నాడొక మాట.. నేడొక మాట.. దటీజ్ బాబు

40 ఏళ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబు నాయుడు ఎందుకో ప్రజల విశ్వాసం పొందలేకపోయాడు. ఎన్నికల్లో గెలిచాడు.. సీఎంగా చేశాడు అనే విషయాలు పక్కన పెడితే అప్పట్లో ప్రత్యామ్నాయం ప్రజలకు లేకపోయింది కాబట్టి సీఎం సీటులో కూర్చున్నాడు. అంతే.. ఆయనకేం పెద్ద ఫాలోయింగ్ లేదు..కనుసైగ చేస్తే కదలి వచ్చే కార్యకర్తలు లేరు.. ఎందుకంటే ఆయన ఎప్పుడూ ఒక మాట మీద ఉండడు.. ఒకరిని నమ్మడు.. అందుకే ఆయన పరిస్థితి ఇపుడలా తయారైంది. ఈ మాజీ సీఎం శనివారం (ఈరోజు) […]

తలపట్టుకుంటున్న రేవంత్

తెలుగుదేశం పార్టీలో ఉండి.. చంద్రబాబు అనుచరుడిగా ఎదిగి.. ఆ తరువాత ఓటుకు నోటు కేసులో ఇరుక్కొని.. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరి.. తన వాగ్ధాటితో రాహుల్ గాంధీని మెప్పించి తెలంగాణ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన రేవంత్ రెడ్డికి పార్టీలో ఇంకా ఫుల్ సపోర్టు లభించలేదు. సరికదా నాయకులు కూడా ఎక్కడికక్కడ ఇబ్బందులు పెడుతున్నారు. అయినా సరే.. రేవంత్ అందరినీ కలుపుకొని పోతూ పార్టీని ముందుకు లాగుతున్నాడు. సభలు, సమావేశాలు, మీడియా మీటింగ్స్ నిర్వహిస్తూ కేసీఆర్ ను విమర్శిస్తున్నాడు. […]

ఆ రెండు యూనియన్లే కీలకం అంతే..

తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ సంఘాల యూనియన్లు అనేకమున్నాయి. తమ సమస్యల పరిష్కారానికి అన్ని సంఘాలు పోరాటాలు చేస్తున్నాయి. అయితే ప్రభుత్వంతో చర్చలు జరిపే సమయోం మాత్రం కేవలం రెండే రెండు యూనియన్ల పేర్లు బయటకు వస్తాయి. సర్కారు కూడా వారితోనే చర్చలు జరుపుతుంది. మరే సంఘంతోనూ చర్చలు జరిపినట్లు కనిపించడం లేదు. ఆ రెండు సంఘాలు ఏవంటే.. ఒకటి టీజీఓ (తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్), మరొకటి టీఎన్జీఓ (తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్). ఉద్యగులకు […]

కారెక్కనున్న మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే?

రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. అస్మదీయులు.. తస్మదీయులుగా మారవచ్చు.. తస్మదీయులు అస్మదీయులుగా మారవచ్చు. ఎందుకంటే అది కూడా ఓ ఆటలాంటిదే. ఐపీఎల్ కూ, పాలిటిక్స్ కూ పెద్ద తేడా ఉండదు. ఎందుకంటే ఎవరు ఎప్పుడు ఏ పార్టీలోఉంటారో తెలియదు. ఐపీఎల్ లో కూడా ఏ ప్లేయర్ ఏ టీమ్ లోఉంటాడో అర్థం కాదు. ఇపుడు తెలంగాణలో మరో పుకారు షికారు చేస్తోంది. మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గురువారం ప్రగతి భవన్ లో […]

రావత్ స్థానంలో వచ్చేదెవరో?

భారత రక్షణ రంగంలో బిపిన్ రావత్ ఓ స్పెషల్.. అటువంటి మహావ్యక్తి.. దేశం కోసం సర్వస్వాన్ని అర్పించిన వ్యక్తి.. యువతలో నిత్యం స్ఫూర్తి నింపే నిత్య సైనికుడు ఉన్నట్టుండి అద్రుశ్యమయ్యారు. ఆయన మరణాన్ని యావద్భారతం జీర్ణించుకోలేకపోతోంది. ఇది కల అయితే బాగుండు అని చాలా మంది అనుకుంటున్నారు. అయినా.. దురద్రుష్టం.. విధి ఆయనను వెంటాడి బలితీసుకుంది. చివరి క్షణం వరకూ దేశం కోసం తపిస్తూనే కన్నుమూశారు. రావత్ మరణంతో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) స్థానాన్ని […]

చంద్రబాబుకు నిద్రలేని రాత్రులు

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇపుడు రాజకీయంగా గడ్డుకాలం ఎదుర్కొంటున్నాడనే చెప్పవచ్చు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి జగన్ కు సీఎం పీఠం అప్పగించిన చంద్రబాబు .. ఆ తరువాత రాష్ట్రంలో జరిగే ప్రతి ఎన్నికల్లోనూ తమ పార్టీ ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రాంతాలను వైసీపీకి కోల్పోయాడు. సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీదే హవా అయింది. సరే.. వారు అధికారంలోఉన్నారు.. కాబట్టి వైసీపీదే పైచేయి అవుతుందని అనుకోవచ్చు. మరి టీడీపీ కంచుకోటలు వైసీపీ దెబ్బకు బద్దలవుతున్నాయంటే టీడీపీ […]

కారు పార్టీలో ‘స్మార్ట్‘ భయం!

ల్యాండ్ ఫోన్.. బేసిక్ ఫోన్ ఉన్నపుడే అందరూ ప్రశాంతంగా ఉండేవాళ్లు..ఒక్కరి విషయాలు ఒకరికి మాట్లాడితే తప్ప తెలిసేది కాదు.. కానీ స్మార్ట్ ఫోన్ వచ్చిన తరువాత ఆ పరిస్థితి లేదు.. ప్రైవసీ అసలే లేదు.. స్మార్ట్ ఫోన్ మన మనసుల్లోకి తొంగి చూస్తోంది.. ఎప్పుడేం మాట్లాడినా కనిపెట్టేస్తోంది..కనిపెట్టడమే కాదు ఇతరుల చెవుల్లోకి దూరిపోతోంది.. అందుకే స్మార్ట్ ఫోన్ లో మాట్లాడాలంటేనే భయం.. పర్సనల్ విషయాలు అస్సలు మాట్లాడే పరిస్తితి లేదు.. ఎందుకంటే రికార్డింగ్ సౌకర్యం అందులో ఉండటంతో […]

రోజులు అసలే బాగాలేవు..అలా అంటే ఎలా సార్.. !

కరోనా మొదటి దశ.. రెండో దశ అయిపోయింది.. ఇపుడు ఒమిక్రాన్ అంటున్నారు.. దేశంలో పలు చోట్ల కేసులు కూడా నమోదవుతున్నాయి.. జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు చెబుతున్నారు..మాస్కు తప్పనిసరి.. గ్రూపులుగా ఉండొద్దని కోవిడ్ నిబంధనలు చెబుతున్నాయి..ఈ నేపథ్యంలో ఏపీ సర్కారు తీసుకున్న ఓ నిర్ణయం విద్యార్థుల తల్లిదండ్రలును ఇబ్బందులకు గురిచేస్తోంది. పిల్లలకు కచ్చితంగా 75 శాతం హాజరు ఉండాల్సిందే అని నిబంధన పెట్టింది. అలా అటెండెన్స్ ఉన్న స్టూడెంట్స్ కే అమ్మ ఒడి పథకం వర్తిస్తుందని చెబుతోంది. […]

పీఆర్సీ ఎపిసోడ్ లో ఊహించని ట్విస్ట్ ఇచ్చిన జగన్

ఏపీలో ఉద్యోగులు అనేక రోజులుగా పే రివిజన్ స్కేల్ (పీఆర్సీ) కోసం ఎదురు చూస్తున్నారు.. దీంతో వారు నిరసన బాట పట్టారు. ఈ క్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమ్మె నోటీసు కూడా ఇచ్చారు.. పీఆర్సీ ఇవ్వకపోతే విడతల వారిగా సమ్మె చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.. సీన్ కట్ చేస్తే సీఎం జగన్ తిరుపతిలో మాట్లాడుతూ.. పది రోజుల్లో పీఆర్సీ ఇచ్చేస్తామని ప్రకటించారు. జేఏసీ నాయకులకు షాక్.. ఇదేంటి మేము సమ్మె చేస్తామని చెబితే పీఆర్సీ ఇచ్చేశారు […]