తెలంగాణలో కొద్దిరోజల క్రితం పోలీసుల ఎన్‌కౌంటర్లో హతమైన నయీముద్దీన్ చేసిన ఘాతుకాలు, అతడి అనుయాయుల అరాచకాలు రోజుకొకటి చొప్పున ఇంకా వెలుగుచూస్తూనే ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇతడికి సంబంధించిన కేసులు విచారణను పోలీసులు మరింత వేగవంతం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ కేసువిచారణపై ఎప్పటికప్పుడు వివరాలు సేకరిస్తున్నారు. దీనికి కారణాలు లేకపోలేదు. గ్యాంగ్ స్టర్ నయీం అరాచకాలకు సహకరించిన వాళ్లలో పలువురు అధికారులతోపాటు, రాజకీయ నేతల సంఖ్యా ఎక్కువగానే ఉందన్న ఆరోపణలు […]
Category: Latest News
జూనియర్‌ని చంద్రబాబు మళ్లీ చేరదీస్తున్నారా?
ఏపీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకి, జూనియర్ ఎన్‌టీఆర్‌కి మధ్య సంబంధం కేవలం ఫ్యామిలీ పరంగానే పరిమితం కాలేదు. పొలిటికల్‌గా కూడా ఈ ఇద్దరి మధ్య ఎంతో అనుబంధం ఉంది. నందమూరి వంశంలో చంద్రబాబుకు అండగా నిలబడిన వారిలో, చంద్రబాబు చేరదీసిన వారిలో హరికృష్ణ, బాలకృష్ణల తరం తర్వాత ఒక్క జూనియర్ మాత్రమే కనిపిస్తాడు. అదేవిధంగా జూనియర్‌కు ఓ మంచి సంబంధం చూసి, దగ్గరుండి వివాహం చేయించిన ఘనత అక్షరాలా చంద్రబాబుకే దక్కుతుంది. నార్నేవారి ఇంటి అమ్మాయిని […]
కేసీఆర్ మీద సొంత పార్టీ ఎమ్మెల్యే తిరుగుబాటు
కొత్త జిల్లాల ఏర్పాటు అంశం.. మొత్తం మీద తెలంగాణ సీఎం కేసీఆర్ కు శిరోభారంగా మారినట్టే కనిపిస్తోంది. ప్రత్యర్థి పార్టీల నేతలకు మైలేజీ రాకుండా చేయాలన్న ఉద్దేశంతో.. వారి డిమాండ్లనూ పరిగణనలోకి తీసుకుని కొత్త జిల్లాల సంఖ్యను టీఆర్ ఎస్ అధినేత తాజాగా ఏకంగా 21కి చేర్చారు. అయినా ఈ అంశం రోజుకో వివాదాన్ని రాజేస్తూనే ఉంది. కేసీఆర్ తనయుడు, రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లను ప్రత్యేక జిల్లాగా చేయాలనే డిమాండ్‌తో మొదలైన ఈ […]
కేసీఆర్‌కు కొత్త తలనొప్పి…. 33 జిల్లాలు కావాలి
తెలంగాణ ను బంగారు తెలంగాణ చేయాలన్న టీఆర్ ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ వ్యూహం కాస్తా.. తెలంగాణను జిల్లాల తెలంగాణగా మారుస్తోందా ? అనిపిస్తోంది! వాస్తవానికి పాలన సౌలభ్యం కోసం, ప్రజలకు మరింత చేరువ కావడం కోసం, కొత్త నాయకులు, నేతలు వస్తారని భావించిన కేసీఆర్ ప్రస్తుతమున్న పది జిల్లాల రాష్ట్రాన్ని 25 జిల్లాలు చేయాలని నిర్ణయించారు. వీటిలో ముఖ్యంగా పెద్ద పెద్ద జిల్లాలుగా ఉన్నవాటిపై ఆయన తొలుత దృష్టి పెట్టారు. ఇక, ఆ తర్వాత దీనికి […]
కేసీఆర్ ముందా వాళ్ల కుప్పిగంతులు
వర్తమాన రాజకీయాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావుది విభిన్నశైలి. రాజకీయ ప్రత్యర్థులను.. ఎవరూ ఊహించలేని ఎత్తులతో చిత్తు చేయడమే కాదు. పరిపాలనలోనూ ఆయన తనదైన మార్కును చూపేందుకు ఇష్టపడతారు. అది ఏ అంశమైనా సరే… సాధ్యాసాధ్యాలకు ఆయన నిఘంటువులో అర్థాలు వేరుగా ఉంటాయి. ఆయన పాలనా పరంగా ఏ నిర్ణయం తీసుకున్నా అందులో పార్టీకి భవిష్యత్తులో అనుకూలించే వ్యూహాలు అంతర్లీనంగా దాగి ఉంటాయి. తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పీఠాన్ని అధిష్టించిన తరువాత […]
2019లో వైకాపా పొత్తుల లెక్కలివే
కొంతకాలం కిందటిదాకా దేశవ్యాప్తంగా వామపక్షాలు అనేక రాష్ట్రాల్లో ఏదో ఒక స్థాయిలో తమ ప్రభావం చూపుతూ వచ్చాయన్నది ఎవరూ కాదనలేని వాస్తవం. ఇప్పుడంటే తమ ప్రభను కోల్పోయాయి కాని అధికారంలో ఉన్నపార్టీలపై కమ్యూనిస్టులు చేసే పోరాటాల ప్రభావం ప్రజలపై తీవ్రంగా ఉండేది. చాలా సమయాల్లో అధికార పక్షాలపై ప్రజావ్యతిరేకత పెంచి… ఆ తరువాత ఎన్నికల్లో వారిని అధికార పీఠానికి దూరం చేయడంలోనూ వామపక్షాలు ప్రధాన పాత్రనే పోషించాయి. అయితే పశ్చిమ బెంగాల్, కేరళ వంటి ఒకటి రెండు […]
ఏపీ సచివాలయం మూతేనా?
దాదాపు నాలుగు దశాబ్దాలకు పైగా ప్రజలకు సేవలందించిన హైదరాబాద్‌లోని ఏపీ సచివాలయ భవనం ఇప్పుడు శ్మశాన నిశ్శబ్దంతో బావురుమంటోంది! రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక సచివాలయం, అసెంబ్లీ భవనాలను ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో గుంటూరులో అమరావాతి రాజధానితోపాటు వెలగపూడిలో ఏపీకి ప్రత్యేక సచివాలయం ఏర్పాటు చేశారు. మన ప్రాంతం మన పాలన పేరును పదే పదే జపిస్తున్న సీఎం చంద్రబాబు ఈ క్రమంలోనే హైదరాబాద్ లోని సచివాలయాన్ని వెలగపూడిలో నిర్మించిన తాత్కాలిక సచివాలయ […]
తనకు తానే సవాలు విధించుకున్న భూమా నాగిరెడ్డి
వైకాపా నుంచి జంప్ చేసి టీడీపీ సైకిల్ ఎక్కిన కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెద్ది తాజాగా పెద్ద సవాల్ చేశారు. ఇది వైకాపా ఎమ్మెల్యేలనో? ఆ పార్టీ అధినేత జగన్‌నో ఉద్దేశించి కాదు! తనకు తానుగానే రువ్వుకున్న సవాల్! విషయంలోకి వెళ్లిపోతే.. వైకాపా తరఫున 2014లో ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు భూమా. అదేసమయంలో ఆయన కుమార్తె అఖిల ప్రియ తన తల్లి శోభప్లేస్ నుంచి గెలిపొంది అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ క్రమంలోనే […]
ఏపీ విద్యాశాఖలో సున్నాలకు అవినీతి కన్నం!
విద్యార్థులకు నీతులు నేర్పి.. ఉత్తమ పౌరులుగా తీర్చి దిద్దే ఏపీ విద్యాశాఖ ఇప్పుడు అవినీతికి కేరాఫ్‌గా మారింది! అందిన ప్రతి అవకాశాన్ని అవినీతికి ఆలవాలంగా మార్చుకునేందుకు నేతల మొదలు అధికారులు సిద్ధమవుతున్నారు. సర్వశిక్షా అభియాన్ మొదలుకుని ప్రతి దాంట్లోనూ అవినీతి దందానే. ట్యాబ్ లు కొనుగోలు మొదలుకుని ‘సున్నాలు’ వేసే వరకూ ప్రతి స్కీమ్ లోనూ అవినీతి ‘గంటలు’ మోగుతున్నాయి. మొన్నామధ్య టీచర్ల బదిలీ వ్యవహారంలోనూ పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనే వార్తలు వచ్చినా ఏ ఒక్కరూ […]