యూపీలో తండ్రి, కొడుకులు విడిగా పోటీ చేస్తే…రిజల్ట్ ఇదే

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బుధవారం మధ్యాహ్నం ఎన్నికల కమిషన్ చీఫ్ నసీమ్ జైదీ షెడ్యూల్‌ను ప్రకటించారు. మొత్తం యూపీ – ఉత్త‌రాఖండ్ – గోవా -మ‌ణిపూర్‌- పంజాబ్ రాష్ట్రాల్లో ఎన్నిక‌లు జ‌రుగుతున్నా ఇప్పుడు అంద‌రి దృష్టి దేశంలోనే పెద్ద రాష్ట్ర‌మైన ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌పైనే ఉంది. ఎన్నిక‌ల వేళ యూపీలో రాజ‌కీయ ప‌రిణామాలు స‌డెన్‌గా మారిపోయాయి. సీఎం అఖిలేశ్‌, ఎస్పీ అధ్య‌క్షుడు అఖిలేశ్ తండ్రి ములాయం మ‌ధ్య తీవ్ర‌స్థాయిలో వార్ జ‌రుగుతోంది. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు ఎస్పీ […]

కేసీఆర్ కేబినెట్‌లో బీజేపీ మంత్రులకు బెర్త్

తెలంగాణ పాలిటిక్స్‌లో స‌రికొత్త ముఖ‌చిత్రం ఆవిష్కృత‌మ‌య్యేందుకు రంగం సిద్ధ‌మ‌వుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు శత్రువులుగా క‌త్తులు దూసుకున్న పార్టీలు రేప‌టి నుంచి మిత్రులు కాబోతున్నారు. తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్ కేంద్రంలో ఎన్డీయే ప్ర‌భుత్వంలో చేరేందుకు ప్రాథ‌మిక చర్చ‌లు జ‌రిగిన‌ట్టు టీ పాలిటిక్స్‌లో వార్త‌లు వినిపిస్తున్నాయి. కేంద్రంలోని ఎన్డీయే స‌ర్కార్‌లో టీఆర్ఎస్ చేరితే తెలంగాణ‌లోని టీఆర్ఎస్ స‌ర్కార్‌లో బీజేపీ చేర‌నుంద‌ట‌. ఏపీలో అధికారంలో ఉన్న బీజేపీ-టీడీపీ స‌ర్కార్ అవ‌లంభిస్తోన్న సేమ్ టు సేమ్ ఫార్ములా ఇక్క‌డ కూడా అమ‌లుకానుంది. టీఆర్ఎస్‌కు […]

రేవంత్ బీజేపీ-కాంగ్రెస్ ఎంట్రీకి బ్రేక్ వేస్తోంది ఎవ‌రు..?

తెలంగాణ‌లో అధికారంలో టీఆర్ఎస్ ఉంటే అక్క‌డ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా కాంగ్రెస్ ఉన్నా, మిగిలిన ప్ర‌తిప‌క్ష పార్టీలు చాలానే ఉన్నాయి. టీడీపీ-బీజేపీ-ఎంఐఎం-సీపీఎం-సీపీఐ ఈ పార్టీల‌న్ని కూడా అక్క‌డ ప్ర‌తిప‌క్షాలుగానే ఉన్నాయి. ఇక్క‌డ ఎన్ని పార్టీలు ఉన్నా…ఎంత మంది ప్ర‌తిప‌క్ష నేత‌లు ఉన్నా అధికార టీఆర్ఎస్ – సీఎం కేసీఆర్‌ను టార్గెట్‌గా చేసుకుని టీడీపీ ఫైర్‌బ్రాండ్ రేవంత్‌రెడ్డి విసిరే పంచ్‌ల‌కు ఉండే క్రేజే వేరు. తెలంగాణ‌లో గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ 15 సీట్లు గెలుచుకుంది. కేసీఆర్ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ దెబ్బ‌కు […]

జంపింగ్ జ‌పాంగ్‌ల‌కు ఫ్యూచ‌ర్ బెంగ‌

అవును! కాంగ్రెస్ నుంచి జంప్ చేసి విచ్చ‌ల‌విడిగా బీజేపీలో చేరిపోయిన సీనియ‌ర్ నేత‌లు ఇప్పుడు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. ఏపీ ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌కు విరుద్ధంగా తెలంగాణ ఏర్పాటు చేయ‌డంతో ఏపీలో కాంగ్రెస్ అడ్ర‌స్ గ‌ల్లంత‌యింది. దీంతో ఆపార్టీలో ఉంటే త‌మ భ‌విష్య‌త్ కూడా నాశ‌నం అయిపోతుంద‌ని భావించిన కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌లు, మంత్రులుగా చేసిన నేత‌లు సైతం కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పి.. మోడీ నేతృత్వంలోని బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఫ‌లితంగా త‌మ రాజ‌కీయ భ‌విష్య‌త్తు భారీ ఎత్తుకు […]

జ‌గ‌న్ మెడ‌కు ఉచ్చు బిగిస్తోందెవ‌రు..!

నోరా.. వీపుకు చేటు! అనేది ఓ పాత సామెత‌. అంటే.. మ‌నం నోటిని ఎంతో అదుపులో పెట్టుకుని మాట్లాడాల‌ని లేక‌పోతే.. లేని పోని చిక్కులు వ‌చ్చిప‌డ‌తాయ‌ని అర్ధం. ఇప్పుడు ఈ మాట వైకాపా అధినేత జ‌గ‌న్ విష‌యంలో అక్ష‌ర స‌త్యం అవుతోంది! గ‌తంలో ఓదార్పు యాత్ర‌ల సంద‌ర్భంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై ఇష్టానుసారంగా మాట్లాడిన జ‌గ‌న్‌కు కేసుల రూపంలో ఎదురైన అనుభ‌వం ఈ జీవిత‌కాలం కోర్టుల‌తో పోరాడినా స‌మ‌సిపోని చిక్క‌లు తెచ్చింది. అంతేకాదు, సీబీఐ, ఈడీల […]

బాబు ప్లాన్‌కి ఆ ముగ్గురూ బ‌లే!!

పాలిటిక్స్‌లో ఆరితేరిన టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్ర‌బాబు తిరిగి 2019లోనూ ఏపీలో అధికారంలోకి రావాల‌ని భావిస్తుండ‌డం తెలిసిందే. అయితే, భావ‌న ఉంటే స‌రిపోతుందా? దానికి త‌గిన ప్ర‌య‌త్నం ఉండాలి క‌దా?! అనేవాళ్లు చాలా మందే ఉంటారు. ఈ విష‌యంలో బాబుకు ఎవ‌రూ స‌ల‌హాలు ఇవ్వ‌క్క‌ర్లేదు! 2019 ఎన్నిక‌ల‌పై ఇప్ప‌టి నుంచే ప‌క్కా ప్లాన్‌తో ఉన్న బాబు.. దానికి అనుగుణంగా ముందుకు సాగుతున్నారు. 2019 నాటికి రాష్ట్రంలో ఎవ‌రు క్రియాశీల‌కంగా మార‌తారో? ఎవ‌రి వ‌ల్ల త‌న ఉనికికి […]

బీజేపీ నుంచి  సొంత‌గూటికి నాగం జంప్‌..!

బీజేపీ నేత‌, తెలంగాణలో సీనియ‌ర్ పొలిటీషియ‌న్ నాగం జ‌నార్ద‌న రెడ్డి.. పార్టీ మారుతున్నార‌నే టాక్ వినిపిస్తోంది. 2019 ఎన్నిక‌ల‌ను దృష్టి లో పెట్టుకుని ఇప్ప‌టికే ఏపీ, తెలంగాణ‌ల్లో నేత‌లు ఎవ‌రి జాగ్ర‌త్త‌లు వాళ్లు తీసుకుంటున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే నాగం కూడా త‌న రాజ‌కీయ కెరీర్‌, భ‌విష్య‌త్తును దృష్టిలో పెట్టుకుని బీజేపీకి రాం రాం చెప్పాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలిసింది. అదేస‌మ‌యంలో ఆయ‌న త‌న మాతృ సంస్థ టీడీపీలోకి వెళ్లే అవ‌కాశాలు మెండుగా క‌నిపిస్తున్నాయ‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. […]

టీడీపీ అలా చేస్తే.. జ‌గ‌న్‌కి ప‌ట్ట‌ప‌గ‌లే చుక్క‌లు..!

వైకాపా అధినేత జ‌గ‌న్ చుట్టూ మ‌రోసారి ఉచ్చుబిగుసుకుంటోందా? ఇప్ప‌టికి అనేక కేసుల్లో చిక్కుకున్నా.. కేసుల విచార‌ణ‌లో కొంత జాప్యం జ‌రుగుతుండ‌డంతో ఊపిరి పీల్చుకుంటున్న ఆయ‌న‌కు త్వ‌ర‌లోనే భారీషాక్ త‌గ‌ల‌నుందా? ఏపీ టీడీపీ నేత‌లు జ‌గ‌న్‌ను మ‌రింత ఇర‌కాటంలోకి నెట్టేలా పావులు క‌దుపుతున్నారా? అంటే ఔన‌నే సమాధాన‌మే వ‌స్తోంది. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆస్తులు పోగేసుకున్న కేసులో జ‌గ‌న్ దాదాపు ఏడాదికి పైగా జైల్లో ఉండి బెయిల్‌పై బ‌య‌ట‌కు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం జ‌గ‌న్ కేసుల […]

జగన్ మంచి జోష్ మీద ఉన్నారు.

వైకాపా అధినేత జ‌గ‌న్ ఇప్పుడు మంచి జోష్ మీదున్నారు. 2014లో కొంచెం తేడాతో సీఎం సీటు కోల్పోయాన‌న్న బాధ ఆయ‌న‌ను ఒక ప‌క్క వేధిస్తున్నా.. మ‌రోప‌క్క మాత్రం.. పొలిటిక‌ల్‌గా చోటు చేసుకుంటున్న ప‌రిణామాల నేప‌థ్యంలో ఆయ‌న హ్యాపీగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. విష‌యంలోకి వెళ్తే.. టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం చంద్ర‌బాబు ఆక‌ర్ష్ పిలుపుతో వైకాపా నుంచి పెద్ద ఎత్తున వ‌ల‌స‌లు పెరిగిపోయాయి. క్యూక‌ట్టి మ‌రీ.. వైకాపా నేత‌లు, జిల్లా స్థాయి ఇంచార్జ్‌లు సైతం సైకిలెక్కేశారు. దీంతో జ‌గ‌న్‌కి […]