ఎన్ని ‘దిశ’లు ఉన్నా.. ఈ దరిద్రం తొలగేదెలా?

దేశంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వమూ చేయనంత గొప్పగా జగన్మోహన్ రెడ్డి సర్కారు.. మహిళల రక్షణ గురించి శ్రద్ధ తీసుకుంటోంది. అన్ని రాష్ట్రప్రభుత్వాలకు ఆదర్శంగా నిలిచే స్థాయిలో జగన్ సర్కారు దిశ చట్టం తీసుకువచ్చింది. కొన్ని సాంకేతిక కారణాల దృష్ట్యా కేంద్రం మోకాలడ్డి దిశ ఇంకా పూర్తిస్థాయిలో చట్టం రూపం దాల్చలేదు గానీ.. దాని రూపకల్పన వెనుక ప్రభుత్వం చిత్తశుద్ధి ఏమాత్రం శంకించలేనిది. ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో గట్టి చట్టాల కోసం ప్రయత్నం చేస్తున్నప్పటికీ, ఆ స్ఫూర్తి కిందిస్థాయి […]

అన్నాచెల్లెళ్లు.. దూరం.. దూరంగా ఉంటున్న షర్మిల, కవిత…

వైఎస్ఆర్, కేసీఆర్ ఇద్దరూ రాజకీయ సమకాలీకులే.. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా ఉన్నపుడు వైఎస్ఆర్ ఓ వెలుగు వెలిగారు. కేసీఆర్ కూడా అంతే.. రాష్ట్రం విడిపోయిన తరువాత ఆయనదే హవా.. ఇక కుటుంబపరంగా చూస్తే ఇద్దరికీ సారూప్యత ఉంది. ఇద్దరికీ ఇద్దరు పిల్లలు. ఓ కుమారుడు, ఓ కుమార్తె. వైఎస్ఆర్ కు జగన్, షర్మిల సంతానమైతే.. కేసీఆర్ కు కేటీఆర్, కవిత. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇపుడు పిల్లల విషయానికి వస్తే ఏపీలో […]

పీకే : తూట్లు పడ్డ నావకి తెడ్డు వేస్తాడా?

తెలుగు రాజకీయాలకు సంబంధించినంత వరకు పీకే అంటే పవన్ కల్యాణ్ అనుకుంటారు గానీ.. యావద్దేశం దృష్టిలో పీకే అంటే రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్. ఎన్నికల్లో పార్టీలను అలా సునాయాసంగా అధికారంలోకి తీసుకువచ్చేసే మంత్రం తెలిసిన వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్ కు పేరుంది. ఇటీవలి కాలంలో పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో మమతా దీదీ కోసం పనిచేసి.. ఆమెను అధికారంలోకి తీసుకువచ్చిన ప్రశాంత్ కిశోర్ .. ఇక రాజకీయ వ్యూహరచనల ప్రస్థానం చాలిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించేశాడు. తాజాగా ఆయన […]

తెలుగు సీఎంలూ.. స్టాలిన్ నుంచి నేర్చుకోండి..!

అరవయ్యేళ్లు దాటిపోయేవరకు పార్టీకి యువనేతగానే మిగిలిపోయిన స్టాలిన్.. ఈ వయసులో దక్కిన ముఖ్యమంత్రి పదవిని చాలా చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే.. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులందరికీ ఒక మోడల్ అనిపించేలాగా.. నిర్ణయాలు తీసుకుంటున్నారనేది కూడా ప్రజలు గమనిస్తున్నారు. ముఖ్యమంత్రి అయిన వెంటనే.. మాజీ ముఖ్యమంత్రులు పళనిస్వామి, పన్నీర్ సెల్వంల ఇళ్లకు వెళ్లి పలకరించి.. ప్రభుత్వానికి సహకరించమని అడగడం దగ్గరినుంచీ.. నిన్న మొన్న ఎన్నికలకు ముందు స్కూలు పిల్లలకోసం అప్పటి సీఎం బొమ్మలతో తయారుచేసిన బ్యాగులపై […]

పాపం చంద్రబాబు.. ఎన్నెన్ని కష్టాలు వచ్చాయో..?

‘అధికారాంతమునందు చూడవలె కదా.. ఆ అయ్య సౌభాగ్యముల్’ అన్నారు పెద్దలు. అధికారం ఉన్నప్పుడు అందరూ మన చుట్టూ తిరుగుతూ మన భజన చేస్తూ కీర్తిస్తూ గడుపుతూ ఉంటారు. కానీ, అధికారం దిగిపోయిన తర్వాత సంగతి ఏమిటి? అధికారం లేకపోయినా కూడా ఎవరికి విలువ దక్కుతుందో వారు మాత్రమే నిజమైన నాయకులు అనుకోవాలి. ఇప్పుడు చంద్రబాబునాయుడు అధికారంలో లేరు. దానికి తగ్గట్టుగానే పార్టీలో కూడా ఆయన ప్రభ పలచబడిపోయింది. పట్టించుకునే వారు తక్కువ. ఖాతరు చేసే వారు, భయపడేవారు […]

వైఎస్సార్ : పంచసూత్రాల పరమోన్నత వ్యక్తిత్వం!

కారణజన్ములు అనే కోవకు చెందిన మహానుభావులు.. ఒక ప్రత్యేక కారణం కోసం పుడతారు. లోకకల్యాణం కోసం నిరంతరం పరిశ్రమిస్తూ ఉండే భగవంతుడు- ప్రతిపనినీ తానొక్కడూ చేయలేక.. కొన్ని నిర్దిష్టమైన పనులు పూర్తి చేయడానికి కొందరిని పుట్టిస్తాడు. వారే కారణజన్ములు. వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా అలాంటి మహనీయుడు! ప్రభుత్వాల పరిపాలన అనేది ప్రజాసంక్షేమం అనే లక్ష్యం నుంచి పక్కకు మరలకుండా ఉన్నంతవరకు, ఇతరత్రా సంకుచిత ప్రయోజనాలను లక్ష్యించనంత వరకు ఎవ్వరేమనుకున్నా ఖాతరు చేయకుండా ముందుకు సాగిపోయేలాగా ఉండాలనేది […]

జగన్.. డిఫరెంట్ పొలిటీషియన్..?

అసంతృప్తి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న వైసీపీ అధినేత రాజకీయం అనేదే ఒక విచిత్రమైన ఆట.. చదరంగంలో వేసే ఎత్తులకంటే పై ఎత్తులు మెరుగ్గా వేయాలి. లేకపోతే అథ:పాతాళానికి నాయకుడు పడిపోతాడు.. ఆ తరువాత ఇక రాజకీయ జీవితం భూస్థాపితం అవుతుంది. అందుకే రాజకీయ నాయకులు నిర్ణయాలు త్వరగా తీసుకోరు.. తీసుకున్నా అమలు చేయరు.. అయితే అందుకు భిన్నంగా వ్యవహరించిన నాయకులు ఎన్టీయార్, నరేంద్రమోదీ.. ఇపుడు వారిని మించి జగన్ పొలిటికల్ గేమ్ ఆడబోతున్నాడు. చూసేవారికి వారి బాటలోనే […]

నారా లోకేష్.. దూసుకుపోతున్న టీడీపీ బుల్లెట్..

తెలుగుదేశం పార్టీలో ఒకప్పుడు పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావుదే హవా.. ఆ తరువాత అల్లుడు చంద్రబాబు నాయుడిది.. ఇపుడు ఎవరిది అనే ప్రశ్న వస్తే.. ఇంకెవరిది బాబు గారిదే అని సమాధానం వస్తుంది. అయితే ఎన్నాళ్లని చంద్రబాబు పార్టీని తన భుజాలపై మోస్తారు. రోజు రోజుకూ వయసు మీద పడుతోంది.. తన రాజకీయ సమకాలీకులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కేసీఆర్ కుమారులు జగన్, కేటీఆర్ రాజకీయంగా చాలా ముందంజలోఉంటే తన కుమారుడు నారా లోకేష్ మాత్రం అక్కడే […]

ఒకటే పార్టీ.. ఎవరి యాత్ర వారిది..!

భారతీయ జనతా పార్టీ.. అనేక సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి దీటుగా నిలిచి పోరాడి అధికారంలోకి వచ్చింది. మాది కుటుంబ పార్టీ కాదు.. కార్యకర్తల పార్టీ.. కలిసి కట్టుగా ఐకమత్యంగా ఉంటాం అని ఎప్పుడూ ఆ నాయకులు చెబుతుంటారు. అయితే ప్రస్తుతం ఆ పార్టీలో జరుగుతున్న పరిణామాలు గమనిస్తే.. ఎవరికి వారే.. యమునా తీరే అన్నట్లుంది. అందుకు నిదర్శనమే ఆ పార్టీ నాయకులు చేపట్టిన పాదయాత్రలు. అవేంటో ఒకసారి చూద్దాం.. ప్రజాదీవెన యాత్ర : టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా […]