కేంద్రం రాష్ట్రానికిచ్చిన ప్యాకేజ్ ని రెండు పాచి పోయిన లడ్డులతో మొన్నామధ్య కాకినాడ సభలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విమర్శిస్తే తాజాగా వైసీపీ అధ్యక్షుడు వైస్ జగన్ కేంద్రం ఇస్తానంటున్న రాయితీలు శెనక్కాయలు బెల్లం తో సమానమని వ్యాఖ్యానించారు.రాయలసీమ ప్రాంతంలో శెనిక్కాయలు బెల్లం అనేది ఒక టైం పాస్ స్నాక్ ఐటెం లాంటిది.కేంద్రం ఇస్తానంటున్న పన్ను రాయితీలు కూడా అలాంటివేనని జగన్ చెప్పుకొచ్చారు. పవన్,జగన్ ఇద్దరి సభల అజెండా ఒకటే అయినా పవన్ ప్రశ్నించకపోగా ఇంకాస్త […]
Author: admin
తెలంగాణ లో ఎమర్జెన్సీ ప్రకటించిన మంత్రి
తెలంగాణ నీటిపారుదల శాఖలో సడెన్‌గా ఎమర్జెన్సీ విధించారు. కేసీఆర్ మంత్రి వర్గంలో ఫైర్ బ్రాండ్ మినిస్టర్‌గా పేరొందిన మంత్రి హరీష్ రావు తన శాఖలో ఉన్నట్టుండి ఎమర్జెన్సీ విధించారు. ముఖ్యంగా ఈ శాఖలోని ఇంజనీరింగ్ అధికారులకు ఆయన సెలవులు రద్దు చేశారు. అందరూ ఆఫీసులకు తక్షణమే రావాలని హుకుం జారీ చేశారు. అవసరమైతే.. 24 గంటలూ విధులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. అన్ని సాంకేతిక సాధనాలనూ వినియోగించుకోవాలని కూడా పేర్కొన్నారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న హరీష్‌రావు […]
నడి రోడ్డుపై ఏపీ మంత్రి పరుగు
అవును మీరు చదివింది తప్పుకాదు. నిజమే! ఏపీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డే.. నడిరోడ్డుపై చెప్పులు వదిలేసి మరీ.. పరుగులెత్తాల్సి వచ్చిందట. అదికూడా ఆయన సొంత జిల్లాలోనే ఈ పరిస్థితి తలెత్తిందట! మరి ఆయనకు ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందో? ఎవరు కల్పించారో? అప్పుడసలు ఏం జరిగిందో? తెలుసుకోవాలని ఉంటే..ఇది చదవక తప్పదు. అనంతపురంలోని ప్రభుత్వ బోధనాసుపత్రిలో పడకల పెంపు, సిబ్బంది నియామకాలు చేపట్టాలన్న డిమాండ్ తో సీపీఎం నేత, ఎమ్మెల్సీ గేయానంద్ మూడు రోజులుగా దీక్ష […]
జగన్‌కు లక్ష మెజార్టీ అంటోన్న టీడీపీ నేతలు
2019 ఎన్నికల్లో విపక్ష వైకాపా అధినేత జగన్‌కు ఆయన సొంత జిల్లా కడపలో చుక్కలు చూపించాలని పక్కా ప్లాన్‌తో ఉన్న టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు ఆశలు నెరవేరేటట్టు లేవా? ఆయన లక్ష్యానికి సొంత పార్టీ తమ్ముళ్లే తూట్లు పొడుస్తున్నారా? ఒకరిలో ఒకరు కుమ్ములాటలతో పొద్దు పుచ్చుతున్నారా? కడపలో టీడీపీని బలహీనం చేస్తున్నారా? అటు తిరిగి ఇటు తిరిగి జగన్‌కే లబ్ధి చేకూరేలా ప్రవర్తిస్తున్నారా? అంటే.. ప్రస్తుతం కడపలో ఉన్న పొలిటికల్ సీన్‌ను చూస్తే.. ఔననే […]
కాపు కార్డుతో మంత్రి పదవికి గాలం
ఏపీలో కాపు ఉద్యమం సీఎం చంద్రబాబుతో పాటు అధికార టీడీపీని చాలా ఇబ్బందులకు గురి చేస్తోంది. ముద్రగడ పద్మనాభం ఎప్పుడైతే కాపు ఉద్యమం స్టార్ట్ చేశాడో అధికార టీడీపీలో ఉన్న కాపుల పరిస్థితి ముందు నుయ్యి ..వెనక గొయ్యిలా మారింది. పార్టీ గీసిన గీత దాటి ముందుకు వెళ్లనూ లేరు..అలాగని కాపుల కోసం ఏం మాట్లాడకుండా ఉండనూ లేరు అన్న చందంగా వీరి పరిస్థితి మారింది. ఈ టైంలో దాదాపు అందరూ టీడీపీ కాపు ప్రజాప్రతినిధులు గోడమీద […]
హెరిటేజ్ కి ఆ దూకుడు ఎందుకు
ఏపీ సీఎం చంద్రబాబు కుటుంబానికి చెందిన సంస్థ హెరిటేజ్ ఫ్రెష్. పాలు పాల ఉత్పత్తులు సహా రిటైల్ బిజినెస్ చేసే హెరిటేజ్ ఇప్పుడు మంచి ఊపుమీద ఉందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. హెరిటేజ్ షేర్లు ఈ నెల సెకండ్ వీక్‌లో అమాంతం ఆకాశానికి దూసుకుపోయింది. హెరిటేజ్ షేర్ బుధవారం రూ.888 వద్ద క్లోజ్ అయింది. ఈ మధ్య కాలంలో ఇంత మొత్తంలో కోట్ కావడం ఇదే తొలిసారని మార్కెట్ వర్గాలు తెలిపాయి. అయితే, గతంలో హెరిటేజ్ షేర్‌కు […]
ప్రభాస్‌ది మరీ ఓవర్ కాన్ఫిడెన్సా..!
టాలీవుడ్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయిన బాహుబలి ప్రాజెక్టు ప్రభాస్ మైండ్ సెట్‌నే మార్చేసిందా అన్న టాక్ టాలీవుడ్ ఇన్నర్ సర్కిల్స్‌లో స్టార్ట్ అయ్యింది. బాహుబలి తర్వాత ప్రభాస్ వచ్చే సమ్మర్‌లో బాహుబలి-2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. బాహుబలి-2 సైతం ఎన్నో రికార్డులు క్రియేట్ చేయడం ఖాయంగానే కనిపిస్తోంది. ఇంత వరకు బాగానే ఉంది. బాహుబలి-2 తర్వాత ప్రభాస్ తన సొంత బ్యానర్ లాంటిదైన యూవీ క్రియేషన్స్‌లో రెండు సినిమాలకు కమిట్ అయినట్టు […]
ఫిరాయింపు ఎమ్మెల్యేలకూ వెన్నులో వణుకు తప్పదు.
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను జంప్ జిలానీలుగా వ్యవహరిస్తున్నాం. వాళ్ళందరికీ ఇప్పుడు హైకోర్టు న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో వెన్నులో వణుకు మొదలైంది. తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి చేసిన ఫిర్యాదు మేరకు స్పందించిన న్యాయస్థానం, తెలంగాణ స్పీకర్‌కి స్పష్టమైన సూచనలు చేసింది ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని. హైకోర్టు తీర్పుపై స్పీకర్ స్పందించి, తమపై అనర్హత వేస్తే తమ భవిష్యత్తు ఏమవుతుందోననే బెంగతో తల్లడిల్లుతున్నారు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు. వీరిలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ కూడా ఉన్నారు. […]
పవన్ చేతిలో మూడు స్టోరీలు
రాజకీయ బహిరంగ సభలో పవన్‌కల్యాణ్ తన అభిమానుల్ని ఉద్దేశించి సినిమాల్ని వదిలెయ్యమంటారా? అని అడిగారు. ముక్తకంఠంతో వద్దు వద్దు అంటూ చేతులూపారు అభిమానులు. అంటే పవన్‌ని తెరపై చూడటం వాళ్లకి ఎంత ఇష్టమో ఆ సన్నివేశమే చెప్పింది. నిజానికి సినిమాల్ని వదిలిపెట్టాలని పవన్‌కల్యాణ్ ఎప్పుడో అనుకొన్నారు. కానీ అభిమానుల అభిప్రాయానికి విలువనిస్తూ ఒకపక్క రాజకీయంలో కొనసాగుతూనే మరోపక్క సినిమాలూ చేస్తున్నారు. ఇక పవన్ సినీ ప్రయాణం ఇప్పట్లో ఆగదన్న సంకేతాలు బలంగా రావడంతో ఆయనతో సినిమాలు తీయాలనుకొన్న […]