‘ధాన్యం కొనుగోలు’ అనే పాయింట్ మీద ఒక రాష్ట్రముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లి కేంద్రాన్ని అడగడమే చాలా పెద్ద సంగతి. అయితే.. ఒకవేళ చిన్న సంగతే అయినా కూడా చాలా పెద్దగా హడావుడి చేయాలని ఫిక్సయిపోయిన కేసీఆర్.. స్వయంగా మంత్రులనుకూడా వెంట బెట్టుకుని ఢిల్లీ వెళ్లారు. ఉత్తి చేతులతోనే తిరిగొచ్చారు. అయితే గమనించాల్సింది ఏంటంటే.. ఇక్కడితో ఎపిసోడ్ అయిపోలేదు. ఇది చిన్న కమర్షియల్ బ్రేక్ మాత్రమా.. తర్వాత.. అసలు సినిమా ఉందని అనిపిస్తోంది. మూడురోజులుగా ఢిల్లీలోనే తిష్టవేసి అడుగుతూ […]
Tag: KCR
ఆ స్వతంత్రులకు సపోర్ట్ ఇస్తున్నదెవరో?
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల వ్యవహారం రసవత్తరంగా సాగుతోంది. ఎమ్మెల్యే కోటాలో అధికార పార్టీకి ఏ ఇబ్బందీ లేకపోయినా స్థానిక సంస్థల ఎన్నికలు మాత్రం తలనొప్పిగా మారనున్నట్లు సమాచారం. రాష్ట్రంలో ఖాళీగా ఉన్నది 12 స్థానాలు. 12 సీట్లకు గాను 12 మంది అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. రెండు చోట్ల మాత్రం కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్లు బరిలోకి దిగారు. అసలు విషయమేమంటే.. 12 సీట్లకు గాను 102 మంది నామినేషన్లు ఫైల్ చేయడంతో […]
‘కారు’ తిరిగొచ్చింది..‘బండి’ బయలుదేరుతుంది
వరి కొనుగోలు వ్యవహారం రాష్ట్రంలో ఇంకా కొద్దిరోజుల పాటు కొనసాగనుంది. ఈ విషయంలో అధికార టీఆర్ఎస్ పార్టీ, బీజేపీలు తప్పు మీదంటే మీదని ఒకరి మీద ఒకరు వేసుకుంటూ మీడియాలో నానుతున్నారు. ఎవరూ రైతుకు మేలు చేసిన దాఖలాలు కనిపించలేదు. ఓ వైపు వర్షం వచ్చి వరి ధాన్యం మొలకలెత్తుతోంది..మరోవైపు అన్నదాతలు వరిని కొనేవారు లేక ప్రాణాలు కోల్పోతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం రాజకీయాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వరి సమస్యను తేల్చుకునేందుకు సీఎం కేసీఆర్ […]
సారు.. వచ్చేశారు సిటీకి
నాలుగు రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర రాజధానికి వచ్చేశారు. గురువారం సాయంత్రం ఢిల్లీ నుంచి విమానంలో సిటీలో ల్యాండ్ అయ్యారు. వరి సమస్యపై మోదీతోపాటు కేంద్ర మంత్రులను కలుస్తామని ప్రజలకు చెప్పి తన టీమ్ తో హస్తినకు వెళ్లిన కేసీఆర్ కు అక్కడ ఎవరి దర్శనమూ కాలేదు. ఎంత ప్రయత్నించినా మోదీని కలిసే అవకాశం రాలేదు. దీంతో అక్కడే ఉండి చేసేది లేక తిరిగొచ్చేశారు. విచిత్రమేమంటే నాలుగు రోజుల పాటు ఒక […]
మూడు రోజులైంది.. ఇంకా ఎవ్వరినీ కలవలే..
‘‘మోదీ ప్రభుత్వం తెలంగాణను చిన్నచూపు చూస్తోంది.. రైతులను పట్టించుకోవడం లేదు.. అరె.. వరి కొంటారో, కొనరా చెప్పండయ్యా అంటే సమాధానం లేదు.. ఈ లొల్లేంది.. ఢిల్లీకి పోతాం.. అక్కడే తేల్చుకుంటాం’’ అని ధర్నా చౌకలో కేసీఆర్ మాట్లాడిన మాటలు ఇంకా చెవుల్లో మార్మోగుతున్నాయి. శభాష్.. సారు రైతుల కోసం ఎంతకైనా తెగిస్తాడు.. అన్నదాతకు మేలు జరుగుతుందని అందరూ సంతోషపడ్డారు. సారు చెప్పినట్లుగానే తన టీమ్ తో ఆదివారం ఢిల్లీకి బయలుదేరాడు. అంతే.. పోయి ఇంట్లో కూసున్నడు. ఇప్పటికి […]
మూడున్నర గంటల పాటు వెయిట్ చేయించారు
తెలంగాణలో వరి ధన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలని టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ కేసీఆర్ ధర్నా కూడా చేశారు. పార్టీ శ్రేణులు మొత్తం ప్రభుత్వానికి అండగా నిలిచాయి. అంతటితో ఆగం.. ఢిల్లీ వెళ్లి మాట్లాడతాం.. కొంటారా? కొనరా? అని అడుగుతాం అని కేసీఆర్ బలంగా చెప్పారు. అన్నట్లుగానే కేసీఆర్ అండ్ టీమ్ ఢిల్లీకి వెళ్లింది. ఆదివారం హస్తినకు వెళ్లిన ప్రభుత్వ పెద్దలు అక్కడ ఏమేం చేయాలో రూట్ మ్యాప్ […]
సీఎం కేసీఆర్ బిజీ..బిజీ..
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల కాలంలో బాగా బిజీ అయ్యారు. రాష్ట్రంలో హుజూరాబాద్ ఉప ఎన్నికలు ముగిసి పరాజయం మూటగట్టుకున్న తరువాత ప్రభుత్వ, పార్టీ వ్యవహారాలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. అందుకే ఈటల అనంతరం తన వద్దే ఉంచుకున్న వైద్య ఆరోగ్య శాఖను అల్లుడు హరీశ్ కు అప్పగించడమే నిదర్శనం. ఇటీవల కాలంలో బీజేపీ నేతలు ఏకంగా కేసీఆర్ కుటుంబాన్నే టార్గెట్ చేశారు. హుజూరాబాద్ లో ఈటల గెలవడంతో బీజేపీ జోష్ లోఉంది. ఇక పుండు మీద […]
ఎర్రబెల్లికి త్రెట్..బండ ప్రకాశ్ కు చాన్స్..
ఎర్రబెల్లి దయాకర్ రావు.. సీనియర్ లీడర్.. ఆరుసార్లు ఎమ్మెల్యేగా అయిన నాయకుడు.. ఐదుసార్లు తెలుగుదేశం పార్టీ తరపున, ఈసారి టీఆర్ఎస్ తరపున శాసనసభలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇంత సీనియర్ అయిన ఎర్రబెల్లికి టీడీపీ హయాంలో ఒక్కసారి కూడా మంత్రిగా పనిచేసే అవకాశం రాలేదు. అయితే.. కేసీఆర్ 2.0లో మాత్రం ఆ చాన్స్ దక్కింది. మంత్రి హోదా అనుభవిస్తూ పార్టీలో యాక్టివ్ గా ఉన్నారు. అయితే.. ఎర్రబెల్లి మాత్రం ఇపుడు సంతోషంగా లేరు. ఎందుకంటే బండ ప్రకాశ్ రూపంలో […]
కేసీఆర్ మదిలో.. ముందస్తు ఎన్నికలు
‘‘నేను ఉద్యమాలనుంచి వచ్చిన వాడిని.. పదవులు నాకు లెక్కకాదు.. ప్రత్యేక తెలంగాణ కోసం ఎన్నిసార్లు రాజీనామా చేశానో మీకు తెలుసు.. ’’ అని మొన్న ఇందిరాపార్కులో జరిగిన ధర్నా లో చేసిన ప్రసంగం ఇంకా చెవుల్లో మార్మోగుతోంది. అంటే.. కేసీఆర్ మదిలో ఏదో ఉంది.. రాజీనామాలు చేసి ముందస్తు ఎన్నికలకు పోయే అవకాశమూ ఉందని రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది. కేసీఆర్ ఏదైనా మాట్లాడారంటే దానికి ఓ లెక్క ఉంటుందని ఆయనకు సన్నిహితంగా ఉన్న వారు చెబుతున్నారు. వరి […]