ద్వారంపూడి టార్గెట్‌గా పవన్..జనసేన చెక్ పెడుతుందా?

ఏ ఎమ్మెల్యేపైన ఈ స్థాయిలో పవన్ కల్యాణ్ విరుచుకుపడలేదు. ప్రభుత్వ పరంగా విమర్శలు..కొందరు మంత్రులపై ఫైర్ అవ్వడం చేశారు గాని..ప్రత్యేకంగా ఒక ఎమ్మెల్యేని పవన్ ఎప్పుడు పెద్దగా టార్గెట్ చేయలేదు. కానీ కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని మాత్రం ఓ రేంజ్ లో టార్గెట్ చేశారు. తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. తాజాగా వారాహి యాత్రలో భాగంగా  “ ద్వారంపూడి నువ్వో డెకాయిట్‌.. కాకినాడను నువ్వు డ్రగ్స్‌ డెన్‌గా మార్చావు.. నువ్వు ఎలా గెలుస్తావో చూస్తా.. […]

‘సీఎం’ పవన్..బాబుతో కలిసే వ్యూహం.!

పొత్తులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యూహం మారిందా? అవకాశం ఇస్తే సీఎంగా పనిచేస్తానని, ఏపీని నెంబర్ 1గా తీర్చిదిద్దుతానని..గత రెండు రోజులు వారాహి యాత్రలో పవన్ చెబుతున్న అంశాలు..పొత్తు విషయంలో క్లారిటీ లేకుండా చేస్తున్నాయి. ఆ మధ్య బలం లేకుండా సీఎం పదవిని అడగనని, ముందు వైసీపీని గద్దె దించడానికి పొత్తులకు వెళ్తానని చెప్పారు. అయితే సి‌ఎం పదవి వద్దు అనడంతో సొంత పార్టీ అభిమానులే అసంతృప్తికి గురయ్యారు. పవన్ సి‌ఎం పదవి వద్దంటే..తాము ఓటు […]

పేర్ని నాని రాజకీయం..వారసుడుకు పవన్ దెబ్బ.!

వైసీపీ మంత్రులు, మాజీ మంత్రులు అంటే..కేవలం ప్రతిపక్షాలని తిట్టడానికే అన్నట్లు ఉన్నారు. మంత్రులుగా వారు రాష్ట్ర ప్రజలకు ఎలాంటి సేవ చేస్తున్నారు. మాజీ మంత్రులు తమ తమ స్థానాల్లో ఎలాంటి అభివృద్ధి పనులు చేస్తున్నారు..పార్టీకి ఏ మేర ఉపయోగపడుతున్నారు? అంటే అవేం లేవు..కేవలం ప్రతిపక్షాలని తిట్టడానికే తాము ఉన్నామనే విధంగా నేతల తీరు ఉంది. అందులో కొడాలి నాని అంటే చంద్రబాబుని తిట్టడానికి, పేర్ని నాని అంటే పవన్‌ని తిట్టడానికి అన్నట్లు ఉన్నారు. వీరు నియోజకవర్గాల్లో ఏం […]

యువతపై లోకేష్ ఫోకస్..టీడీపీకి కలిసొస్తారా?

రాజకీయాల్లో యువత ప్రాధాన్యత ఎక్కువనే చెప్పాలి..వారు గెలుపోటములని పెద్ద స్థాయిలో ప్రభావితం చేస్తారు. యువత ఎటువైపు మొగ్గితే ఆ పార్టీ గెలుపు సులువు అని చెప్పవచ్చు. గత ఎన్నికల్లో కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని, ప్రతి జిల్లా ఒక హైదరాబాద్ అవుతుందని, పెద్ద ఎత్తున కంపెనీలు వస్తాయని, అందరికీ ఉద్యోగాలు వస్తాయని చెప్పి జగన్..యువతని గేలంలో వేసుకున్నారు. యువత కూడా జగన్‌ని నమ్మారు. పెద్ద స్థాయిలో జగన్‌కు ఓటు వేశారు. ఆ తర్వాత జనసేనకు […]

పవన్ గేమ్ స్టార్ట్..జగన్‌కు రిస్క్ షురూ!

జనసేన అధినేత పవన్ కల్యాణ్..ప్రజా వేదికలోకి వచ్చారు. ఎన్నికల సమయం దగ్గరపడటంతో ప్రజా క్షేత్రంలోకి వచ్చేశారు. ఇప్పటికే చాలారోజులు సినిమా షూటింగుల్లో బిజీగా ఉన్నారు. పైగా ఇటు చంద్రబాబు, జగన్ ప్రజల్లోనే ఉంటున్నారు. దీంతో పవన్ వెనుకబడ్డారు. దాన్ని కవర్ చేసుకునే దిశగా పవన్ రంగంలోకి దిగారు. వారాహితో ఎంట్రీ ఇచ్చారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అన్నావరం దేవాలయంలో పూజలు చేయించి..కత్తిపూడి రోడ్ షోలో పాల్గొన్నారు. ఇక జగన్ ప్రభుత్వమే లక్ష్యంగా పవన్ విరుచుకుపడ్డారు. ఇటీవల కాలంలో […]

వారాహి రెడీ..జనసేనకు పట్టు చిక్కేనా.!

ప్రజల్లో రావడానికి పవన్ సిద్ధమయ్యారు. ఎన్నికల సమయం దగ్గరపడటంతో పవన్ వారాహితో ప్రజల్లోకి వచ్చేందుకు సిద్ధమయ్యారు. చాలాకాలంగా పవన్ ఏపీ రాజకీయాల్లో కనిపించలేదు. సినిమా షూటింగు ల్లో బిజీగా ఉండిపోయారు. అయితే ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో ఆయన ప్రజల్లోకి వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో యాత్ర చేయనున్నారు. ప్రజలని కలవనున్నారు. 11 నియోజకవర్గాల్లో పవన్ బస్సు యాత్ర కొనసాగింది. దీని ద్వారా ప్రజలని కలవడంతో..ఆయా స్థానాల్లో పార్టీని […]

ప్రత్తిపాడులో సైకిల్ జోరు..మూడోసారైనా గెలుస్తుందా?

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం..టి‌డి‌పి కంచుకోట..1983 నుంచి 2009 వరకు టి‌డి‌పి అయిదుసార్లు గెలిచింది. కానీ 2014 నుంచి టి‌డి‌పికి లక్ కలిసిరావడం లేదు. వరుసగా రెండుసార్లు ఓడిపోయింది. అది కూడా తక్కువ మెజారిటీలతో 2014లో 3 వేల ఓట్లతో, 2019 ఎన్నికల్లో 4 వేల ఓట్ల తేడాతో టి‌డి‌పి ఓడింది. కానీ ఈ సారి మాత్రం ఖచ్చితంగా గెలవాలని చెప్పి టి‌డి‌పి కష్టపడుతుంది. ఇదే క్రమంలో దివంగత వరుపుల రాజాని పార్టీని బలోపేతం […]

పవన్ రెడీ..జనసేనకు కలిసొస్తుందా?

చాలా రోజుల తర్వాత జనసేన అధినేత పవన్ కల్యాణ్ జనంలోకి వస్తున్నారు. ఎప్పుడో  పార్టీ ఆవిర్భావ సమయంలో కనిపించారు. ఆ తర్వాత వర్షాల వల్ల నష్టపోయిన రైతులని పరామర్శించేందుకు వచ్చారు. ఇంకా అంతే ఆయన పార్టీ పరమైన కార్యక్రమాలు గాని, పార్టీ కోసం జనంలో తిరగడం చేయలేదు. పూర్తిగా సినిమా షూటింగుల్లో బిజీగా ఉండిపోయారు. అయితే ఎన్నికల సమయం దగ్గర పడటంతో పవన్ అలెర్ట్ అయ్యారు. ఇప్పటికే చాలా ఆలస్యమైంది.. ఓ వైపు చంద్రబాబు, మరో వైపు […]

పవన్‌కు పొత్తు సెట్ కాదా? వైసీపీ గేమ్.?

టీడీపీ-జనసేన పొత్తు ఉండకూడదని చెప్పి వైసీపీ గట్టిగానే ట్రై చేస్తుంది. ఆ రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటే తమకు ఇబ్బంది అనే సంగతి వైసీపీ గ్రహించింది. గత ఎన్నికల్లో రెండు పార్టీలు విడిగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయి వైసీపీకి మేలు జరిగింది. ఇప్పుడు అదే విధంగా రెండు పార్టీలు వేరు వేరుగా పోటీ చేస్తే ఓట్లు చీలి తమకు లబ్ది జరుగుతుందనేది వైసీపీ భావన. కానీ టి‌డి‌పి, జనసేన కలిసి పోటీ చేసే […]