న‌వ్వులు పూయిస్తున్న‌ `మంచి రోజులు వచ్చాయి` ఇంట్రో!

టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ శోభ‌న్, మెహ్రీన్ జంట‌గా న‌టించిన తాజా చిత్రం `మంచి రోజులు వచ్చాయి`. ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ మారుతి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని వి సెల్యూలాయిడ్‌ సంస్థతో కలిసి ఎస్‌.కె.ఎన్‌ నిర్మించారు. నిజజీవిత పాత్ర స్ఫూర్తితో రూపొందించిన చిత్రమిది. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుద‌ల సిద్ధంగా ఉంది. ఈ క్ర‌మంలోనే చిత్ర యూనిట్ ప్ర‌మోష‌న్స్ షురూ చేసింది. ఇందులో భాగంగా మంచి రోజులు వ‌చ్చాయి ఇంట్రో వీడియోను విడుద‌ల […]

భారత్‌లో స్వ‌ల్పంగా పెరిగిన క‌రోనా కేసులు..మ‌ర‌ణాలు మాత్రం..?

ఎక్క‌డో చైనాలో పుట్టిన అతి సూక్ష్మ‌జీవి అయిన క‌రోనా వైర‌స్‌.. ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌ల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. త‌గ్గిన‌ట్టే త‌గ్గిన ఈ మ‌హ‌మ్మారి.. సెకెండ్ వేవ్ రూపంలో మ‌ళ్లీ విజృంభించింది. అయితే ఇప్పుడిప్పుడే క‌రోనా ఉధృతి త‌గ్గుతూ వ‌స్తోంది. గ‌త కొద్ది రోజులుగా భార‌త్‌లోనూ క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. అయితే నిన్న క‌రోనా కేసులు స్వ‌ల్పంగా పెరిగ‌గా..మ‌ర‌ణాలు మాత్రం త‌గ్గాయి. గ‌త 24 గంటల్లో భారత్‌లో 39,742 మందికి కొత్తగా కరోనా […]

`సలార్‌`లో ప్ర‌శాంత్ నీల్‌ మార్పులు..కొత్త‌గా దాన్ని యాడ్ చేశారట?

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో `స‌లార్` ఒక‌టి. కేజీఎఫ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో శ్రుతి హాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. హోంబలే ఫిల్మ్స్‌ బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ కేటాయించి ఈ సినిమా రూపొందిస్తున్నారు. క‌రోనా సెకెండ్ వేవ్‌కు ముందు కొంత షూటింగ్ కూడా పూర్తి చేసుకుందీ చిత్రం. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ వార్త నెట్టింట వైర‌ల్‌గా మారింది. దాని ప్ర‌కారం.. ఈ చిత్రంలో […]

బాల‌య్య షాకింగ్ నిర్ణ‌యం..నిరాశ‌లో అనిల్ రావిపూడి?!

నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌నుతో అఖండ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం సెక్టెంబ‌ర్‌లో విడుద‌ల కానుంది. అఖండ త‌ర్వాత గోపీచంద్ మాలినేని ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం, ఆ త‌ర్వాత అనిల్ రావిపూడి ద‌ర్వ‌క‌త్వంలో ఓ చిత్రం చేయాలని బాల‌య్య ప్లాన్ చేసుకున్నాడు. అలాగే గ‌త కొన్ని రోజుల నుంచి బాల‌య్య‌, పూరీ జ‌గ‌న్నాథ్ కాంబోలో ఓ సినిమా రాబోతోంద‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ […]

సుకుమార్‌కు అస్వస్తత..ఆగిపోయిన `పుష్ప‌` షూటింగ్‌!

టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ ప్ర‌స్తుతం అల్లు అర్జున్‌తో పుష్ప సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. పాన్ ఇండియా లెవ‌ల్‌లో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తోంది. క‌రోనా సెకెండ్ వేవ్ కార‌ణంగా ఆగిపోయిన ఈ మూవీ.. ఇటీవెల మ‌ళ్లీ సెట్స్ మీద‌కు వెళ్లింది. అయితే లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం.. సుకుమార్ కార‌ణంగా ఈ చిత్రం షూటింగ్‌కు మ‌ళ్లీ బ్రేక్ ప‌డిన‌ట్లు తెలుస్తోంది. తాజాగా దర్శకుడు సుకుమార్ అనారోగ్యంతో బాధ పడుతున్నట్లు తెలుస్తోంది. ఈయనకు […]

నానితో న‌టించాల‌నుంది అంటున్న‌ వెంక‌టేష్‌ త‌న‌యుడు!

కార్తీక్ రత్నం.. అదేనీండీ నార‌ప్ప సినిమాలో విక్ట‌రీ వెంక‌టేష్‌కు త‌న‌యుడుగా న‌టించిన మునికన్న `కేరాఫ్ కంచరపాలెం` సినిమాతో ఇండ‌స్ట్రీలో అడుగు పెట్ట‌డ‌మే కాదు.. మొద‌టి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ త‌ర్వాత అర్థ శతాబ్దంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన కార్తీక్ ర‌త్నం.. నార‌ప్ప సినిమాతో సూప‌ర్ క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ చిత్రంలో కార్తీక్ ర‌త్నం త‌న‌దైన‌ బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీతో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నాడు. ఇదిలా ఉంటే.. ఈ యంగ్ హీరో తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో […]

నాగ శౌర్య‌కు రానా వార్నింగ్‌..ఇంత‌కీ మ్యాట‌ర్ ఏంటంటే?

అవును, యంగ్ హీరో నాగ శౌర్య‌కు రానా ద‌గ్గుబాటి వార్నింగ్ ఇచ్చారు. ఇంత‌కీ మ్యాట‌ర్ ఏంటంటే.. నాగ శౌర్య హీరోగా ఒక సినిమా రూపొందుతోంది. ఈ సినిమాకి అనీష్ కృష్ణ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లింది. ఇందులో ప్ర‌ముఖ న‌టుడు బ్ర‌హ్మాజీ కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. అయితే షూటింగు సమయంలోబ్ర‌హ్మాజీతో తిగిన‌ ఒక ఫొటోను నాగశౌర్య ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ..`నా తమ్ముడు బ్రహ్మాజీ ఇండస్ట్రీకి కొత్తగా వచ్చాడు .. మీ అందరి […]

బ‌న్నీ కోసం బ‌రిలోకి దిగ‌నున్న సన్నీలియోన్..ఇక ఫ్యాన్స్‌కు పండ‌గే?!

స‌న్నీ లియోన్‌.. ఈ భామ‌కు దేశ‌వ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. పోర్న్‌ స్టార్‌గా ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన స‌న్నీ.. ఆ త‌ర్వాత బాలీవుడ్ ఇండ‌స్ట్రీలో ఎంట్రీ ఇచ్చి మంచి న‌టిగా గుర్తింపు తెచ్చుకుంది. అయితే త్వ‌ర‌లోనే ఈ అందాల తార‌.. తెలుగు ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు సిద్ధ‌మ‌వుతోంది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో పుష్ప సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. రెండు భాగాలుగా రాబోతున్న ఈ […]

ఏపీలో మ‌ళ్లీ 2వేల‌కు పైగా క‌రోనా కేసులు..తాజా లిస్ట్ ఇదే!

కంటికి క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రిపై విరుచుకుప‌డిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్ప‌టిప్పుడే మ‌ళ్లీ ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డుతున్నారు. క‌ర‌నా ఉధృతి క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా జోరుకు బ్రేకులు ప‌డ్డాయి. ప్ర‌స్తుతం ఏపీలో మూడు వేల‌కు లోపుగా రోజూవారి కేసులు న‌మోదు అవుతున్నాయి. ఇక‌ నిన్న పాజిటివ్ కేసులు మ‌రింత పెర‌గ‌గా.. మ‌ర‌ణాలూ పైపైకి క‌దిలాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ […]