తారక్‌కు టైమ్ ఉంది…!

రెండు తెలుగు రాష్ట్రాల్లో జూనియర్ ఎన్టీఆర్-కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాల భేటీపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే. కేవలం సినిమాలో నటన నచ్చి ఎన్టీఆర్‌ని షా కలవలేదని, రాజకీయంగా ఉపయోగించుకోవడం కోసమే కలిశారని ప్రచారం జరుగుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీని బలోపేతం చేసుకోవడం కోసం ఎన్టీఆర్‌ని కలిశారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే కేవలం సినిమాలో నటన నచ్చి అభినందించడానికే షా..ఎన్టీఆర్‌ని కలిశారని ఇందులో వేరే రాజకీయ కోణం లేదని బీజేపీ, టీడీపీ […]

రామోజీ – షా భేటీ వెన‌క టాప్ సీక్రెట్‌… ఇంత స్కెచ్ వేస్తున్నారా…!

తాజాగా జ‌రిగిన రాజ‌కీయ ప‌రిణామాలు.. అనేక విశ్లేష‌ణ‌ల‌కు దారితీస్తోంది. రాజ‌కీయాల‌కు కేరాఫ్‌గా.. మేధా విగా.. టీడీపీని వెనుక నుంచి న‌డిపిస్తున్న మీడియా మొఘ‌ల్‌గా.. పేరున్న రామోజీరావుతో .. బీజేపీ అగ్ర నాయ‌కుడు.. కేంద్ర మంత్రి అమిత్ షా భేటీ కావ‌డం.. అనేక చ‌ర్చ‌ల‌కు దారితీస్తోంది. తెలంగాణ ప‌ర్య‌టన కు వ‌చ్చిన షా.. అనూహ్యంగా రామోజీతో భేటీ అయ్యారు. వాస్త‌వానికి.. రాష్ట్ర బీజేపీ నాయ‌కులు ఎప్పుడూ.. ఇలాంటి సూచ‌న‌లు చేయ‌లేదు. అయితే.. కేంద్రంలో నిన్న మొన్న‌టి వ‌ర‌కు కీల‌క […]

జూ.ఎన్టీఆర్ బీజేపీ లో చేరనున్నారా??

జూ.ఎన్టీఆర్, తెలుగు సినిమా ఇండస్ట్రీలో పరిచయం అవసరం లేని పేరు. ఇటీవల ఆయన నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా లో నటన కి గాను చాలా ప్రసంశలు అందుకున్నారు ..అయితే మునుగోడు ఉప ఎన్నికల నేపధ్యంలో బహిరంగ సభలో పాల్గొనేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ వచ్చారు.. ఎంతో బిజీ షెడ్యూల్ అయినప్పటికి బీజేపీ నేతలు జూనియర్ ఎన్టీఆర్ ని అమిత షాతో డిన్నర్ కి ఆహ్వానించారు..RRR లో జూనియర్ ఎన్టీఆర్ నటనకు అమిత్ షా జూ.ఎన్టీఆర్ […]

షా ఎఫెక్ట్: తారక్ కోసం బాబు..?

ఏదేమైనా గాని కేంద్ర మంత్రి అమిత్ షా…జూనియర్ ఎన్టీఆర్‌తో భేటీ అవ్వడం అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో తెలంగాణకు వచ్చిన అమిత్ షా అనూహ్యంగా తన షెడ్యూల్‌ని మార్చుకుని ఎన్టీఆర్‌తో భేటీ అవ్వడం చర్చనీయాంశమైంది. మునుగోడు సభకు వెళ్లకముందే…ఎన్టీఆర్‌ని డిన్నర్‌కు ఆహ్వానించారనే వార్తా….మీడియాలో హల్చల్ చేసింది. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలో ఎన్టీఆర్ నటనకు ఫిదా అయ్యి…అమిత్ షా…ఎన్టీఆర్‌తో భేటీ అవ్వాలని డిసైడ్ అయ్యారని కథనాలు వచ్చాయి. అదే సమయంలో రాజకీయ పరమైన […]

మోదీతో బాబు…సెట్ అయినట్లేనా?

2019 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయి ప్రతిపక్షానికి పరిమితమైన దగ్గర నుంచి చంద్రబాబు..బీజేపీకి దగ్గరవ్వాలనే ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఎన్నికల ముందు వరకు బాబు ఒక ధోరణిలో ముందుకెళ్లగా…ఎన్నికల తర్వాత మరొక వర్షన్..అసలు ఎన్నికల ముందు చంద్రబాబు…కేంద్రంలోని మోదీ సర్కార్ పై ఏ స్థాయిలో పోరాటం చేశారో అందరికీ తెలిసిందే. రాష్ట్రానికి కేంద్రం సాయం అందించడం లేదని చెప్పి…బీజేపీ పొత్తు నుంచి బయటకొచ్చి..ప్రత్యేక హోదాపై పోరాటం చేశారు. అలాగే మోదీ, అమిత్ షాలపై తీవ్ర విమర్శలు చేశారు. […]

ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షుడి రేసులో వీళ్లే!

సోమువీర్రాజు.. చాలా పంతం పట్టి మరీ.. ఏపీ బీజేపీ పగ్గాలను అందింపుచ్చుకున్నారు. పార్టీ మీద అలిగి, కోపం వ్యక్తం చేసిన తర్వాత గానీ.. ఆయనకు అధ్యక్ష పీఠం దక్కలేదు. అయితే.. అంత కష్టపడి దక్కించుకున్న పార్టీ పదవికి త్వరలోనే ఎండ్ కార్డు పడబోతోంది. చీప్ లిక్కర్ వ్యవహారం ఆయన పదవికి ఎసరు పెట్టింది. ఇప్పటికే ఆయన మీద గుస్సా అయిన అధిష్ఠానం అనధికారికంగా సంజాయిషీ అడిగినట్టు తెలుస్తోంది. కాగా.. సోము వీర్రాజు పదవీకాలం సుమారుగా మరో ఆరునెలల […]

కమలం.. ఇక కుల సమీకరణలు..

హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఊహించని విజయం.. అసెంబ్లీలో ఇప్పటికే ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు.. రాష్ట్రంలో పట్టు పెంచుకునే యత్నం.. అధికారంలోకి కాకపోయినా కనీసం 30..40 నియోజకవర్గాల్లో విజయం సాధించాలని టీబీజేపీ నాయకులు ప్లాన్ రూపొందిస్తున్నారు. వారికి హై కమాండ్ కూడా ఫుల్ సపోర్టు ఉంది. బండి సంజయ్ దూసుకుపోతున్నాడు. దీంతో పొలిటికల్ లీటర్లు కులసమీకరణలపై ద్రుష్టి సారించారు. ముఖ్యంగా మున్నూరుకాపు, ముదిరాజ్, రెడ్డి, ఎస్టీల ఓట్లు రాబట్టుకునేందుకు, వారి మద్దతు కూడబెట్టేందుకు అడుగులు వేస్తున్నారు. 2023 ఎన్నికలే […]

యూపీలో ‘మూడు’ ముక్కలాట

ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ఉత్తర ప్రదేశ్ పై ప్రత్యేకంగా ద్రుష్టి సారించారు. ఆల్రెడీ అక్కడ బీజేపీ అధికారంలో ఉంది. యోగి ఆదిత్యనాథ్ హైకమాండ్ ఆదేశాల మేరకు పాలన సాగిస్తున్నారు. యోగి పాలనపై పెద్దగా వ్యతిరేకత లేదు.. అయితే సీట్లు మాత్రం తగ్గే అవకాశముందని సర్వేలు చెబుతున్నాయి. దీంతో డిల్లీలోని కమలం గ్యాంగ్ అప్రమత్తం అయింది. అరె.. యూపీలో ఓట్లు తగ్గినా.. అనుకున్న సీట్లు రాకపోయినా.. పొరపాటున అధికారం చేజారినా దేశవ్యాప్తంగా మోదీ పరువు గంగలో కలిసిపోతుందని […]

చెప్పినట్టుగా చెప్పారు.. విన్నట్టుగా విన్నారు..

కొట్టినట్టుగా కొడితే.. ఏడిచినట్టుగా ఏడ్చారనే సామెత ఒకటి తెలుగునాట ఉంది. చిత్తశుద్ధి లేకుండా చేసే పనులకు ఈ సామెత అతికినట్టుగా సరిపోతుంది. తాజాగా ఏపీలో అమరావతి రాజధాని కోసం సాగుతున్న పోరాటానికి భారతీయ జనతా పార్టీ క్రియాశీలంగా అండగా నిలుస్తుందా లేదా అనే సంగతి.. ఈ సామెతకు సరిపోయేలా ఉంది. అమరావతి రాజధాని పోరాటానికి పార్టీ నాయకులంతా మద్దతు ఇచ్చి తీరాల్సిందే అని అమిత్ షా తిరుపతి సమావేశంలో హూంకరించినట్టుగాను, అందరూ అందుకు సమ్మతించినట్టుగానూ వార్తలు వచ్చాయి. […]