ఓ చేత్తో పాలనా పగ్గాలను, మరో చేత్తో పార్టీ వ్యవహారాలను సమర్థంగా సమన్వయం చేసుకురావడం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కొత్తేమీ కాదు. ఉమ్మడి ఏపీకి అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా వ్యవహరించిన రికార్డును తనపేరిట శాశ్వతంగా లిఖించుకున్న టీడీపీ అధినేత మంచి పాలనాదక్షుడిగా దేశవ్యాప్తంగా పేరు, ప్రతిష్టలు సంపాదించుకున్నారు. ఆయన తిరుగులేని రాజకీయ వ్యూహాలు, సామర్థ్యం కారణంగానే పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, తెలుగువారి ఆరాధ్య నటుడు, సంచలన రాజకీయ విజయాల సారథుడు, సాధకుడు అయిన ఎన్టీఆర్ చేతుల్లోంచి సైతం […]
Category: Latest News
టీఆర్ఎస్‌లో రేగుతున్న అసంతృప్తి జ్వాలలు
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు రాజకీయ, పాలనాపరమైన వ్యూహాలేమిటో విపక్షాలకు మాత్రమే కాదు… ఒక్కోసారి సొంత పార్టీ నేతలకు కూడా అర్థంకావు. అవును మరి… నామినేటెడ్ పోస్టుల భర్తీలో కేసీఆర్ వైఖరి చూస్తే ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. పార్టీ క్యాడర్‌లో ఉత్సాహం నింపేందుకు వివిధ కార్పొరేషన్లు, మార్కెట్, దేవాదాయ, గ్రంథాలయ సంస్థల వంటి పదవులను రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో కలిపి సుమారు 4 వేలకు పైగానే భర్తీ చేస్తామని టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గతంలోనే […]
దేశంలోకి బ్రాహ్మణి ఎంట్రీ తప్పదా?!
ఏపీ అధికార పార్టీ టీడీపీలో ఎప్పుడు ఎలాంటి మార్పులు వస్తాయో చెప్పడం కష్టంగా మారింది. ఎందుకంటే ఇప్పుడు ఈ పార్టీలో యాక్టివ్‌గా పనిచేసే నేత ఒక్కరే కనిపిస్తున్నారు. ఆయన మరెవరో కాదు సీఎం చంద్రబాబే!! ఈ విషయంలో అనుమానించాల్సిన పనేలేదు. పార్టీని, ప్రభుత్వాన్ని ఎంతో యాక్టివ్‌గా నడిపించాల్సిన ఈ సమయంలో దాదాపు అందరూ ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా ఉండగా, ఇటీవల చంద్రబాబు నిర్వహించిన సర్వేల ఫలితాలతో కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు డీలా పడిపోయారు! ఏం చేస్తే […]
తనకు తానే బుక్ అయిన చంద్రబాబు
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణాల విషయంలో స్విస్ ఛాలెంజ్ విధానాన్ని నమ్ముకున్న చంద్రబాబు ప్రభుత్వం దీనిపై అటు విపక్షాలు, ఇటు అధికారుల నుంచి ఎన్ని విమర్శలు వచ్చినా పట్టించుకోకుండా ముందుకే వెళ్లింది. ఈ విషయంలో చంద్రబాబు ఆయన మంత్రి వర్గం మీడియా సహా ప్రతి ఒక్కరిపైనా ఎదరు దాడినే కొనసాగించారు. స్విస్ ఛాలెంజ్ ప్రక్రియను అద్భుతంగా కొనియాడారు. మనదేశంలో ఇంతటి సామర్ధ్యం, నైపుణ్యం ఉన్న సంస్థలు, వ్యక్తులు లేవని కుండబద్దలు కొట్టారు. ఎట్టిపరిస్థితిలోనూ స్విస్ ఛాలెంజ్‌లోనే రాజధాని […]
నయీం కేసులో ఫస్ట్ పొలిటికల్ వికెట్ డౌన్..!
రెండు తెలుగు రాష్ట్రాలను గడగడలాడించిన గ్యాంగ్ స్టర్ నయీంతో షోల్డర్ షోల్డర్ కలిపి పనులు చక్కబెట్టుకున్న నేతల వివరాలు ఒక్కటొక్కటిగా బయటపడుతున్న విషయం తెలిసిందే. నయీంతో అంటకాగిన వారు ఎంతటి వారైనా చర్యలు తప్పవని కేసీఆర్ వెల్లడించిన నేపథ్యంలో సిట్ అధికారులు దూకుడు ప్రదర్శించారు. ఈ క్రమంలో నయీంతో చట్టాపట్టాలేసుకుని తిరిగి దందాలు చేసినవారి పేర్లను సిట్ ప్రభుత్వానికి అందజేసింది. దీనిలో ప్రముఖంగా బయటకు వచ్చిన పేరు నేతి విద్యాసాగర్‌రావు. ప్రస్తుతం ఈయన తెలంగాణ శాసన మండలి […]
జగన్ సవాల్‌తో బాబు ఇరుకున పడతాడా..!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిష్టను దెబ్బతీయడం, నేతల వరుస వలసలతో బలహీనపడిన తన పార్టీ క్యాడర్‌లో తిరిగి ఆత్మస్థైర్యం నింపడమే లక్ష్యంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ భారీ పొలిటికల్ గేమ్‌కు తెర తీయబోతున్నారా… అంటే రాజకీయ విశ్లేషకులు అవుననే సమాధానమిస్తున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడంపై ఇటు టీడీపీని, అంటు బీజేపీని ఇరకాటంలో పెట్టడంద్వారా తన రాజకీయ మనుగడకు బాటలు వేసుకోవాలని జగన్ భావిస్తున్నట్టు ఆ పార్టీ వర్గాలు చెపుతున్నాయి. రాష్ట్రానికి హోదా ఇవ్వకపోతే […]
చిరును లైన్లో పెడుతున్న చంద్రబాబు
ఏంటి సర్‌ప్రైజింగ్‌గా ఉందా? చిరు ఏంటి? చంద్రబాబు ఆయనను లైన్‌లో పెట్టడం ఏంటని ఆలోచిస్తున్నారా? పాలిటిక్స్ అంటే అవేగామరి! ఎప్పుడు ఎవరిని దువ్వాలో ఎప్పుడు ఎవరిని రువ్వాలో అనే సబ్జెక్ట్ పాలిటిక్స్‌లో పెద్ద ట్రిక్. రానున్న 2019 ఎన్నికల్లో మరోసారి గెలుపు గుర్రం ఎక్కి ఏపీ పాలనను సుస్థిరం చేసుకోవాలని చంద్రబాబు పక్కా ప్లాన్‌తో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ఇప్పటి నుంచే తన ప్లాన్‌ను అమలు చేసేందుకు రెడీ అయిపోతున్నారు. వాస్తవానికి టీడీపీలో […]
టీ కాంగ్రెస్‌లో సడెన్‌గా ఇంత మార్పు ఏంటో
పాలిటిక్స్‌లో ఎప్పుడు ఎలాంటి మార్పులు వస్తాయో? ఎప్పుడు నేతలు ఎలా మారతారో చెప్పడం కష్టం! ఇప్పుడు ఇదంతా ఎందుకనుకుంటున్నారా? తెలంగాణ కాంగ్రెస్‌లో ఇప్పుడు ఇలాంటి మార్పులే జరుగుతున్నాయి మరి! అందుకే ఈ స్టోరీ. టీ కాంగ్రెస్‌లో నిన్న మొన్నటి వరకు ఒకరి ముఖాలు ఒకరు చూసుకునేందుకు సైతం సీనియర్ నేతలు తప్పించుకుని తిరిగారు. ఇక, మూకుమ్మడిగా అధికార పార్టీ టీఆర్ ఎస్ సహా సీఎం కేసీఆర్‌పై విమర్శల దండయాత్ర చేద్దామన్నా కలిసొచ్చిన నేత కరువయ్యాడు. అలాంటి పరిస్థితి […]
వైకాపాలో సినీ గ్లామర్ పెరుగుతోందా..
ఏపీ ఏకైక విపక్షం వైకాపాలో సినీ గ్లామర్ పెరుగుతోంది. మాజీ హీరోయిన్ రాశి త్వరలోనే జగన్ గూటికి చేరేందుకు అన్ని ప్రయత్నాలూ పూర్తయ్యాయని తెలుస్తోంది. ఇక, ముహూర్తమే తరువాయి అన్నట్టు వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి చంద్రబాబు పార్టీ టీడీపీతో పోల్చుకుంటే వైకాపాకి సినీ గ్లామర్ చాలా తక్కువ. ఒక్క రోజా తప్ప ఆపార్టీలో సినీ గ్లామర్ ఉన్న వాళ్లు లేరు. గతంలో ఎప్పుడో జీవిత, రాజశేఖర్ జగన్ పంచన ఉన్నా. అది ముగిసిన ముచ్చట. ఇప్పటికైతే.. రోజా […]