చంద్రబాబుకి పబ్లిసిటీ తగ్గిందోచ్‌!

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేసే ప్రతి పనికీ పబ్లిసిటీని కోరుకుంటుంటారు. పబ్లిసిటీ పొలిటీషియన్‌ అనే ఒక ఇమేజ్‌ బహుశా ఆయనకు మాత్రమే ఉందేమో. అదలా ఉంచితే, ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో పర్యటించిన చంద్రబాబు, దోమలపై దండయాత్ర పేరుతో కార్యక్రమం నిర్వహించారు. నిజానికి ఇది ప్రజోపయోగ కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమాల్లో ప్రజల్ని భాగస్వాములుగా చేయాల్సిన అవసరం ఉంది.  కానీ చంద్రబాబు ఆలోచనలకు తగ్గట్టుగా పార్టీ నాయకులు వ్యవహరించలేకపోతున్నారు. జనాన్ని తరలించలేకపోయిన స్థానిక నాయకులు, చంద్రబాబుతో వేదికపైనే […]

పవన్‌ స్పీడ్‌ని తట్టుకోగలరా?

లేట్‌ అయినా లేటెస్ట్‌గా పవన్‌కళ్యాణ్‌ ఎంట్రీ ఉంటుంది. సినిమా షూటింగ్‌కి అయినా అంతే. ‘కాటమరాయుడు’ షూటింగ్‌లో పవన్‌ పాల్గొంటున్నాడు. కంప్లీట్‌గా ప్రిపేర్‌ అయి, మైండ్‌ని పూర్తిగా సినిమా షూటింగ్‌ మీదనే పెట్టి పవన్‌ సెట్స్‌లో కనిపిస్తోంటే షూటింగ్‌ సిబ్బంది ఆశ్చర్యపోతున్నారట. అనుకున్న షెడ్యూల్‌ అనుకున్న విధంగా పూర్తి చేయడానికి పవన్‌ పూర్తి ప్లానింగ్‌ని ముందే ప్రిపేర్‌ చేశాడని సమాచారమ్‌. ఈ సినిమా షూటింగ్‌ని త్వరగా కంప్లీట్‌ చేయాలని పవన్‌ అనుకుంటున్నాడన్న సంగతి తెలిసిందే. అందుకు తగ్గట్టుగానే ‘కాటమరాయుడు’ […]

టి.కాంగ్రెస్‌కి ఉండవల్లి దెబ్బ

ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ చట్టం రూపొందిన తీరు గురించి, ఆ సమయంలో పార్లమెంటులో జరిగిన సంఘటలన గురించి పుస్తకం రాసి తెలుగు ప్రజల దృష్టిని తనవైపుకు తిప్పుకున్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌. దాంతో టి.కాంగ్రెస్‌ నాయకులు ఇప్పుడు తీరిగ్గా బాధపడుతున్నారట. తెలంగాణ తెచ్చింది తామేనని పుస్తక రూపంలో చెప్పుకోడానికి ఎవరూ సాహసించలేకపోయారు. ఉండవల్లి పుస్తకం రాయగా లేనిది తామెందుకు వెనుకబడి ఉన్నామో వారికి అర్థం కావడంలేదు. ముఖ్యంగా జైపాల్‌ రెడ్డి లాంటి సీనియర్‌ నాయకుడూ ఆ […]

పేస్ బుక్ లో పోస్టు పెడితే కేసే అంటోన్న మేయ‌ర్‌

కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వ‌ర్షాల‌తో హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలో జ‌న‌జీవ‌నం అస్త‌వ్య‌స్త‌మైంది. లోత‌ట్టు ప్రాంతాలు నీట మునిగిపోయాయి. ప‌లు ప్రాంతాల్లో అపార్ట్‌మెంట్ల‌లో సెల్లార్ల‌తోపాటు ఫ‌స్ట్ ఫ్లోర్ దాకా నీళ్లు రావ‌డంతో బ‌య‌ట‌కు వ‌చ్చే దారి కూడా లేక జ‌నం అల్లాడారు.రోడ్ల‌న్నీ చెరువులు, కాలువ‌ల‌ను త‌ల‌పించ‌డంతో ర‌వాణా కూడా స్తంభించింది. ఈ ప‌రిస్థితుల్లో తురక చెరువుల‌కు గండిపడే ప్రమాదం ఉన్నందున పరిసరాల్లోని వారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా జీహ‌చ్ఎంసీ మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ ప్ర‌జ‌ల‌కు సూచించారు. చెరువు ప్రాంతాల్లో నిర్మాణాలు […]

ఆర‌డుగుల బుల్లెట్ అంటున్న కవిత

క‌విత.. ఈ పేరు వింటే కాస్తో కూస్తో క‌న్‌ఫ్యూజ‌న్ ఉండొచ్చేమో కాని తెలంగాణ‌ జాగృతి క‌విత అంటే మాత్రం తెలియ‌నివారు దాదాపు ఉండ‌ర‌నే చెప్పాలి. జాగృతి సంస్థ ద్వారా…తెలంగాణ సంస్కృతికి దాదాపు బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా మారిపోయిందీ తెలంగాణ సీఎం గారాల‌ప‌ట్టి. తెలంగాణ ప్ర‌జ‌ల్లో సెంటిమెంట్‌ను ర‌గిలిస్తూ.. రాజ‌కీయాల‌ను పండించ‌డంలో తండ్రికంటే రెండాకులు ఎక్కువే చదివిందీమె. మాట‌ల మ‌రాఠీగా పేరుప‌డ్డ తండ్రితో స‌మానంగా మాట‌ల తూటాల‌ను విస‌ర‌గ‌ల‌న‌ని ఇప్ప‌టికే నిరూపించుకుంది కూడా… తెలంగాణ సీఎం కేసీఆర్ కు త‌న […]

చంద్ర‌బాబు రూమ్‌లో ప్ర‌త్య‌క్షం అయిన జ‌గ‌న్

ఎంత‌టి రాజ‌కీయ వైర‌మున్నా ఎన్నిక‌ల స‌మ‌యంలో మిన‌హాయిస్తే మిగిలిన సంద‌ర్భాల్లో.. అధికార‌, ప్ర‌తిప‌క్ష నేత‌లు ప‌రోక్షంగానైనా కాస్తో కూస్తో మ‌ర్యాదపూర్వ‌క‌మైన సంబంధాల‌ను నెరుపుతారు. అయితే ఏపీలో మాత్రం ప్ర‌స్తుతం ఆ ప‌రిస్థితి ఏమాత్రం క‌నిపించ‌డం లేదు. స‌మీప భ‌విష్య‌త్తులోనూ సాధ్య‌మ‌వుతుంద‌న్న న‌మ్మ‌క‌మూ క‌ల‌గ‌డం లేదు. టీడీపీ ప్ర‌భుత్వం పై అంశాల‌తో సంబంధం లేకుండా విభేదిస్తున్న‌ జ‌గ‌న్…చంద్ర‌బాబు విశ్వ‌స‌నీయ‌త‌ను దెబ్బ‌తీసేందుకు ప్ర‌భుత్వ పాల‌న‌లోని ఏ చిన్న లోపాన్ని వ‌ద‌ల‌కుండా విరుచుకుప‌డుతున్నారు. విప‌క్ష నేత‌ జ‌గ‌న్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికార […]

మారుతి మసాలా టేస్ట్‌ చేస్తారా?

‘బస్టాప్‌’, ఈ రోజుల్లో’ వంటి సినిమాల దర్శకుడు మారుతి అంటే మసాలా సినిమాలకి పెట్టింది పేరు. అయితే మారుతి ఘాటెక్కించే సినిమాలే కాదు, ఘాటెక్కించే వంటకాలతోనూ అలరిస్తానంటున్నాడు ఇప్పుడు.. ‘బస్‌ స్టాప్‌’ వంటి సినిమాలతో కొత్త ఆర్టిస్టులను తెలుగు తెరకు పరిచయం చేసి, చిన్న సినిమాలతోనే పెద్ద విజయాల్ని అందుకున్న దర్శకుడు మారుతి, తన పేరుని తెలుగు సినీ పరిశ్రమలో ఓ బ్రాండ్‌గా మార్చేశాడు. ‘ప్రేమకథా చిత్రమ్‌’, ‘భలే భలే మగాడివోయ్‌’ సినిమాలతో ట్రెండ్‌ మార్చి, తాను […]

ఎన్టీఆర్ ని తప్పించిన బన్నీ

టాలీవుడ్‌లో కొద్ది రోజులుగా చ‌ర్చ‌ల్లో ఉన్న బ‌న్నీ-లింగుస్వామి సినిమా ఎట్ట‌కేల‌కు ఓకే అయ్యింది. దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చేసింది. చాలా రోజులుగా లింగుస్వామి సినిమాపై నాన్చుతూ వ‌స్తోన్న బ‌న్నీ ఇప్పుడు హ‌ఠాత్తుగా ఈ సినిమాకు ఓకే చెప్ప‌డం వెన‌క పెద్ద క‌థే న‌డిచింద‌ని టాలీవుడ్ వ‌ర్గాలు అంటున్నాయి. గురువారం చెన్నైలో జ‌రిగిన ఈ సినిమా ప్రారంభోత్స‌వం పెద్ద అట్ట‌హాసంగా జ‌రిగింది. హీరోలు సూర్య, కార్తీ ఫ్యామిలీకి చెందిన జ్ఞానవేల్‌ రాజా ఈ కార్యక్రమం జరిపించారు. ఇక బ‌న్నీకి […]

కెసియార్‌ కన్నెర్రజేయబట్టే! 

హైదరాబాద్‌ని కనీ వినీ ఎరుగని రీతిలో జల విలయం కుంగదీస్తోంది. హైదరాబాద్‌ అంతటా భారీ వర్షాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఒక్కరోజు కాదు, రోజుల తరబడి హైదరాబాద్‌ జల విలయంలో విలవిల్లాడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది? అన్న ప్రశ్న బాధిత ప్రజానీకం నుంచి ఉత్పన్నమవడం సహజమే. భారీ వర్ష సూచనతో ముందస్తుగా అధికార యంత్రాంగం జాగ్రత్త పడి ఉంటే సమస్య తీవ్రత కొంచెం తగ్గేదే. కానీ ప్రభుత్వంలో ఉన్నవారు పూర్తిగా నిర్లక్ష్యం వహించారు. అతి ముఖ్యమైన అంశమ్మీద ఢిల్లీ […]