ఎంపీలకు కూడా జగన్ షాక్..సీట్లు పాయే.!

నెక్స్ట్ ఎన్నికల్లో మళ్ళీ గెలిచి అధికారం దక్కించుకోవాలనే దిశగా జగన్ పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఈ సారి కూడా అధికారంలోకి వస్తే..మరో 30 ఏళ్ల పాటు అధికారంలో ఉండవచ్చు అనేది జగన్ ప్లాన్. అందుకే జగన్ ఆచి తూచి అడుగులేస్తున్నారు. గెలవడం కోసం అవసరమైతే కొందరు ఎమ్మెల్యేలని సైతం పక్కన పెట్టడానికి జగన్ వెనుకాడటం లేదు. పనితీరు బాగోని ఎమ్మెల్యేలకు మళ్ళీ సీట్లు ఇస్తే వైసీపే దెబ్బతినడం ఖాయం. అందుకే కొందరిని మార్చి..ఎన్నికలకు వెళ్లాలని చూస్తున్నారు. అయితే […]

ఈ స్ట‌యిల్ మారాలేమో బాబూ…!

రాజ‌కీయంగా నాయ‌కుల‌కు ఒక ఇమేజ్ వ‌చ్చిన త‌ర్వాత‌.. కొంత ఇబ్బంది వ‌స్తుంది. అదేంటంటే మాస్ మ‌హారాజు మాదిరిగా ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకోలేక పోవ‌డం. అంతేకాదు.. ప్ర‌జ‌ల మ‌న‌సుల్లో చోటు సంపాయించుకో వ‌డం. గ‌త కొన్ని రోజులుగా టీడీపీ అధినేత చంద్ర‌బాబును ప‌రిశీలిస్తే.. ఈ రెండు స‌మ‌స్య‌లు ఆయ‌న ప్ర‌సంగాల్లో క‌నిపిస్తున్నాయి. ప్ర‌జ‌లు ఆయ‌న స‌భ‌ల‌కు వ‌స్తున్నారు. దీంతో ఆయ‌న ఉల్లాసంగా ఉన్నారు. ఈ క్ర‌మంలో చంద్ర‌బాబు చేస్తున్న ప్ర‌సంగాల్లో ఒకింత అగ్ర‌సివ్ నెస్ క‌నిపిస్తోంది. నేను చేశాను.. నేనే […]

మీడియాతో రాజకీయం..ఎవరి కాన్సెప్ట్ వారిది..!

తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో మీడియా పాత్ర ఎంత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..మీడియానే రాజకీయాలు చేస్తుందా? అనే పరిస్తితి. అంటే ఆ స్థాయిలో మీడియా జోక్యం ఉంది..పైగా పార్టీల వారీగా మీడియా విడిపోయింది. పిల్లలని అడిగిన సైతం ఏ మీడియా..ఏ పార్టీదో చెప్పేస్తారు. అంటే ఆ స్థాయిలో మీడియా కొన్ని పార్టీలకు భజన సంస్థలుగా మారిపోయాయి. ఏపీలో అధికార వైసీపీకి, ప్రతిపక్ష టీడీపీకి అనుకూలమైన మీడియా సంస్థలు ఉన్నాయి. ఆ విషయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన […]

జగన్ ఎన్నికలకు వెళ్ళేది అప్పుడే..మార్చిలో సీట్లు..!

ఇటీవల వైసీపీ వర్క్ షాపులో జగన్..సీట్ల పంపకాలపై కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇంకా మార్చి వరకు ఎమ్మెల్యేలకు సమయం ఇస్తున్నానని, ఆ లోపు పనితీరు మెరుగు పర్చుకోవాలని..ఆ తర్వాత సీట్లని సైతం ఫిక్స్ చేస్తానని చెప్పారు. పనితీరు బాగోని ఎమ్మెల్యేలకు ఎట్టి పరిస్తితుల్లోనూ సీట్లు ఇవ్వనని తేల్చి చెప్పేశారు. దాదాపు సిట్టింగ్ ఎమ్మెల్యేలకే సీట్లు ఇవ్వడానికి చూస్తానని, లేని పక్షంలోనే కొత్తవారికి ఛాన్స్ ఇస్తానని అన్నారు. అయితే వైసీపీలో కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీటు […]

‘మరణ దిన వేడుకలు’ వెనక మాజీ మంత్రి డాక్టర్ పాలేటి మర్మం ఏమిటి ? టార్గెట్ బలరాం గా ఆపరేషన్?

బాపట్ల జిల్లా చీరాలలో మాజీ మంత్రి డాక్టర్ పాలేటి రామారావు వినూత్నంగా నిర్వహించిన ‘మరణ దిన వేడుకలు’వెనక చాలా గూడార్థం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఆయన ఏదో ఆషామాషీగా,అర్థరహితంగా ఈ కార్యక్రమం నిర్వహించలేదని చీరాల రాజకీయ తాజా పరిణామాలను బాగా విశ్లేషించిన వారికి స్పష్టంగా అవగతమవుతుంది.ఇంకా చెప్పాలంటే ఎమ్మెల్యే కరణం బలరాం ను టార్గెట్ చేసి డాక్టర్ పాలేటి ఈ కార్యక్రమానికి డిజైన్ చేశారని సర్వత్రా వినవస్తోంది. కొద్దిగా వెనక్కు వెళితే..! 2019లో చీరాల నుండి […]

రాజధాని వ్యూహం..ఆ రెండే జగన్ టార్గెట్..!

అధికారంలోకి రాగానే జగన్..అమరావతిని రాజధానిగా కాదు అని..మూడు రాజధానుల కాన్సెప్ట్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అమరావతిని శాసన రాజధానిగా చేసి..విశాఖని పరిపాలన రాజధానిగా, కర్నూలుని న్యాయ రాజధానిగా చేయాలని డిసైడ్ అయ్యారు. అయితే నిర్ణయం తీసుకుని మూడేళ్లు అయింది..కానీ మూడేళ్లలో మూడు రాజధానుల కోరిక నెరవేరలేదు. ఈ రాజధాని అంశంపై ఈ మూడేళ్లు ఎలాంటి రచ్చ నడిచిందో అందరికీ తెలిసిందే. మొత్తానికి రాష్ట్రానికి రాజధాని ఏది అంటే చెప్పలేని పరిస్తితి ఏపీ ప్రజలకు వచ్చింది. ఇలా రాజధానిపై […]

జగన్‌తో విశాల్..బాబుకు టెన్షన్..కుప్పంపైనే గురి.!

ఈ మధ్య ఏపీ రాజకీయాల్లో తమిళ నటుడు విశాల్ పేరు ఎక్కువగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. స్వతహాగా తెలుగువాడైన విశాల్..తమిళనాడు వెళ్ళి అక్కడ హీరోగా సెట్ అయిన విషయం తెలిసిందే. విశాల్ తండ్రి ప్రముఖ వ్యాపారవేత్త జి‌కే రెడ్డి అనే సంగతి తెలిసిందే..వీరిది చిత్తూరు జిల్లా. అలాగే కుప్పంలో అంతకముందు వ్యాపారాలు కూడా చేశారు. పైగా రెడ్డి సామాజికవర్గం కావడంతో విశాల్ వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరుపున కుప్పంలో పోటీ చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. […]

పులివెందుల కూడా లాస్ట్..ఎంపీదే బాధ్యత.!

గడపగడపకు సంబంధించి తాజాగా జగన్ వైసీపీ ఎమ్మెల్యేలు…ఇంచార్జ్‌లు, సమన్వయకర్తలతో వర్క్ షాప్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ వర్క్ షాప్‌లో పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు గడపగడపకు వెళ్ళడంలో విఫలమయ్యారని…తక్కువ రోజులే గడపగడపకు తిరిగారని చెప్పి క్లాస్ ఇచ్చారు. సెప్టెంబర్ 28 సమావేశం తర్వాత ఇప్పటివరకు 78 రోజులు అయింది..అయితే ఇందులో 10-22 రోజులు అంటే చాలా తక్కువ రోజులు తిరిగిన వారు 38 మంది వరకు ఉన్నారు. ఇందులో పలువురు మంత్రులు కూడా ఉన్నారు. బొత్స సత్యనారాయణ, […]

జగనన్న ఆర్మీతో 175 పక్కా..!

వచ్చే ఎన్నికల్లో 175కి 175 సీట్లు గెలవడమే లక్ష్యంగా జగన్ ముందుకెళుతున్న విషయం తెలిసిందే. ఈ మధ్య ఎక్కడ చూసినా సరే..175 సీట్లు గెలవాల్సిందే అని జగన్ చెబుతున్నారు. ఆ దిశగా ఎమ్మెల్యేలు, ఇంచార్జ్ లని గడపగడపకు తిప్పుతున్నారు. తాము ప్రజలకు మంచి పనులు చేస్తున్నామని, కాబట్టి ప్రజలు కూడా తమకు అండగా ఉంటారని అనుకుంటున్నారు. అయితే ఎమ్మెల్యేలు, వాలంటీర్లనే నమ్ముకోకుండా జగన్..కొత్తగా 50 ఇళ్లకు ముగ్గురు వైసీపీ కార్యకర్తలని గృహ సారథులగా నియమిస్తున్నారు. వీరి పని […]