నాన్న బాటలో.. పాదం కదపనున్న షర్మిల..

తెలంగాణ రాజకీయాలకు సంబంధించి.. తాను ఆషామాషీగా పార్టీ పెట్టలేదని.. వైఎస్ షర్మిల రాష్ట్రప్రజలకు నిరూపించబోతున్నారు. జననేతగా తెలంగాణ వ్యాప్తంగా కూడా జనం హృదయాల్లో గుర్తింపు ఉన్న తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి బాటలోనే అడుగులు కదపనున్నారు. అచ్చంగా వైఎస్ తరహాలోనే షర్మిల కూడా చేవెళ్ల నుంచి తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర ప్రారంభించడానికి షెడ్యూలు కూడా ప్రకటించారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించిన తర్వాత షర్మిల చురుగ్గా రాజకీయ అడుగులు వేస్తున్నారు. ప్రతిమంగళవారం నిరుద్యోగ నిరాహార దీక్షను చేస్తున్నారు. […]

పవన్ కల్యాణ్ కు మరీ అంత అజ్ఞానమా..?

మూడు రోజుల కిందట ఒక తమాషా జరిగింది. సినిమా హీరో పవన్ కల్యాణ్, సినిమా డైరక్టర్/ రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇద్దరూ కలిసి మహాకవి శ్రీశ్రీ గురించి మాట్లాడుకున్నారు. ఇద్దరూ మాట్లాడుకున్నారు అనడం కంటె.. పవన్ కల్యాణ్ శ్రీశ్రీ గురించి అడిగాడు.. త్రివిక్రమ్ తనకు తోచినదేదో చెప్పాడు అని అంటే బాగుంటుంది. వారిద్దరూ అలా శ్రీశ్రీగురించి మాట్లాడుకోవడమే.. ఒక ఘనకార్యం అన్నటలుగా ఒక ప్రెస్ నోట్ కూడా విడుదల అయింది. పవన్ అభిమానులందరూ ఆహాఓహో అంటూ భజన […]

విజయాన్ని ఏకపక్షంగా నిందిస్తే ఆత్మవంచనే..!

స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు వచ్చాయి. తెలుగుదేశం పార్టీ దారుణమైన పరాజయభారాన్ని మూటగట్టుకుంది. సాధారణంగా ఏ ఎన్నికలలో అయినా ఓడిపోయిన పార్టీ.. తమ ఓటమిని ప్రజల తీర్పుగా అంగీకరించడం జరగదు. గెలిచిన పార్టీ చేసిన అక్రమాలకు ఫలితంగా అభివర్ణిస్తుంది. మామూలు పరిస్థితుల్లోనే అలాంటి కాకమ్మ కబుర్ల చెప్పే పార్టీల నేతలు.. ఈసారి ఏపీలో స్థానిక ఎన్నికలు జరిగిన ప్రత్యేక పరిస్థితుల్లో, మెజారిటీ ఏకగ్రీవాలు కావడం, చాలా చోట్ల తెలుగుదేశానికి పోటీకి దింపడానికి అభ్యర్థి కూడా లేకుండా పోయిన […]

హత్య లేకుండా.. అత్యాచారమైతే లైట్ తీస్కో!

పోలీసులు చట్టాన్ని అతిక్రమించలేరు. ఎంత ఆవేశం ఉన్నప్పటికీ చట్టం పరిధికి లోబడి మాత్రమే వారు పనిచేయాల్సి ఉంటుంది. ఇదంతా నిజమే గానీ.. కొన్ని సందర్భాల్లో వారు తీసుకునే నిర్ణయాలు, అనుసరిస్తున్న పద్ధతులు గమనిస్తే చిత్రంగా కనిపిస్తుంటుంది. హత్యాచారం అయితేనే అంటే అత్యాచారంతో పాటు హత్య కూడా చేస్తేనే సీరియస్ గా తీసుకుంటారా? కేవలం అత్యాచారం మాత్రమే అయితే లైట్ తీసుకుంటారా? అనే అభిప్రాయాలు కలుగుతున్నాయి. సైదాబాద్ దుర్ఘటన ఒక పెద్ద ఉదాహరణ. ఆరేళ్ల బాలికపై హత్యాచారం జరిగింది. […]

ఆ ఎంపీ మహా పిరికి.. అయినా ఓవరాక్షన్ జాస్తి..!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామక్రిష్ణ రాజు.. తనకు లక్షలాది మంది ప్రజల ఫాలోయింగ్ ఉన్నదని.. తాను పోస్టులు పెడితే లక్షలాది మంది ఎగబడి చూస్తుంటారని.. ఈ రాష్ట్రంలో తనకున్నంత సోషల్ మీడియా ఫాలోయింగ్ మరే యితర నేతకూ లేదని చాలా తరచుగా చెప్పుకుంటూ విర్రవీగుతూ ఉంటారు. అయితే వాస్తవానికి ఆయనకున్న ఫాలోయింగ్ మొత్తం.. ముఖ్యమంత్రి జగన్ ను తీవ్రంగా ద్వేషించే.. తెలుగుదేశం పార్టీకి చెందిన అతివాదులు మాత్రమే అనే సంగతి ఆయనకు తెలిసినా ఒప్పుకోరు. పేరుకు […]

మోడీ సర్కార్ కు సోనూసూద్ ఫోబియా ఉందా?

కాలం కాని కాలంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఎవరిమీదనైనా దాడులు నిర్వహించారంటే గనుక.. ఖచ్చితంగా అది రాజకీయ కక్ష సాధింపు చర్యలే అనే నిశ్చితాభిప్రాయం ఈ దేశ ప్రజలందరిలోనూ ఏర్పడిపోయింది. పైగా కేంద్రప్రభుత్వం తమకు కిట్టని వారిని వేధించడానికి, లొంగదీసుకోవడానికి, బెదిరించడానికి, కిమ్మనకుండా చేయడానికి ఎంచుకునే అస్త్రంగా ఐటీ దాడులకు అర్థాలు మారిపోయాయి. ఇప్పుడు సినీనటుడు సోనూసూద్ కు చెందిన బొంబాయిలోని నివాసం మీద, లక్నోలోని కంపెనీ మీద ఐటీ దాడులు జరిగాయి. ఇవి కూడా […]

హత్య లేకుండా.. అత్యాచారమైతే లైట్ తీస్కో..!

పోలీసులు చట్టాన్ని అతిక్రమించలేరు. ఎంత ఆవేశం ఉన్నప్పటికీ చట్టం పరిధికి లోబడి మాత్రమే వారు పనిచేయాల్సి ఉంటుంది. ఇదంతా నిజమే గానీ.. కొన్ని సందర్భాల్లో వారు తీసుకునే నిర్ణయాలు, అనుసరిస్తున్న పద్ధతులు గమనిస్తే చిత్రంగా కనిపిస్తుంటుంది. హత్యాచారం అయితేనే అంటే అత్యాచారంతో పాటు హత్య కూడా చేస్తేనే సీరియస్ గా తీసుకుంటారా? కేవలం అత్యాచారం మాత్రమే అయితే లైట్ తీసుకుంటారా? అనే అభిప్రాయాలు కలుగుతున్నాయి. సైదాబాద్ దుర్ఘటన ఒక పెద్ద ఉదాహరణ. ఆరేళ్ల బాలికపై హత్యాచారం జరిగింది. […]

కేసీఆర్ కల ఇలా తీరుతుందేమో!

పరిశుభ్రమైన హుస్సేన్ సాగర్ ను హైదరాబాదు వాసులకు అందించాలనేది కేసీఆర్ కల. కానీ.. ఆ సాగర్ ఎప్పటికప్పుడు ఘోరంగా తయారైపోతుండడానికి ఉండే అనేక కారణాలలో వినాయక నిమజ్జనం కూడా ఒకటి. ఏటా వందలకొద్దీ వినాయక విగ్రహాలను ఈ హుసేన్ సాగర్ లోనే నిమజ్జనం చేసేస్తుండడం.. దాని పరిశుభ్రతకు పెద్ద సవాలు. ఇవన్నీ కూడా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో తయారుచేసిన విగ్రహాలు, సింథటిక్ రంగులు పూసిన, ఇనుప కమ్మీలు వాడి తయారుచేసిన విగ్రహాలు. ఇవన్నీ కూడా ఏ […]

‘ఈనాడు శ్రీధర్’ సొంత కుంపటి..!

ఈనాడు శ్రీధర్ గానే ప్రపంచానికి అంతటికీ నలభయ్యేళ్లుగా పరిచయం ఉన్న కార్టూనిస్టు శ్రీధర్, తన ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత.. సొంత కుంపటి పెట్టుకున్నారు. ఒక యూట్యూబ్ ఛానెల్ ద్వారా రాజకీయ విశ్లేషకుడిగా అవతారం ఎత్తే ప్రయత్నంలో ఉన్నారు. ఈ యూట్యూబ్ ఛానెల్ శ్రీధర్ అన్నయ్య పిఎస్ఎం రావు అనే ఆర్థికరంగ విశ్లేషకుడికే చెందినది కావడం గమనార్హం. ఆ ఛానెల్ ద్వారా సొంత వ్యాపారం మీదనే ఇప్పుడు శ్రీధర్ దృష్టి నిలుపుతున్నట్లుగా అర్థమవుతోంది. రెండు తెలుగురాష్ట్రాల్లోనూ కార్టూనిస్టుగా […]