ఇలాంటి రోజు ఇంత త్వ‌ర‌గా వ‌స్తుంద‌నుకోలేదు..బ‌న్నీ కామెంట్స్ వైర‌ల్‌!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోష‌ల్ మీడియా వేదిక‌గా చేసిన ఓ ఎమోష‌న‌ల్ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఇంతకీ బ‌న్నీ పోస్ట్ ఏంటీ..? అస‌లు ఆయ‌న ఎందుకు ఎమోష‌న‌ల్ అయ్యారు..? అన్న విష‌యాలు తెలుసుకోవాలంటే లేట్ చేయ‌కుండా మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సిందే. బ‌న్నీ గారాల ప‌ట్టి అర్హ‌.. బాల‌న‌టిగా `శాకుంత‌లం` సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. గుణశేఖర్ దర్శకత్వంలో సమంత అక్కినేని, దేవ్ మోహన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ఈ […]

`మా` వార్‌..సీన్‌లోకి చిరు..వారిని వ‌దిలేది లేదంటూ సీరియ‌స్‌!

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా) ఎన్నిక‌ల వ్య‌వ‌హారం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్‌గా మారిన సంగ‌తి తెలిసిందే. అధ్య‌క్ష ప‌ద‌వి కోసం ఈ సారి ఏకంగా ఐదుగురు అభ్య‌ర్థులు పోటీ ప‌డ‌ట‌మే కాకుండా.. ఒక‌రిపై ఒక‌రు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటూ వార్త‌ల్లో నిలుస్తున్నారు. ఇక ఇటీవ‌ల ‘మా’ అసోసియేషన్‌ నిధులను అధ్యక్షుడు నరేష్‌ ఇష్టానుసారం ఖర్చు చేస్తూ దుర్వినియోగానికి పాల్పడుతున్నారంటూ హేమ ఆరోపించారు. ఆమె ఆరోపణలను ఖండించిన నరేష్ రివ‌ర్స్‌లో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చి ఎన్నిక‌ల హీట్‌ను […]

`దశరథ్`గా మారిన జ‌గ‌ప‌తిబాబు..అదిరిన న్యూ లుక్‌!

మెగా మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్, ద‌ర్శ‌కుడు దేవా కట్టా కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `రిప‌బ్లిక్‌`. ఈ చిత్రంలో ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. ర‌మ్య‌కృష్ణ‌, జ‌గ‌ప‌తిబాబు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. అలాగే జేబీ ఎంటర్టైన్మెంట్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటీవ‌లె షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమా పూర్తిగా ప్ర‌జాస్వామ్యం నేపథ్యంలోనే తెరకెక్కుతుంది. ఇప్ప‌టికే రిలీజ్ అయిన టీజ‌ర్‌, పోస్ట‌ర్ సినిమాపై మంచి అంచ‌నాలు క్రియేట్ చేయ‌గా.. రిప‌బ్లిక్ నుంచి […]

ఏపీలో కొత్త‌గా 1,413 క‌రోనా కేసులు..మ‌రింత దిగొచ్చిన మ‌ర‌ణాలు!

కంటికి క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రిపై విరుచుకుప‌డిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మ‌ళ్లీ ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డుతున్నారు. క‌ర‌నా ఉధృతి క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోనూ క‌రోనా జోరుకు బ్రేకులు ప‌డ్డాయి అనుకుంటున్న త‌రుణంలో.. మ‌ళ్లీ పాజిటివ్ కేసులు పెరుగుతూ వ‌స్తున్నాయి. అయితే నిన్న మాత్రం క‌రోనా టెస్ట్‌లు త‌క్కువ‌గా నిర్వ‌హించ‌డం వ‌ల్ల‌.. రోజూవారీ కేసులు త‌క్కువ‌గా న‌మోదు అయ్యాయి. రాష్ట్ర వైద్య, […]

క్యూట్ లుక్స్‌తో క‌ట్టిప‌డేస్తున్న పూజా హెగ్డే..నెట్టింట పిక్స్ వైర‌ల్‌!

పూజా హెగ్డే.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ముకుంద‌ సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈ పొడుగు కాళ్ల సుందరి.. కెరీర్ మొద‌ట్లో వ‌రుస ఫ్లాపులు ఎదుర్కొన్నా డీజే సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కింది. ఈ సినిమా త‌ర్వాత పూజా హెగ్డే వెన‌క్కి తిరిగి చూసుకోలేదు. వరుస అవ‌కాశాలే కాదు.. వ‌రుస హిట్ల‌తో స్టార్ హీరోయిన్ల లిస్ట్ చేరిపోయింది ఈ బ్యూటీ. ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డు రాధేశ్యామ్‌, ఆచార్య‌, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రాల‌తో […]

SSMB 28 మూవీ క్యాస్టింగ్ అనౌన్స్‌మెంట్..మ‌రోసారి మ‌హేష్‌తో బుట్ట‌బొమ్మ‌!

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో `స‌ర్కారు వారి పాట` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంతో మ‌హేష్ త‌న 28 చిత్రాన్ని మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌తో ప్ర‌క‌టించాడు. హారిక హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అతడు, ఖలేజా సినిమాల తర్వాత మ‌హేష్‌-త్రివిక్ర‌మ్ కాంబినేషన్‌లో వస్తుండటంతో ఈ సినిమా కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే నేడు మ‌హేష్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా.. ఈ సినిమా […]

ఇప్పుడు కాకపోతే.. ఇంకెప్పుడు? అంటున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

ఐపీఎస్ అధికారిగా, తెలంగాణలో గురుకుల పాఠశాలల కార్యదర్శిగా ఉన్న ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ అట్టహాసంగా బీఎస్పీ పార్టలో చేరారు. ఆయన పార్టీ కండువా ఇలా కప్పుకున్నారో లేదో.. రాష్ట్ర బాధ్యతలు అప్పగించింది పార్టీ అధిష్టానం. దీంతో ఆర్ఎస్పీ (ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్) పొలిటికల్ కెరీర్ మొదలైనట్లే. పార్టీలో చేరిన సందర్భంగా ఆర్ఎస్పీ చేసిన ప్రసంగం ఆలోచించేలా ఉంది. దళితులకు కావాల్సింది దళిత బంధు కాదు.. అధికారం అన్నట్లు ప్రసంగించారు. ఆయన ప్రసంగాన్ని అన్ని పార్టీల నాయకులు […]

నటి హేమకు నరేష్ వార్నింగ్..?

టాలీవుడ్ లో గత కొంత కాలంగా రచ్చ రచ్చ జరుగుతోంది. మా అసోసియేషన్ లో వాదోపవాదాలు జరుగుతున్నాయి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల నేపథ్యంలో ఒకరిపై ఒకరు పరస్పరంగా ఆరోపణలు చేసుకుంటూ ఉన్నారు. ముందుగా లీడర్లు ప్రకాష్ రాజ్, హీరో మంచు విష్ణులు మాటల యుద్దం చేసుకున్నారు. ఆ తర్వాత పాత కమిటీలపై నిందారోపణలు వేడెక్కాయి. మా అసోసియేషన్ లోని డబ్బును నరేష్ విపరీతంగా ఖర్చు పెట్టేశాడని నటి హేమ ఆరోపించింది. నటి హేమకు సంబంధించిన ఓ […]

నటుడు అనుపమ్‌ శ్యామ్‌ మృతి…!

ఈ మధ్య కాలంలో చాలా మంది సినీ నటులు ప్రాణాలను విడుస్తున్నారు. అనారోగ్య సమస్యలతో కొందరు, కరోనా సోకి ఇంకొందరు, ప్రమాదాల బారిన పడి మరికొందరు కన్నుమూశారు. తాజాగా ఓ సీనియర్ నటుడు కాలం చేశారు. హిందీలో తన నటనతో అందర్నీ ఆకట్టుకున్న అనుపమ్‌ శ్యామ్‌ తుది శ్వాస విడిచారు. 63 ఏళ్ల అనుపమ్‌ శ్యామ్‌ కొన్ని రోజులుగా కిడ్నీ సమస్యలతో చికిత్స తీసుకుంటున్నాడు. కొన్ని రోజుల నుంచి ఆయన ఇంట్లోనే డయాలసిస్ చేసుకుంటూ ఉంటున్నారు. ఈ […]