విశాఖ ఉక్కును తాను కాపాడేస్తానని జనసేనాని పవన్ కల్యాణ్ విశాఖ వాసులకు చాలా గట్టిగా హామీ ఇచ్చారు. ఓ బహిరంగ సభ కూడా నిర్వహించారు. వారికి తాను అండగా ఉంటానన్నారు. అదే వేదిక మీదనుంచి.. జగన్మోహన్ రెడ్డి ఏం పనులు చేయాలో, విశాఖ ఉక్కును ఎలా కాపాడుకోవాలో.. కొన్ని పనులను పవన్ కల్యాణ్ డిక్టేట్ చేశారు. విశాఖ ఉక్కుకోసం ఆయన పోరాటంలో తొలి అధ్యాయం అలా ముగిసింది. సినిమాల షూటింగులకు మధ్య వచ్చే షెడ్యూల్ గ్యాప్‌లో పవన్ […]
Tag: bjp
డీఎస్ కోసం తలుపులు తెరిచిన కాంగ్రెస్, బీజేపీ
డి.శ్రీనివాస్.. ధర్మపురి శ్రీనివాస్.. తెలుగు రాష్ట్రాల్లో ఈయన పేరు తెలియని వారుండరు.. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో డీఎస్ హవా ఓ రేంజ్ లో ఉండేది.. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోవడంతో ఈయన ప్రభ కూడా తగ్గిపోయింది. దీంతో టీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. కారు పార్టీలో చేరినా పెద్దగా చురుగ్గా లేరు. ఈయన కుమారుడు అరవింద్ నిజామాబాద్ లో ఎంపీగా విజయం సాధించారు. బీజేపీ తరపున అరవింద్ గెలవడంతో డీఎస్ టీఆర్ఎస్ లో […]
రాళ్లేసిన ప్రాంతంలోనే.. పూలు వేయించుకున్న ఈటల
ఈటల రాజేందర్.. టీఆర్ఎస్ పార్టీలో అనేక సంవత్సరాలు పనిచేసి.. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించి.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత మంత్రిగా పనిచేసి.. ఆ తరువాత అధినేత కేసీఆర్ తో విభేదాలొచ్చి పార్టీలోంచి బయటకు వచ్చారు. ఇంకా చెప్పాలంటే టీఆర్ఎస్ పార్టీ ఈటలను ఒంటరి చేయాలని చూసింది. పార్టీలో ఉన్నపుడు మంత్రి వర్గం నుంచి తొలగించిన అనంతరం.. ఈటల తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. విచిత్రమేమంటే ఆయన అలా రాజీనామా చేసిన కొద్ది సేపటికే […]
అసలు ’వరి‘ని కొనేదెవరు? ..ముందు ఇది తేల్చండి
తెలంగాణలో వరి రాజకీయం వేడెక్కింది. రైతులు పండించిన వరిని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంటే..కాదు.. కేంద్ర ప్రభుత్వమే ఆ పనిచేయాలని తెలంగాణ రాష్ట్ర సమితి పట్టుపడుతోంది. దీంతో రాష్ట్రంలో వరి కొనుగోలు సంగతి పక్కకువెళ్లి టీఆర్ఎస్, బీజేపీలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఆందోళన చేస్తే.. శుక్రవారం టీఆర్ఎస్ కూడా నిరసన బాట పడుతోంది. ఒకవైపు రైతులు కొనుగోళ్లు లేక ప్రాణాలు కోల్పోతుంటే.. బాధ్యతగల […]
రేవంత్ కామెంట్స్ పై ఇద్దరూ మౌనం
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ముందునుంచీ అంటే పార్టీ పగ్గాలు చేపట్టినప్పటినుంచీ అదే దూకుడు ప్రదర్శిస్తున్నారు. సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరుగుతూనే.. కేంద్రం పెద్దలను కూడా టార్గెట్ చేస్తున్నారు. అయితే.. రేవంత్ మాటలకు, సవాళ్లకు ఇటు కేసీఆర్ సర్కారు కానీ, అటు బీజేపీ కానీ సమాధానం ఇవ్వడం లేదు. హైదరాబాదు శివారులోని కొంపెల్లిలో జరిగిన పార్టీ శిక్షణ కార్యక్రమంలో రేవంత్ ఇరు పార్టీల వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పడిన తరువాత రాష్ట్రంలో అనేక […]
వేల నామినేషన్లన్నారు.. చివరకు 61 మాత్రమే వేశారు
ఈ ప్రభుత్వానికి బుద్ధి చెబుతాం.. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో వేల మందితో నామినేషన్లు వేయిస్తాం.. ప్రభుత్వానికి మా సత్తా చూపుతాం అంటూ పలువురు నాయకులు, ప్రజాసంఘాలు, నిరుద్యోగులు, కాంట్రాక్టు వర్కర్లు గతంలోపేర్కొన్నారు. అందరూ.. నామినేషన్ వేస్తే బ్యాలెట్ పేపర్ కాదు కదా.. బ్యాలెట్ బుక్ తయారు చేయాలని మీడియాలో కథనాలు కూడా వచ్చాయి. ఉప ఎన్నికలకు షెడ్యూల్ వచ్చేసింది.. నామినేషన్ల గడువు కూడా ముగిసింది. తీరా ఎన్ని నామినేషన్లు దాఖలు చేశారంటే.. కేవలం 61 మాత్రమే. అదీ […]
హుజూరాబాద్ ఎన్నికల్లో నలుగురు రాజేందర్లు?
అవును మీరు చదివింది నిజమే.. ఈనెల 30న జరిగే హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో నలుగురు రాజేందర్లు పోటీచేస్తున్నారు. అదేంది ఉన్నది ఒక్క రాజేందరే కదా అనే అనుమానం రావడం సహజం. వారందరూ రాజేందర్లే అయినా.. అందరూ ఈటల రాజేందర్లు కాదు.. కాబట్టి పెద్ద టెన్షనేం అవసరం లేదు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తరువాత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాడు. ఇది అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడ […]
ఏపీ బీజేపీ సంగతి మళ్లీ చూద్దాం
భారతీయ జనతా పార్టీ.. మోదీ ప్రధాని అయిన తరువాత పార్టీకి ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ వచ్చింది. ఓ రాష్ర్టానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఒంటిచేత్తో పార్టీని గెలిపించి ప్రధాని పదవిని చేపట్టారు. మోదీ చేతిలోకి పార్టీ వచ్చిన తరువాత తనకు అత్యంత ఆప్తుడైన అమిత్ షాను పార్టీ చీఫ్.. ఆ తరువాత హోం మంత్రిగా చేశారు. ఇపుడు బీజేపీ అధిష్టానం ఎవరంటే ముందుగా మోదీ.. తరువాత అమిత్ షా పేరు బయటకు వస్తుంది. ఢిల్లీ సింహాసనంపై కూర్చున్న […]
ఈసారి ప్రచారం లేదు.. పర్యవేక్షణే..!
ఈనెల 30వ తేదీన జరిగే హుజూరాబాద్ ఉప ఎన్నికలకు ముఖ్యమంత్రి ప్రచాయం చేయకపోవచ్చు. ఆయన ప్రచారం చేయకపోయినా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తారు. ముఖ్యంగా కుమారుడు కేటీఆర్ ను రంగంలోకి దించే అవకాశముంది. దాదాపు ప్రతి ఎన్నికల్లోనూ ముఖ్యమంత్రి బహిరంగ సభల్లో పాల్గొని ప్రచారాన్ని పీక్ స్థాయికి తీసుకెళతారు. అయితే హుజూరాబాద్ లో మాత్రం అడుగుపెట్టకపోవచ్చని తెలుస్తోంది. కారణం ఎన్నికల కమిషన్.. కోవిడ్ కారణంగా వెయ్యి మందికి మించి ఎన్నికల బహిరంగ సభకు హాజరు కాకూడదని […]