ఏపీ సీఎం చంద్రబాబుకు కోప మొచ్చింది! అది అలాంటి ఇలాంటి కోపం కాదు. సొంత పార్టీ ఎమ్యెల్యే పైనే కట్టలు తెగే కోపమొచ్చింది. ఇంకేముంది ఉన్నచోట ఉన్నట్టుగానే ఫైరైపోయారు. సదరు ఎమ్మెల్యను చడామడా తిట్టిపోశారు. దీంతో ఆ ఎమ్మెల్యేకి గిర్రున నీళ్లు తిరగినంత పనైందట! దీంతో ఎన్నడూ తన జీవితం క్షమించమని ఎవ్వరినీ అడగనివాడు.. సీఎంను పట్టుకుని క్షమించమని అడగడంతోపాటు ఫ్యూచర్‌లో ఇలా జరగకుండా చూస్తానంటూ ఎక్స్‌ప్లెయిన్ కూడా చేశారట. పోనీ.. ఆ ఎమ్మెల్యే ఏమన్నా.. ఆషామాషీనా […]
Category: Politics
నైజాం సినీ మార్కెట్‌ను శాసిస్తోన్న కేటీఆర్ వైఫ్
సినిమా నటుల్లోనే కాదు.. సినిమాకు సంబంధించిన అన్ని వ్యాపారాల్లోనూ మొదటినుంచీ ఆంధ్ర ప్రాంతం వారిదే ఆధిపత్యం.. ఆంధ్ర, సీడెడ్, నైజాం ప్రాంతాలన్నింటా వీరిదే హవా.. నైజాంకు సంబంధించి దిల్ రాజు వంటి వేళ్లమీద లెక్కించదగ్గ కొందరు కొన్నేళ్లుగా వెలుగులోకి వచ్చి సక్సెస్‌ఫుల్ నిర్మాతలుగాను, పంపిణీ రంగంలోనూ, ఎగ్జిబిటర్లుగానూ రాణిస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి మారుతోంది. ఇపుడు తాజాగా సినిమా పంపిణీ రంగంలో నైజాం మార్కెట్లో ఆ నలుగురికి చెక్ పెడుతున్న సంస్థగా అభిషేక్ పిక్చర్స్ పేరు […]
కడప గడపలో జగన్ పట్టు సడలుతోందిగా..
కడప జిల్లా అంటే వైసీపీకి పెట్టని కోట.. నిజానికి గత ఎన్నికలకు ముందు అక్కడ టీడీపీ సమర్థులకోసం కాగడా పెట్టి వెదికి మరీ ఎమ్మెల్యే టిక్కెట్లు ఇచ్చింది. అయినా అసెంబ్లీ ఫలితాలు మాత్రం జిల్లా వరకు వైసీపీకి అనుకూలంగా ఏకపక్షంగా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ జిల్లాపై వైఎస్ కుటుంబానికి ఉన్న పట్టు అలాంటిది మరి. కాంగ్రెస్ సంప్రదాయ ఓటు బ్యాంకు అంతా రాయలసీమలో ప్రత్యేకించి కడప జిల్లాలో ప్రస్తుతం జగన్ వెంట నడుస్తోంది. రాష్ట్ర రాజకీయాల్లో […]
వావ్, మోడీని పొగిడేసిన రాహుల్
ప్రధానమంత్రిగా రెండేళ్ళ పదవీ కాలంలో నరేంద్రమోడీ చేసిన ఒకే ఒక్క పని ఏంటంటే, పాకిస్తాన్‌పై సర్జికల్ స్ట్రైక్స్‌కి సైన్యాన్ని ముందుకు నడిపించడమేనట. మామూలుగా అయితే రాజకీయాల్లో ఉన్నాక, అధికారంలో ఉన్నవారు ఏ మంచి పని చేసినా, దాన్ని విపక్షాలు హర్షించవు. అయితే ఇది దేశ భద్రతతో కూడుకున్న విషయం. దేశ ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. దాంతో నరేంద్రమోడీకి వ్యతిరేకంగా ఎలాంటి స్టేట్‌మెంట్ ఇవ్వడానికి వీల్లేదు. ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్‌ని సమర్థిస్తున్నాం అని చెప్పి ఊరుకుంటాయి ఇష్టం లేకపోయినాసరే […]
టీడీపీ, టీఆర్ఎస్‌ను మోడీ కావాలనే టార్గెట్ చేస్తున్నారా
కేంద్ర ప్రభుత్వాలకు రాష్ట్ర ప్రభుత్వాలను టార్గెట్ చేయడం కొత్తకాదు! తమకు నచ్చని ప్రభుత్వాలను, తమకు ప్రత్యర్థిగా ఉన్న పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాలను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించడం కేంద్రంలోని పాలకులకు తేలికైన విద్య.! ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ పెట్టింది పేరు! ఈ పార్టీకి నచ్చని పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలపై పెత్తనం చేయడం, ఇబ్బందులు పెట్టడం కాంగ్రెస్ పాలకుల నైజం. ఈ క్రమంలో కాంగ్రెస్ సీబీఐని ఇష్టానుసారంగా ప్రయోగించేదని ప్రచారంల ఉందేది. ఇక, […]
చంద్రబాబు భజన మీడియాకే బోర్ కొట్టిస్తున్నారా
ఏపీ సీఎం చంద్రబాబుకు, ఆయన పార్టీ టీడీపీకి లాయల్‌గా ఉన్న మీడియాలో ఆంధ్రజ్యోతి ముఖ్యమైంది. పాత ఆంధ్రజ్యోతి పత్రికను కొనుగోలు చేయడానికి ముందు నుంచి ప్రస్తుత ఆంధ్రజ్యోతి ఎండీ టీడీపీకి అనుకూలంగానే ఉండేవారు. ఈ క్రమంలోనే ఆయన హైదరాబాద్‌లోని జర్నలిస్టు కాలనీలో స్థలాలు, రాయితీలు కూడా పొందారు. ముఖ్యంగా ఆయన ఓల్డ్ ఆంధ్రజ్యోతిని కొనేందుకు చంద్రబాబే మీడియేటర్‌గా ఉన్నారనేది ఒకప్పటి టాక్. అంతేకాదు, డబ్బుల విషయంలోనూ ఆయన సాయం చేశారని అంటారు అప్పటి ప్రముఖ జర్నలిస్టులు. దీంతో […]
కేసీఆర్ వాళ్ల పని పడతారట
అవును. నిజమే! తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పుడు మంచి ఫైర్ మీదున్నారు. గత నాలుగురోజుల కిందట కురిసిన వర్షాలతో భాగ్యనగరం మునిగిపోయింది. దీంతో ఉమ్మడి రాజధాని ప్రాంతంలోని పలు లోతట్టు ప్రాంతాలు సహా కొన్ని అపార్టు మెంట్లలోకి భారీ ఎత్తున వరద చేసింది. పలు ప్రాంతాల్లో ప్రజలు నిరాశ్రయులయ్యారు. వారి కొద్దిపాటి దుస్తులు, బియ్యం వంటివి నీటికి కొట్టుకుపోయాయి. దీంతో ఆసరాలేక నానాతిప్పలుపడ్డారు. అయితే, అదే సమయంలో కొందరు తాము ఓట్లు వేసి ఎన్నుకున్న కార్పొరేటర్లు ఏం […]
వెంకయ్య చెప్పిన శృంగారం కథలు ఇవే
ఏంటి? ఎంతో బిజీగా క్షణం తీరిక కూడా లేకుండా ఉండే కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు శృంగారం గురించి మాట్లాడడం ఏంటని బుగ్గలు నొక్కుకుంటున్నారా? అంతొద్దు! ఆయన నిజంగానే శృంగారం గురించి పెద్ద ఎత్తున లెక్చర్ దంచేశారు! అయితే, అది ఏ బహిరంగ సభలోనో, ఎన్నికల ప్రచార ర్యాలీలోనోకాదు. రామోజీ ఫిలింసిటీలో జరిగిన ఇండీవుడ్ ఫిలిం ఫంక్షన్‌లో! రామోజీ ఫిలిం సిటీలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ఇండీవుడ్ కార్నివాల్ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ఉత్సవాల్లో భాగంగా ఈనాడు సంస్థల […]
ఏపీలో వెన్నుపోటు బ్రదర్స్ ఎవరో తెలుసా..
వైకాపా ఎమ్మెల్యే, ఫైర్ బ్రాండ్ రోజా.. ఉరఫ్ రోజమ్మ.. మరోసారి ఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ఫైరైపోయారు. పనిలోపనిగా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుపైనా నిప్పులు చెరిగారు. ప్రత్యేక హోదాను ఏపీకి ఇవ్వకపోగా ప్యాకేజీపై పోటా పోటీ స్టోరీలు చెబుతున్నారని ఆమె విరుచుకుపడ్డారు. వాస్తవానికి నిన్నమొన్నటి వరకు ఏపీ సీఎం చంద్రబాబునే టార్గెట్ చేసిన రోజా.. తాజాగా ప్యాకేజీ వచ్చిన తర్వాత నుంచి వెంకయ్యను కూడా అప్పుడప్పుడు టార్గెట్ చేస్తూ వచ్చారు. అయితే, తాజాగా మాత్రం మరింతగా ఇద్దరిపైనా […]