ప్రధాని నరేంద్ర మోడీకి బీజేపీ కురువృద్ధుడు ఎల్.కె. అద్వానీ నుంచి పెద్ద షాక్ తగిలింది! వాస్తవానికి 2014 ఎన్నికలకు ముందు బీజేపీ ప్రధాని అభ్యర్థిగా మోడీ పేరు తెరమీదకి వచ్చినప్పుడు కూడా గోద్రా ఘటన నేపథ్యంలో అద్వానీ.. గుజరాత్ సీఎంగా ఉన్న మోడీని తీవ్రంగా వ్యతిరేకించారు. అయినా.. పార్టీ అద్వానీ సలహాను పక్కనపెట్టి మోడీని ప్రధానిని చేసింది. ఇక, ఇప్పుడు మళ్లీ అద్వానీ అదే విధమైన వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారట. మోడీ తాజాగా తీసుకున్న పెద్ద నోట్ల […]
Tag: bjp
కేసీఆర్ బ్లాక్ మనీతో జీతాలు ఇచ్చారా..!
ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై తెలంగాణ ప్రభుత్వం సహా సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బ్లాక్ మనీ నిరోధానికి తాము వ్యతిరేకం కాదని, అయితే, ఈ క్రమంలో మోడీ తీసుకున్న నిర్ణయమే తమ ఆదాయాన్ని తీవ్రస్థాయిలో దెబ్బతీసిందని కేసీఆర్ విమర్శించారు. లెక్కలతో సహా ఆయన పక్కాగా విమర్శించారు. రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడం, రియల్ దెబ్బతినడం వంటి కారణాలతో రాష్ట్రం ఆదాయం కోల్పోయిందని, దీంతో ఉద్యోగులకు జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదని కేసీఆర్ […]
మానవత్వం చాటిన కేంద్ర మంత్రి
చిన్న చిన్న త్యాగాలు ఒక్కోసారి పెద్ద పెద్ద సమస్యలను తీర్చడంతోపాటు.. అంతకన్నా పెద్ద పేరును కూడా తెస్తాయి. ఇప్పడు అలాంటి అతి చిన్న త్యాగంతో అతి పెద్ద పేరు సంపాదిస్తున్నారు కేంద్ర మంత్రి జయంత్ సిన్హా. ప్రజలకు అన్ని విధాలా మనం చేయగలిగినంత సేవ చేయాలని పదేపదే చెబుతున్న ప్రధాని మోడీ మాటలు మంత్రి సిన్హా చెవికెక్కించుకున్నారో ఏమో.. ఓ ప్రత్యేక సాయం చేసి.. సర్వత్రా అభినందనలు అందుకుంటున్నారు. మరి అదేంటో చూద్దాం.. శ్రేయ అనే యువతి […]
జనసేనది ఒంటరి పోరే..
ప్రముఖ సినీ కథానాయకుడు పవన్ కల్యాణ్ ప్రతక్ష్య రాజకీయాల్లోకి అడుగు పెట్టేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో ఆయన టీడీపీ-బీజేపీ కూటమికి మద్దతిచ్చి వారికి అనుకూలంగా ప్రచారం కూడా చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు… బీజేపీపై కాస్త గట్టిగా… టీడీపీపై కాస్త సుతిమెత్తగా విమర్శలు చేస్తోన్న పవన్ వైఖరిని చూశాక మరి జనసేన వచ్చే ఎన్నికల్లో సొంతంగానే బరిలోకి దిగుతుందా..? లేక ఇప్పటిదాకా మిత్రపక్షంగా ఉన్న ఎన్డీఏ తో పొత్తు […]
సోము వీర్రాజు… కామెడీ రాజకీయం..!
గత ఎన్నికల ముందు రెండు తెలుగు రాష్ట్రాల్లోను పొత్తు పెట్టుకుని పోటీ చేసిన టీడీపీ, బీజేపీ కూటమి ఏపీలో అధికార పీఠాన్ని దక్కించుకోగలిగింది. తెలంగాణలో ఈ కూటమి ప్రభావం పరిమితంగానే పనిచేయడంతో ఆ రాష్ట్రంలో ఎన్నికలైన దగ్గర్నుంచే రెండు పార్టీల స్థానిక నేతల మధ్య విభేదాలు పొడచూపడమే కాకుండా అసలు ఈ రెండూ మిత్ర పక్షాలా కాదా..? అన్న స్థితికి చేరాయి. ఇక ఏపీ విషయానికొస్తే…జాతీయ స్థాయిలో మోడీ హవా కొనసాగుతుండటంతో రాష్ట్రంలో కూడా తమ బలం […]
ఏపీ రాజధానిలో టీడీపీతో బీజేపీ కటిఫ్
2014 నుంచి మిత్రపక్షంగా ఉన్న ఏపీ అధికార పార్టీ టీడీపీ, బీజేపీ ల మధ్య రానురాను కొన్ని విషయాల్లో వ్యతిరేకత కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఇక, ఇటీవల కాలంలో నామినేటెడ్ పదవుల వ్యవహారం మరింతగా ఇరు పార్టీల నేతల మధ్య అంతరాన్ని మరింతగా పెంచింది. ఈ క్రమంలోనే విజయవాడ బీజేపీలో చిచ్చు రేగింది. ఇక, ఇప్పుడు ఇదే నామినేటెడ్ పదవుల పందేరం విషయంలో గుంటూరు బీజేపీ నేతలు మరింతగా కారాలు మిరియాలు నూరడంతోపాటు అసలు టీడీపీతోనే కటీఫ్ చెప్పేందుకు […]
యూపీ ఎన్నికలపై సర్వే సిత్రాలు సూడరో!
వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న ఉత్తరప్రదేశ్(యూపీ) అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వివిధ సంస్థలు చేస్తున్న సర్వేలు, వెల్లడిస్తున్న ఫలితాలు హాట్‌హాట్‌గా ఉంటున్నాయి. రాష్ట్ర రాజకీయాలను ఎప్పటికప్పుడు వేడెక్కిస్తున్నాయి. దేశంలోనే అతి పెద్ద రాష్ట్రాల్లో ఒకటి, నియోజకవర్గాల పరంగా అదిపెద్దది అయిన రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలంటే… ఆ ఒక్క రాష్ట్రమే కాదు.. దేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తుంటుంది. ఇక్కడ ఎంపీ స్థానాలు కూడా ఎక్కవే. కాబట్టి ఇక్కడ అధికారంలోకి వచ్చే పార్టీకి తదుపరి జరిగే సార్వత్రిక ఎన్నికల్లో […]
టీడీపీ కంచుకోటలో అసంతృప్తి సెగలు
ఏపీలో తెలుగు దేశం పార్టీ అధికారంలోకి రావడానికి పూర్తిస్థాయిలో సహకారం అందించిన జిల్లాల్లో ఒకటైన అనంతపురం గత ఎన్‌టీఆర్ కాలం నుంచి ఈ పార్టీకి కంచుకోటగా ఉంది. ముఖ్యంగా ఎన్‌టీఆర్ సహా ఆయన తనయుడు బాలయ్యలు ఈ జిల్లా నుంచే గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఒక్క ఉరవకొండ, కదిరి నియోజకవర్గాలు మినహా మిగిలిన 12 అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ సైకిల్ దూసుకుపోయింది. అదేవిధంగా రెండు ఎంపీ సీట్లనూ టీడీపీనే కైవసం చేసుకుంది. దీంతో స్టేట్‌లో టీడీపీకి అత్యధిక బలం […]
ఏపీకి ఆ సాయం కూడా రాకుండా కేంద్రం బ్రేక్.
విభజన పాపంలో పార్లమెంట్ సాక్షిగా.. నాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతో పోటీపడి మరీ బీజేపీ పాలు పంచుకున్న విషయం రాష్ట్ర ప్రజలు ఇంకా మరచిపోలేదు. అయితే తాము అధికారంలోకి వచ్చాక విభజనతో నష్టపోయిన ఏపీని ఆదుకుంటామని చెప్పిన బీజేపీ నేతల హామీలను రాష్ట్ర ప్రజలు విశ్వసించారు. ఫలితంగానే ఏపీలో బలమైన పునాదులు ఉన్న కాంగ్రస్ పార్టీని చరిత్రలో గుర్తుండిపోయే స్థాయిలో భూస్థాపితం చేసి మరీ టీడీపీ, బీజేపీ కూటమికి అధికారం అప్పగించారు.. అయితే అధికారం చేజిక్కాక, […]