ఎక్కితే ఇప్పుడు ఈ పరిస్థితి
2019.. అధికార టీడీపీకి ఇది ఎంతో కీలకం కాబోతోంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ఒకవైపు వైసీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. మరోపక్క చుట్టూ సమస్యలు, వివాదాలు, విమర్శలు! ఇవన్నీ టీడీపీ అధినేతకు సవాళ్లు విసురు తున్నాయి. ఇంకా రెండేళ్ల కంటే తక్కువ సమయం ఉన్నా.. ఇదంతా టీడీపీకి ముళ్ల బాటే కానుంది. నియోజకవర్గాల పెంపు లేనట్టేనని కేంద్రం స్పష్టంచేయడంతో పాటు ఎన్నో ఆశలు పెట్టుకుని టీడీపీలోకి వచ్చిన ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో అసంతృప్తి చెలరేగుతోంది. ఈనేపథ్యంలో 2019 ఎన్నికల్లో […]
టీడీపీలో కేశినేని నిర్వేదం…ఆ పార్టీ వైపు చూపు..?
కేశినేని నాని విజయవాడ ఎంపీ… ముక్కుసూటి తనానికి మారుపేరు. కేశినేని ట్రావెల్స్ అధినేతగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరున్న నాని 2009లో ప్రజారాజ్యం పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఆ పార్టీలో చేరిన కొద్ది రోజులకే బయటకు వచ్చిన నాని చంద్రబాబు హామీతో గత ఎన్నికలకు రెండేళ్ల ముందే ఎంపీ సీటుపై హామీ పొందారు. చంద్రబాబు పాదయాత్రలో ఖర్చంతా భరించడంతో పాటు పార్టీకి ఆర్థికంగా మేళ్లు చేసిన ఆయనకు చంద్రబాబు గత ఎన్నికల్లో హామీ […]
2019రాజమండ్రి ఎంపీ సీటుపై టీడీపీ, వైసీపీ కొత్త ప్రయోగం!
ఏపీలో ఎవరైనా అధికారం దక్కించుకునేందుకు తూర్పు గోదావరి జిల్లా కీలకమైంది. ఈ జిల్లాలో మెజార్టీ సీట్లు గెలుచుకున్న పార్టీయే రాష్ట్రంలో అధికారంలో ఉంటుందన్న నానుడి ఉంది. గత మూడున్నర దశాబ్దాలుగాను ఈ సెంటిమెంట్ కంటిన్యూ అవుతోంది. ఈ క్రమంలోనే ఈ జిల్లాలో రాజమండ్రి ఎంపీ సీటుకు రాజకీయంగా చాలా ప్రాధాన్యత ఉంది. రాజమండ్రి ఎంపీగా పోటీ చేసేందుకు ప్రధాన పార్టీల నుంచి ప్రముఖులే పోటీపడుతుంటారు. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ, వైసీపీ అభ్యర్థులుగా పోటీ […]