మహేష్ అడ్డాలో పవన్ రికార్డ్…!?

టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేశ్ బాబు ప్రముఖ హీరోనే కాదు ప్రొడ్యూసర్ అండ్ ఎగ్జిబిటర్ కూడా. మూడేళ్ళ క్రితం ఏషియన్ ఫిలిమ్స్ సునీల్ నారంగ్ తో కలిసి మహేశ్ బాబు కొండాపూర్ లో ఎ.ఎం.బీ. మల్టీప్లెక్ట్స్ థియేటర్లను నిర్మించాడు. తెలంగాణలో మోస్ట్ పాపులర్ మల్టిప్లెక్స్ గా ఏఎంబీ నిలిచింది. ఇందులో మొత్తం ఏడు స్క్రీన్స్ ఉన్నాయి. అసలు విశేషం ఏంటంటే, ఈ నెల 9న విడుదల కానున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ […]

‘ జై ల‌వ‌కుశ ‘ – ‘ స్పైడ‌ర్ ‘ – ‘ మ‌హానుభావుడు ‘ బాక్సాఫీస్ రిపోర్ట్‌

ద‌స‌రాకు టాలీవుడ్ బాక్సాఫీస్ యుద్ధం అదిరిపోయింది. ఎన్టీఆర్‌, మ‌హేష్‌బాబు సినిమాల‌తో పాటు యంగ్ శ‌ర్వానంద్ సినిమా కూడా రిలీజ్ అవ్వ‌డంతో ఈ మూడు సినిమాల రిలీజ్‌కు ముందు ఏ సినిమా పై చేయి సాధిస్తుందా ? అన్న ఉత్కంఠ అంద‌రిలోను నెల‌కొంది. మూడు సినిమాల‌కు బాక్సాఫీస్ వ‌ద్ద ప్రేక్ష‌కుడి తీర్పు వ‌చ్చేసింది. ఈ మూడు సినిమాల్లో వారం రోజుల ముందుగా వ‌చ్చిన ఎన్టీఆర్ జై ల‌వ‌కుశ సినిమా ఇప్ప‌టికే వ‌ర‌ల్డ్‌వైడ్‌గా 73 కోట్ల షేర్ క్రాస్ చేసి […]

‘ స్పైడ‌ర్ ‘ టాక్ మార‌డం వెన‌క‌..!

మ‌హేష్‌బాబు – మురుగ‌దాస్ కాంబినేష‌న్ అన‌గానే స్పైడ‌ర్ సినిమాపై ముందుగా ఎలాంటి అంచ‌నాలు ఉన్నాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అయితే స్టిల్స్‌, ఫ‌స్ట్ లుక్‌, టీజ‌ర్లు, ట్రైల‌ర్లు రిలీజ్ అవుతున్న‌ప్ప‌టి నుంచి ఈ సినిమాకు క్రేజ్ పెర‌గ‌డం సంగ‌తేంటో గాని డివైడ్ టాక్ న‌డుస్తోంది. మ‌హేష్ – మురుగ‌దాస్ కాంబినేష‌న్‌కి స్వ‌త‌హాగా రావ‌ల్సినంత హైప్ ఈ సినిమాకి లేద‌న్న‌ది వాస్త‌వం. సినిమా బాగా లేట్ అవ్వ‌డం, రీ షూట్లు జ‌రిగాయ‌న్న ప్ర‌చారం, సినిమా క‌థ మాస్‌కు, ఫ్యామిలీకి కనెక్ట్ […]

మ‌హేష్ హ్యాపీకి ప‌వ‌న్ బ్రేకులు

టాలీవుడ్‌లో టాప్ హీరో అయిన సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు ఆనందానికి మ‌రో టాప్ హీరో, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ బ్రేకులు వేసేశాడు. అస‌లు విష‌యంలోకి వెళితే మ‌హేష్ – మురుగ‌దాస్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న స్పైడ‌ర్ సినిమా లేట్‌గా ద‌స‌రాకు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతుంది. సెప్టెంబ‌ర్ 27న ఈ సినిమాను తెలుగు, త‌మిళ్‌, హిందీలో ఒకేసారి భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. సోలోగా వ‌చ్చి మూడు భాష‌ల బాక్సాఫీస్‌ను దున్నేయొచ్చ‌ని మ‌హేష్ ప్లాన్ చేసుకుంటున్నాడు. అయితే […]

సౌత్ ఇండియాలోనే నెంబ‌ర్ వ‌న్ హీరోగా మ‌హేష్‌

తెలుగు ప్రేక్ష‌కుల‌తో పాటు సౌత్ ఇండియ‌న్ సినీ అభిమానులు ఎంతో ఎగ్జైటింగ్‌గా వెయిట్ చేస్తోన్న ప్రిన్స్ మ‌హేష్‌బాబు స్పైడ‌ర్ సినిమా టీజ‌ర్ వ‌చ్చేసింది. మ‌హేష్‌బాబు – క్రేజీ డైరెక్ట‌ర్ ఏఆర్‌.మురుగ‌దాస్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాపై ఎలాంటి భారీ అంచ‌నాలు ఉన్నాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఈ టీజ‌ర్ వ్యూస్ విష‌యంలో మ‌హేష్‌బాబుకు సౌత్ ఇండియాలోనే టాప్ ర్యాంకు సాధించిపెట్టింది. స్పైడ‌ర్ టీజ‌ర్ రిలీజ్ అయిన 24 గంట‌ల్లో 6.3 మిలియ‌న్ వ్యూస్‌తో తిరుగులేని రికార్డు క్రియేట్ చేసింది. […]

టాలీవుడ్ సమ్మర్ ఫైటింగ్లో ప్రేక్షకుల ఓటు ఎవరికి పడుతుందో..? ఎవరు బాక్సాఫీస్ విన్నర్..?

2017 ఇప్ప‌టి వ‌ర‌కైతే తెలుగు ఇండ‌స్ట్రీకి బాగానే క‌లిసొచ్చింది. సంక్రాంతికి వ‌చ్చిన మూడు సినిమాలు సూప‌ర్ హిట్ అయ్యాయి. ఖైదీ నెంబ‌ర్ 150 – గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి – శ‌త‌మానం భ‌వ‌తి సినిమాలు మంచి వ‌సూళ్ల‌తో 2017ను ఘ‌నంగా ఆరంభించాయి. ఇక ఫిబ్ర‌వ‌రిలో వ‌చ్చిన నాని నేను లోక‌ల్ – రానా ఘాజీ కూడా అద‌ర‌హో అనిపించేశాయి. సింగం -3, య‌మ‌న్ లాంటి డ‌బ్బింగ్ సినిమాలు సైతం జ‌స్ట్ పాస్ మార్కులు వేయించుకున్నాయి. ఇక ఇప్పుడు టాలీవుడ్‌లో […]

జగన్ కు రెండెకరాలిచ్చిన ఘట్టమనేని ఫ్యామిలీ

సొంత రాష్ట్రం ఏర్ప‌డినా.. ఇంకా ప్ర‌ధాన‌ప్ర‌తిప‌క్ష‌మైన వైసీపీ హైద‌రాబాద్ కేంద్రంగానే కార్య‌క‌లాపాలు నిర్వ‌హిస్తుండ‌టంపై అటు ప్ర‌జ‌లు.. ఇటు పార్టీ సీనియర్లు అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. అయితే నూత‌న కార్యాల‌య భ‌వనానికి సైలెంట్‌గా శంకుస్థాప‌న జ‌రిగిపోయింద‌ని.. ప‌నులు కూడా మొద‌లయ్యాయ‌ని తెలుస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కూ ప్ర‌భుత్వం భూమి ఇవ్వ‌డంపై ఎదురుచూస్తున్నామ‌ని చెప్పిన జ‌గ‌న్‌కు.. ఇంత స‌డ‌న్‌గా భూమి ఎక్క‌డ దొరికింద‌నేది ఆశ్చ‌ర్యం క‌లిగించ‌క మాన‌దు. ఈ భూమి ప్రిన్స్ మ‌హేశ్‌బాబు బంధువు ఘ‌ట్ట‌మ‌నేని ఆదిశేష‌గిరిరావుకు చెందిన‌దిగా తెలుస్తోంది. త‌న‌కు చెందిన […]

ఏపీకి హోదా పై టాలీవుడ్ కలిసివస్తుందా?!

ఏపీ జ‌నాల క‌ళ్లు, చెవులు  అన్నీ.. ఇప్పుడు విశాఖలోని ఆర్ కె. బీచ్‌పైనే ఉన్నాయి! అక్క‌డ ఉద్య‌మించేందుకు సిద్ధంగా ఉన్న యువ‌త‌పైనే ఉన్నాయి. ఏపీకి ప్ర‌త్యేక హోదాతో త‌మ త‌ల‌రాత‌లు మార‌తాయ‌ని, పెద్ద ఎత్తున ఉపాధి వ‌స్తుంద‌ని న‌మ్ముతున్న యువ‌త‌.. ఈ క్ర‌మంలో కేంద్రానికి తెలిసివ‌చ్చేలా.. పెద్ద ఎత్తున ఉద్య‌మించేందుకు సిద్ధ‌మైంది. ఆర్ కే బీచ్‌లో గురువారం మౌన ప్ర‌ద‌ర్శ‌న చేయ‌నుంది. అయితే, త‌మిళ‌నాడులో జ‌ల్లి క్రీడ‌పై సుప్రీం కోర్టు స్టే విధించినందుకు నిర‌స‌న‌గా కేంద్రానికి సెగ‌త‌గిలేలా […]