ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీకి బాగానే పట్టుంది.. పార్టీ హైకమాండుకు ఉత్తర దేశంపై దిగులు లేదు. బాధంతా దక్షిణాదిపైనే.. అరె.. ఈ ప్రాంతంలో పార్టీని అధికారంలోకి తెద్దామంటే కుదరడం లేదు. ఒక్క కర్ణాటకలోనే సాధ్యమైంది. తమిళనాడులో అస్సలు దగ్గరకు రానీయారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో అయినా పార్టీ పరువు నిలుపుకుందామనేది పెద్దల ఆలోచన. తెలంగాణలో కాస్తో..కూస్తో పార్టీ బండి లాగుతోంది. ఏపీలోనే పరిస్థితి మరీ అధ్వానంగా తయారైంది. అధికార పక్షాన్ని ఇరుకునపెట్టే ప్రయత్నాలు నాయకులు అస్సలు చేయడం లేదని […]
Tag: bjp
కారులో ఇమడలేకపోతున్న డీఎస్!
ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్).. ఉమ్మడి ఏపీలో రాజకీయాల్లో చురుగ్గా ఉన్న వ్యక్తి.. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం.. హస్తం పార్టీకి తెలంగాణలో పెద్దగా ఆదరణ లేకపోవడంతో డీఎస్ కారు పార్టీ ఎక్కాడు. ఆయనకున్న ఇమేజిని ద్రుష్టిలో పెట్టుకున్న కేసీఆర్ రాజ్యసభకు పంపాడు. అయితే ఎందుకో రెండు, మూడేళ్లుగా ఆయన గులాబీ పార్టీలో అయిష్టంగానే ఉన్నాడు. ఉమ్మడి ఏపీలో ఆయన హవానే వేరు.. వైఎస్, డీఎస్ అప్పట్లో కాంగ్రెస్ పార్టీని శాసించారని కూడా రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. […]
నాడొక మాట.. నేడొక మాట.. దటీజ్ బాబు
40 ఏళ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబు నాయుడు ఎందుకో ప్రజల విశ్వాసం పొందలేకపోయాడు. ఎన్నికల్లో గెలిచాడు.. సీఎంగా చేశాడు అనే విషయాలు పక్కన పెడితే అప్పట్లో ప్రత్యామ్నాయం ప్రజలకు లేకపోయింది కాబట్టి సీఎం సీటులో కూర్చున్నాడు. అంతే.. ఆయనకేం పెద్ద ఫాలోయింగ్ లేదు..కనుసైగ చేస్తే కదలి వచ్చే కార్యకర్తలు లేరు.. ఎందుకంటే ఆయన ఎప్పుడూ ఒక మాట మీద ఉండడు.. ఒకరిని నమ్మడు.. అందుకే ఆయన పరిస్థితి ఇపుడలా తయారైంది. ఈ మాజీ సీఎం శనివారం (ఈరోజు) […]
డిపాజిట్లే రాలేదు.. అధికారం సాధ్యమా?
తెలంగాణలో 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ నాయకులు ఉవ్విళ్లూరుతున్నారు. ఇదే మాట పదే పదే మీడియాతోపాటు సభలు, సమావేశాల్లో చెబుతున్నారు. ఇంకా ముందుకు వెళ్లి హైకమాండ్‌తో కూడా ఇవే ముచ్చట్లు చెబుతున్నారు. ముగ్గురు ఎమ్మెల్యే సీట్లు, నాలుగు ఎంపీ సీట్లు, జీహెచ్‌ఎంసీలో 48 కార్పొరేటర్ల సీట్లను గెలుచుకుంది. అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ను కాదని మనపార్టీ సభ్యులు విజయం సాధించారు. భవిష్యత్తులో ఇంకా కష్టపడితే అధికార పీఠంపై కూర్చోవచ్చు అనేది స్థానిక బండి […]
ఇదేం చోద్యం.. మా పథకాలకు మీపేర్లేంటి?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ పార్టీకి చెందిన నాయకుల పేర్లు సంక్షేమ పథకాలకు పెట్టడం సాధారణమే. అనేక సంవత్సరాలుగా ఈ సంస్కృతి కొనసాగుతోంది. చంద్రబాబు సీఎంగా ఉన్నపుడు చంద్రన్న బీమా, పసుపు..కుంకుమ లాంటి పథకాలు ప్రవేశపెడితే వైఎస్‌ఆర్ అధికారంలో ఉన్నపుడు రాజీవ్ గృహకల్ప, ఇందిరమ్మ ఇళ్లు లాంటి పేర్లుపెట్టారు. ఇప్పుడు వైఎస్‌పీ అధికారంలో ఉంది. అందుకే అక్కడ వైఎస్‌ఆర్‌పేరు లేదా జగన్ పేరుతో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. దాదాపు అన్ని పథకాలు ఈ […]
మోదీని కలవాలనుంది…!
ఏపీ ప్రతిపక్ష నాయకుడు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బీజేపీ అధిష్టానానికి దగ్గర కావాలనుకుంటున్నాడా? వచ్చే ఎన్నికల్లో కమలం పార్టీతో కలిసి ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉన్నాడా?.. ఇటీవల జరుగుతున్న పరిణామాలను గమనిస్తే అవుననే సమాధానం చెబుతున్నారు రాజకీయ పరిశీలకులు. ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత తెలుగుదేశం పార్టీ తన ప్రాభవం కోల్పోయిందనే చెప్పవచ్చు. పలువురు నాయకులు తెలుగుదేశం నుంచి బీజేపీ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. జగన్ పార్టీ పవర్‌లోకి వచ్చిన […]
తెలంగాణాలో టీఆర్‌ఎస్ విత్ పీకే పాలిటిక్స్
తెలంగాణలో వరుసగా రెండుసార్లు అధికార పీఠంపై కేసీఆర్.. ముచ్చటగా మూడోసారి కూడా ప్రగతి భవన్ నుంచి చక్రం తిప్పాలని కారు పార్టీ అధినేత భావిస్తున్నారు..ఎన్నికలకు ఉన్నది కేవలం 18 నెలలే.. ప్రభుత్వ వ్యతిరేకత మొదలైందేమోనన్న అనుమానం అధినేతను వేధిస్తోంది.దీనికి తోడు పార్టీ నుంచి బయటకు వెళ్లిన ఈటల రాజేందర్ బీజేపీలో చేరి హుజూరాబాద్‌లో విజయం సాధించారు. అంతకుముందు దుబ్బాక, ఇపుడు హుజూరాబాద్ ఎన్నికల్లో కమలం అభ్యర్థులు గెలిచారు. బీజేపీ రాష్ట్రంలో వాయిస్‌పెంచుతోంది. ముఖ్యంగా వరి కొనుగోలు వ్యవహారంలో […]
యూపీలో ‘పవర్’ పాలిటిక్స్
ఉత్తర ప్రదేశ్‌లో 2017లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ఎవ్వరూ ఊహించని విధంగా యోగీ ఆదిత్యనాథ్ సీఎం అయ్యారు. మోదీ, అమిత్ ఆశించినట్లే యోగి యూపీలో చక్రం తిప్పుతున్నాడు. వచ్చే సంవత్సరం యూపీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. అధికార పీఠం కోసం అధికారపార్టీతోపాటు కాంగ్రెస్ పార్టీ కూడా పక్కా ప్లాన్ రూపొందించుకుంది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ యూపీకి పలుసార్లు వెళ్లి వచ్చారు. అధికార కార్యక్రమాలే అయినా పార్టీ శ్రేణుల్లో ఆయన పర్యటన జోష్ […]
కేసీఆర్ వైపు చూపిస్తున్న కిషన్ వేలు
నేను ఆయనను కలవాలని చాలా సార్లు ప్రయత్నించా.. అయినా అపాయింట్ మెంట్ ఇవ్వలేదు.. నేను కేంద్ర మంత్రి కావడం ఆయనకు ఇష్టం లేదేమో.. అందుకే కలవడానికి అవకాశం ఇవ్వలేదేమో.. అని కేంద్ర కేబినెట్ మంత్రి, టీ.బీజేపీ సీనియర్ నాయకుడు కిషన్ రెడ్డి సీఎం కేసీఆర్ నుద్దేశించి పేర్కొన్నారు. వరి కొనుగోలు వ్యవహారం తెలంగాణలో రైతులకేమో గానీ పార్టీల మధ్య వేడిపుట్టింది. ఓ వైపు రైతులు ప్రాణాలు కోల్పోతుంటే.. కారు, కమలం పార్టీలు మాత్రం రాజకీయ గొడవలకు దిగుతున్నారు. […]