ఆంధ్రాలో తెలంగాణ వాదం వ‌దిలేసిన ఎంపీ క‌విత‌..!

తెలంగాణ ప్రాంతీయ వాదం, సాహిత్యాన్ని, క‌ళ‌ల‌ను, సంస్కృతి. సంప్ర‌దాయాల‌ను ప్ర‌జల్లోకి తీసుకెళ్ల‌డంలో కేసీఆర్ కూతురు, ఎంపీ క‌విత ఎప్పుడూ ముందుంటారు. ఏ వేదిక అయినా, ఎక్క‌డ‌యినా ఆమె ఈ అంశాల‌పై అన‌ర్గ‌ళంగా మాట్లాడ‌గ‌ల‌రు. అయితే ఇప్పుడు అమ‌రావ‌తిలో ఏర్పాటుచేసిన జాతీయ మ‌హిళా పార్ల‌మెంటుకు హాజ‌రైన ఆమె.. త‌న ప్ర‌సంగంలో ఎక్క‌డా వాటి జోలికి పోవ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. మ‌రి ఎక్క‌డ‌యినా తెలంగాణ వాదాన్ని భుజాన కెత్తుకునే ఆమె.. ఈసారి అలా చేయ‌క‌పోవ‌డంపై ఇప్పుడు సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. న‌వ్యాంధ్ర రాజధాని […]

టీ టీడీపీలో ముదిరిన ముసలం

తెలంగాణ తెలుగుదేశంలో ముస‌లం ముదిరిపోయింది. నేత‌ల మ‌ధ్య విభేదాలు తార‌స్థాయికి చేరాయి. కొంత‌కాలంగా టీటీడీపీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి తీరుపై  ప్రెసిడెంట్ ఎల్‌.ర‌మ‌ణ తీవ్రంగా అస‌హ‌నానికి గుర‌వుతున్నారు. దీంతో ఆయ‌న సైకిల్ దిగి కారెక్కే సూచ‌న‌లు ఉన్నాయ‌ని పుష్క‌లంగా ఉన్నాయ‌నే ప్ర‌చారం జోరుగా జ‌రుగుతోంది. ఇది ఇప్పుడు నిజం కాబోతోంద‌ట‌. ఇందుకు ముహూర్తం కూడా ఖ‌రారైపోయింద‌ట‌. ముఖ్యంగా టీడీపీ నుంచి టీఆర్ఎస్‌లో చేరిన ఎర్ర‌బెల్లితో ర‌మ‌ణ ప్ర‌త్యేక సంప్ర‌దింపులు జ‌రిపిన నేప‌థ్యంలో గులాబీ ద‌ళంలో క్లారిటీ వ‌చ్చింద‌ట‌. […]

హిందూపురంపై బాబు ఆసక్తి అందుకేనా..

గ‌త వారం రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌హాట్‌గా నిలిచిన హిందూపురం రాజ‌కీయాలు ఒక్క‌సారిగా చ‌ల్ల‌బ‌డిపోయాయి. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు వద్ద‌కు పంచాయితీ చేర‌డంతో అంతా స‌ద్దుమ‌ణిగింది. హిందూపురం ఎమ్మెల్యే, త‌న బావ‌మ‌రిది బాల‌కృష్ణ పీఏ శేఖ‌ర్‌పై వేటు వేయ‌డంతో ప్ర‌స్తుతం నియోజ‌క‌వ‌ర్గంలో ప‌రిస్థితి సాధార‌ణ స్థితికి చేరింది. అయితే ఇది శేఖ‌ర్‌పై వేటు వేయ‌డంతో మొద‌లైన ఈ ప్ర‌యాణంలో ఇంకా చాలామంది బాల‌య్య స‌న్నిహితులు బ‌య‌టికొచ్చే అవ‌కాశ‌ముంద‌ని స‌మాచారం! ముఖ్యంగా సీఎం చంద్ర‌బాబు.. బాల‌య్య నియోజ‌క‌వ‌ర్గంపై ప్ర‌త్యేకంగా దృష్టిసారించిన‌ట్లు స‌మాచారం. […]

పవన్ కు చెక్ చెప్పేలా జగన్ ప్లాన్

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌ధ్య ఆస‌క్తిక‌ర‌మైన పోరు నడుస్తోంది. ఈసారి ఎలాగైనా ప్ర‌జ‌ల మ‌న‌సు గెలుచుకుని అధికారాన్ని సొంతం చేసుకోవాల‌ని ఒక‌రు దృఢ నిశ్చ‌యంతో ఉంటే.. మ‌రొక‌రు త‌మ పార్టీని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లి భావి నాయ‌కుడిగా ఎద‌గాల‌ని భావిస్తున్నారు. ప్ర‌స్తుతం ఇద్ద‌రూ త‌మ త‌మ వ్యూహాల‌తో మునిగితేలుతూ.. బ‌లాన్ని పెంచుకునేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. తాజాగా గుంటూరులో ప‌వ‌న్ ప‌ర్య‌టిస్తుండ‌టంతో.. అంత‌కు ముందుగానే జ‌గ‌న్ అక్క‌డ ప‌ర్య‌టిస్తుండ‌టంతో మ‌రోసారి ఆస‌క్తిక‌ర […]

శశికళకు సోషల్ మీడియాలో చుక్కెదురు

ఒక‌ప‌క్క అన్నాడీఎంకే కార్య‌ద‌ర్శి, జ‌యల‌లిత నెచ్చెలి శ‌శిక‌ళ‌కు మ‌ద్ద‌తు త‌గ్గిపోతూ ఉన్న వేళ‌.. జ‌య న‌మ్మిన‌బంటు ప‌న్నీర్ సెల్వానికి అంత‌కంత‌కూ మ‌ద్ద‌తు పెరుగుతున్న వేళ‌.. సోష‌ల్ మీడియాలో త‌మిళ రాజ‌కీయాల‌పై ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది. ప‌న్నీర్ సెల్వం వేసే ఎత్తుల‌తో శ‌శిక‌ళ వ‌ర్గం ఢీలా ప‌డిపోతోంది. సీఎం పీఠం కోసం జ‌రుగుతున్న పోరులో.. ప‌న్నీర్‌కు ప్ర‌జల మ‌ద్ద‌తుతో పాటు.. నెటిజ‌న్ల మ‌ద్ద‌తు కూడా పెరుగుతోంది. సీఎం అభ్య‌ర్థి ప‌న్నీర్ సెల్వ‌మా లేక శ‌శిక‌ళ‌నా అని నిర్వ‌హించిన స‌ర్వేలో […]

కోదండరాంకి రోజు రోజుకి పెరుగుతున్న క్రేజ్ …!

తెలంగాణ ఉద్య‌మ పోరులో త‌న‌కంటూ ఓ అధ్యాయాన్ని సొంతం చేసుకున్న ఉస్మానియా ప్రొఫెస‌ర్ కోదండ రాం.. ఉద్య‌మ స‌మ‌యంలో మేధావుల‌ను క‌దిలించిన తీరు న‌భూతో.. ! అయితే, నాటి ఉద్య‌మ నేత‌ల్లో చాలా మంది కేసీఆర్ పంచ‌న చేరి ప‌ద‌వుల్లో విలాస జీవితాలు గ‌డుపుతుంటే.. కోదండ‌రాం మాత్రం ప్ర‌జ‌ల ప‌క్షాన ఇంకా పోరాడుతూనే ఉండ‌డం నిజంగా హ‌ర్ష‌ణీయం. ఇటీవ‌ల కాలంలో ఆయ‌న ఊహించ‌ని విధంగా కేసీఆర్‌పై ఉద్య‌మ బావుటా ఎగ‌రేశారు. మ‌ల్ల‌న్న‌సాగ‌ర్ నిర్వ‌సితులు, రైతులు, రీయింబ‌ర్స్‌మెంట్, సీఎం […]

2019 కోసం పవన్ కొత్త ప్లాన్..! చూస్తే షాకవ్వాల్సిందే..!

పాలిటిక్స్ అన్నాక అన్ని వ‌ర్గాల స‌హ‌కారం, మ‌ద్ద‌తు లేక‌పోతే రాణించ‌డం విజ‌యం సాధించ‌డం అనేవి క‌ష్ట‌మే! అది ఎన్‌టీఆర్ అయినా.. చంద్ర‌బాబు అయినా.. ఇప్పుడు ప‌వ‌న్ అయినా స‌రే! పాలిటిక్స్‌లో ఎంద‌రి అభిమానం, మ‌ద్ద‌తు ల‌భించింద‌నేదే కీల‌కం. ఇప్పుడు ప‌వ‌న్ అదే దిశ‌గా అంద‌రినీ ఆక‌ర్షిస్తూ.. ముందుకు సాగుతున్నాడ‌ట‌. నిన్న మొన్న‌టి వ‌రకుత‌న అన్న సీనియ‌ర్ రాజ‌కీయ నేత‌గా ఎదిగిన చిరంజీవితో ప‌వ‌న్ విభేధిస్తున్నాడ‌నే టాక్ ఉంది. చిరును లెక్క చేయ‌డ‌ని, ప‌వ‌న్ త‌న పంతాన్నే నెగ్గించుకునే […]

ఆ క్రెడిట్ కేసీఆర్‌కు ద‌క్కకుండా మోడీ ప్లాన్‌

తెలంగాణ‌లో టీఆర్ఎస్‌, భాజ‌పా మ‌ధ్య క్రెడిట్ గేమ్ న‌డుస్తోంద‌నే చ‌ర్చ మొద‌లైంది. తెలంగాణ‌లో బ‌ల‌పడేందుకు బీజేపీకి అవ‌కాశాలు ఉండ‌టంతో అందుకు సంబంధించిన ఏ ఒక్క అంశాన్ని ఆ పార్టీ నేత‌లు వ‌దిలిపెట్ట‌డం లేదు! ప్ర‌స్తుతం ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ అంశంలోనూ బ‌యట‌కి క‌నిపించ‌ని క్రెడిట్ గేమ్ మొద‌లైంద‌నేది విశ్లేష‌కుల అభిప్రాయం. ఇప్పుడు ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ కోసంమాట్లాడేందుకు అఖిల‌ప‌క్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాల‌ని భావించిన‌ తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ప్ర‌ధాని మోడీ అపాయింట్‌మెంట్ ఇచ్చి.. ర‌ద్దు చేయ‌డంపై బీజేపీ, టీఆర్ఎస్ మ‌ధ్య […]

జ‌య వార‌సుడి అడ్ర‌స్ ఎక్క‌డ‌..!

అన్నాడీఎంకే అధినేత్రి, మాజీ సీఎం దివంగ‌త జ‌య‌ల‌లిత‌ వార‌సులు ఎవ‌రు? జయ నెచ్చెలి శ‌శిక‌ళ‌నా లేక జ‌య న‌మ్మిన‌బంటు పన్నీర్ సెల్వమా? అనే విష‌యంపై ఇప్ప‌టికీ స‌స్పెస్ కొన‌సాగుతోంది. జ‌య మ‌ర‌ణం త‌ర్వాత ఆమె వార‌సుడిగా త‌మిళ‌ సినీన‌టుడు అజిత్ పేరు బాగా వినిపించింది. కానీ త‌ర్వాత ఆ పేరు వినిపించ‌నేలేదు! అయితే ప్ర‌స్తుతం త‌మిళ‌నాట రాజ‌కీయ సంక్షోభం ఉన్నా.. అజిత్ ఎందుకు నోరుమెద‌ప‌డం లేదు? అస‌లు అజిత్ ఏమ‌య్యాడు ? సినీ తార‌లు ప‌న్నీర్ సెల్వానికి […]