బొబ్బిలిలో సైకిల్ జోరు..30 ఏళ్ల తర్వాత ఛాన్స్.!

ఉమ్మడి విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం..కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. 2014 వరకు అక్కడ కాంగ్రెస్ హవా నడిచింది. ఇక 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ గెలుస్తూ వస్తుంది. అయితే ఇక్కడ టీడీపీకి పెద్దగా గెలిచిన సందర్భాలు తక్కువ. 1983, 1985, 1994 ఎన్నికల్లోనే టీడీపీ అక్కడ గెలిచింది. ఇంకా అంతే మళ్ళీ అక్కడ టీడీపీ గెలవలేదు. 1999, 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా ఓడిపోయింది. ఇక ఎప్పుడో 1994లో గెలిచిన టీడీపీకి మళ్ళీ 2024 […]

బాలయ్యతో పవన్..అసలు గేమ్ మొదలైందా?

ఏపీలో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. మునుపెన్నడూ చూడని విధంగా రాజకీయం నడుస్తోంది. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలు తమదైన శైలిలో ముందుకెళుతున్నాయి. అధికార వైసీపీకి చెక్ పెట్టడానికి వ్యూహాత్మక ఎత్తుగడలతో వెళుతున్నాయి. పొత్తుపై క్లారిటీ ఇవ్వడం లేదు గాని..చంద్రబాబు-పవన్ మాత్రం పరోక్షంగా పొత్తు దిశగానే ముందుకెళుతున్నారు. ఈ పొత్తు అంశాన్ని ఎన్నికల ముందే తేలుస్తారని తెలుస్తోంది. అంటే వైసీపీకి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా ప్రతిపక్షాలు ఊహించని విధంగా రాజకీయం చేస్తున్నాయి. ఇప్పటికే బాబు వెళ్ళి పవన్‌ని […]

టీపీసీసీ మార్పు..రేవంత్‌కు ఎసరు..దిగ్విజయ్ తేల్చేశారు.!

ఎప్పుడైతే రేవంత్ రెడ్డి టి‌పి‌సి‌సి అధ్యక్షుడు అయ్యారో అప్పటినుంచి…కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు తారస్థాయిలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ప్రత్యర్ధులపై ఫైట్ చేయాల్సిన నేతలు..సొంత పార్టీలోని నేతలపై ఫైట్ చేయడం, విమర్శలు చేయడం చేస్తున్నారు. కాంగ్రెస్ లో రేవంత్ వర్గం వర్సెస్ సీనియర్లు అన్నట్లు రాజకీయం మారిపోయింది. పైగా ఇటీవల పి‌సి‌సి పదవుల పంపకాల విషయంలో పెద్ద రచ్చ నడిచింది. సీనియర్లని పట్టించుకోకుండా పదవులని భర్తీ చేశారని, టీడీపీ నుంచి వచ్చిన వారికే పదవులు ఎక్కువ ఇచ్చారని, […]

జనసేనతో పొత్తు..తెనాలి సీటు నాదెండ్లకే..ఆలపాటి క్లారిటీ.!

వచ్చే ఎన్నికల్లో జనసేనతో పొత్తుపై కొంతమంది తెలుగు తమ్ముళ్ళకు నిదానంగా క్లారిటీ వస్తుంది. పొత్తు ఉంటేనే గట్టెక్కుతామనే భావన..అటు టీడీపీలోగానీ, ఇటు జనసేనలో గాని ఉందని చెప్పవచ్చు. పొత్తు లేకపోతే ఓట్లు చీలిపోయి మళ్ళీ వైసీపీకే లబ్ది జరిగేలా ఉంది. అందుకే పవన్ పదే పదే వైసీపీ వ్యతిరేక ఓట్లని చీల్చనివ్వను అంటున్నారు. ఇటు చంద్రబాబు కలిసి పనిచేద్దామని అంటున్నారు. మొత్తానికి అధికారికంగా పొత్తు విషయం క్లారిటీ లేదు గాని..అనధికారంగా చంద్రబాబు-పవన్ కలిసి పనిచేయడానికి నిర్ణయించుకున్నారని అర్ధమవుతుంది. […]

ఎలమంచిలిలో ట్విస్ట్..సీటు వాళ్ళకే ఇవ్వాలంటున్న ఎమ్మెల్యే.!

వచ్చే ఎన్నికల్లో పనితీరు బాగోని ఎమ్మెల్యేలకు సీటు ఇచ్చే ప్రసక్తి లేదని జగన్ తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. దీంతో కొంతమంది ఎమ్మెల్యేలు స్వతహాగానే సీటుపై ఆశలు వదులుకుంటున్నారు. ఎందుకంటే వారిపై ప్రజా వ్యతిరేకత పెరిగిందనే విషయం అర్ధమైనట్లు కనిపిస్తోంది. అందుకే సీటు విషయంలో ఇప్పుడు కొత్త మెలికలు పెడుతున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలోని ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబురాజు కూడా..అదే తరహాలో సీటు విషయంలో కొత్త మెలిక పెడుతున్నారు. ప్రస్తుతం ఎలమంచిలిలో ఎమ్మెల్యే కన్నబాబురాజుపై ప్రజా వ్యతిరేకత […]

బిగ్ డౌట్‌: ఈ టాప్ లీడ‌ర్లు వైసీపీలో ఉన్నారా… లేరా… !

ఏపీ అధికార పార్టీ వైసీపీలో ఉన్నామ‌ని కొంద‌రు నాయ‌కులు అంటున్నా వాస్త‌వంగా చూస్తే అస‌లు వాళ్లు పార్టీలో ఉన్నారా ? అన్న సందేహలు క‌లుగుతున్నాయి. రీసెంట్‌గా మాజీ మంత్రి, సీఎం జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప‌కే చెందిన డీఎల్ ర‌వీంద్రారెడ్డి తాను వైసీపీలో ఉన్నాన‌ని చెబుతున్నారు. అయితే ఆయ‌న జ‌గ‌న్ పై విమర్శ‌లు చేశాక ఆ పార్టీ నేత‌లు ఎవ్వ‌రూ కూడా ఆయ‌న మా పార్టీ నాయ‌కుడే అని ఎక్క‌డా ప్ర‌స్తావించ‌లేదు. అయితే డీఎల్ మాత్రం తాను […]

టీడీపీని డిఫెన్స్‌లో ప‌డేసిన కీల‌క ఎన్నిక‌..!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీకి భారీ షాక్ త‌గిలింది. ఇది ప్ర‌త్య‌క్షంగా కాదు.. ప‌రోక్షంగానే! అయినా కూడా.. భారీ దెబ్బేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే.. ఏపీలో స‌చివాల‌య ఉద్యోగుల సంఘం ఎన్నిక‌లు జ‌రిగాయి. ఈ ఫలితాలు.. తాజాగా విడుద‌ల‌య్యాయి. ఈ ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ వెంక‌ట్రామిరెడ్డి విజ‌యం ద‌క్కించుకున్నారు. అయితే.. ఈయ‌న‌కు వైసీపీ సానుభూతిప‌రుడుగా పేరుంది. పైగా.. సీఎం జ‌గ‌న్ సొంత జిల్లాకుచెందిన వ్య‌క్తి. అంతేకాదు.. అవ‌కాశం వ‌చ్చిన ప్ర‌తిసారీప్ర‌భుత్వాన్ని ప్ర‌శంస‌ల‌తో నింపేసేవారు. సో.. ఈయ‌న […]

టీడీపీలోకి వసంత..దేవినేనికి అదే టెన్షన్.?

ఉమ్మడి కృష్ణా జిల్లాలోని మైలవరం నియోజకవర్గంలో రాజకీయాలు ఆసక్తికరంగా మారిపోయాయి. ఇక్కడ వైసీపీ-టీడీపీల మధ్య రాజకీయ యుద్ధం నడుస్తోంది. అదే సమయంలో రెండు పార్టీల్లో అంతర్గత యుద్ధం కూడా నడుస్తోంది. వైసీపీలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్..మంత్రి జోగి రమేష్ వర్గాల మధ్య రచ్చ నడుస్తోంది. అటు టీడీపీలో మాజీ మంత్రి దేవినేని ఉమా, టీడీపీ నేత బొమ్మసాని సుబ్బారావుల మధ్య పోరు నడుస్తోంది. పెడన నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న జోగి..వచ్చే ఎన్నికల్లో తన సొంత స్థానమైన మైలవరం […]

రాజాంలో బాబు: మధ్యలో వెళ్ళిపోయిన ప్రతిభా..కొండ్రుకే ఛాన్స్.!

రాజాం నియోజకవర్గంలో ఊహించని ట్విస్ట్ ఎదురైంది. చాలా రోజుల నుంచి టీడీపీకి ఈ సీటు విషయంలో పెద్ద కన్ఫ్యూజన్ ఉన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా చంద్రబాబు టూర్‌తో ఆ కన్ఫ్యూజన్ పోయినట్లే కనిపిస్తోంది. తాజాగా చంద్రబాబు రాజాంతో ఇదేం ఖర్మ కార్యక్రమంలో భాగంగా పర్యటించారు. రోడ్ షోలు నిర్వహించారు. ఇక బాబు పర్యటనలకు టీడీపీ శ్రేణుల నుంచి, స్థానిక ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. పొందూరు, రాజాంల్లో రోడ్ షోలకు భారీగా జనం వచ్చారు. […]